ISRO Landed Pushpak Suscessfully: పుష్పక్...ఇదో రీయూజబుల్ లాంచ్ వెహికల్. భారతదేశంలో తయారు అయిన ఈ రాకెట్‌ను భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ఈరోజు విజయవంతంగా ప్రయోగించింది. దీని మీద మూడోసారి టెస్ట్ నిర్వహించింది. ఉదయం 7 గంటలకు కర్ణాటకలోని డిఫెన్స్ ఎయిర్ ఫీల్డ్‌లోని చాలకెరె రన్‌వే నుంచి పరీక్షించారు. దీంతో రీయూజబుల్ రాకెట్ రంగంగలోకి మన దేశం కూడా చేరింది. ఈ పుష్పక్ వలన రాకెట్‌ను స్పేస్‌లోకి పంపించి మళ్ళీ భూమి మీదకు సురక్షితంగా తీసుకురావచ్చును. అలాగే కక్ష్యలో తిరుగుతున్న ఉపగ్రహాలకు ఈ రాకెట్ రీఫ్యూయలింగ్, రిఫర్బిష్ మెంట్, రిట్రీవ్ లాంటివి కూడా చేయవచ్చును.
రీయూజబుల్ రాకెట్ వలన అంతరిక్షంలో ఉపగ్రహ శకాలలాలను చాలా మట్టుకు తగ్గించవచ్చని చెబుతున్నారు ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్. పుష్పక్ ఆర్ ఎల్వీ ఈ పనిని సమర్ధవంతంగా నిర్వహించగలదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పుష్పక్‌ను తయారు చేయడానికి, అభివృద్ధి చేయడానికి దాదాపు పదేళ్ళు పట్టింది. మొట్టమొదటిసారి 2016లో శ్రీహరికోట నుంచి పుష్పక్‌ను పంపించారు. అప్పుడు కూడా దీనిని బంగాళాఖాతం మీద సురక్షితంగా ల్యాండ్ చేయగలిగారు. కానీ దానిలో నుంచి బయటకు రాలేక సముద్రంలో మునిగిపోయింది. రెండో సారి 2023లో ఇదే కర్ణాటక నుంచి ప్రయోగించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాఫ్టర్ చినూక్ సాయంతో దీనిని తీసుకెళ్ళి జారవిడిచారు. అది కూడా సక్సె అయింది. అయితే ఇంకా కొన్ని సాంకేతిక లోపాలు కనిపించాయి. దాంతో వాటిని అభివీద్ధి చేసి ఇప్పుడు మళ్ళీ ప్రయోగించారు. మూడోసారి పుష్పక్ అన్నిరకాలుగా విజయవంతం అయిందని సోమనాథ్ తెలిపారు.
పుష్పక్ రామాయణంలో పుష్పకవిమానం టైప్‌లో ఉందని..అందుకే తానికి ఈ పేరు పెట్టామని చెబుతున్నారు సోమనాథ్. భవిష్యత్తులో భారత అంతరిక్ష పరిశోధనలకు ఇది చాలా ఉపయోగపడుతుందని తెలిపారు. దీనివలన బోలెడు ఆదాయం కూడా రానుందని చెబుతున్నారు. పుష్పక్ ఆర్ ఎల్వీ పొడవు 6.5మీటర్లు, బరువు 1.75 టన్నులు ఉంది. ఐఏఎఫ్ హెలికాఫ్టర్ సాయంతో దీనని ప్రయోగిస్తారు. దీనిని తయారు చేయడానికి కేంద్రం 100కోట్లను ఇస్రోకు కేటాయించింది.
Also Read:International: తోకతో పుట్టిన చిన్నారి..చైనాలో వింత జననం