ISRO: నింగిలోకి దూసుకెళ్లిన GSLV-F14 రాకెట్ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన మరో ప్రయోగం విజయవంతమైంది, శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి GSLV-F14 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. By B Aravind 17 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ నెల్లూరు New Update షేర్ చేయండి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన మరో ప్రయోగం విజయవంతమైంది, శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి శనివారం సాయంత్రం 5.35 గంటలకు GSLV-F14 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఇన్‌శాట్ - 3 ఉపగ్రహాన్ని GSLV-F14 రాకెట్‌ను మోసుకెళ్లింది. 18 నుంచి 19 నిమిషాల్లోనే ఇది నిర్ణీత కక్షకు చేరుకునేలా శాస్త్రవేత్తలు రూపొందించారు. వాతారవరణ విపత్తులతో పాటు భూమి, సముద్ర ఉపరితలంపై పరిశోధనలు చేసి ఇన్‌శాట్ - 3 శాటిలైట్ కీలక సమాచారాన్ని అందించనుంది. గతంలో ప్రయోగించిన ఇన్‌శాట్–3డీ, ఇన్‌శాట్–3డీఆర్ ఉపగ్రహాలకు కొనసాగింపుగానే.. ఇన్‌శాట్–3డీఎస్‌ని పంపుతున్నట్లు ఇస్రో ప్రకటించింది. Also Read: బాణాసంచా తయారీ కార్మాగారంలో పేలుడు.. 10 మంది మృతి.. సుమారు 2,275 కిలోల బరువున్న ఇన్‌శాట్–3డీఎస్ ఉపగ్రహంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన పేలోడ్లున్నాయి. అయితే ఈ పేలోడ్లు వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరికల కోసం మెరుగైన వాతావరణ పరిశీలన, భూమి, సముద్ర ఉపరితలాల మార్పులను పర్యవేక్షిస్తూ సమాచారాన్ని అందించనుంది. పదేళ్లపాటు ఈ ఉపగ్రహం సేవలను అందించనుంది. Also Read: షర్మిల విమర్శలు.. మేనల్లుడి పెళ్లికి జగన్ దూరం! #isro #sriharikota #gslv-f14 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి