ISRO Free Course: ప్రపంచవ్యాప్తంగా ఇస్రో పేరు మారుమోగుతోంది. అంతరిక్ష ప్రయోగాలకు పెట్టింది పేరైన రష్యాకే సాధ్యంకాని ఘనతలను సాధిస్తోంది భారత్ అంతరిక్ష సంస్థ ఇస్రో. చంద్రయాన్-3(chandrayaan-3) ప్రయోగం సక్సెస్ అయ్యేందుకు టైమ్ దగ్గరపడింది. మరోవైపు అంతరిక్షం గురించి తెలుసుకోవాలన్న ఆలోచన అందరికి ఉంటుంది. స్పేస్ విషయాలను నెట్‌లో సెర్చ్ చేసే శోధించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అసలు రాకెట్లు, శాటిలైట్లు లాంటివి కనపిస్తే చాలు ప్రజలు ఆ విషయం గురించి తెలిసినా తెలియకపోయినా వాటి లింకులపై క్లిక్ చేస్తుంటారు. ముఖ్యంగా విద్యార్థులకు అంతరిక్ష విషయాలపై నాలెడ్జ్ పెంచుకోవాలన్న తపన ఉంటుంది. అలాంటి వారికి ఇస్రో గుడ్‌న్యూస్ చెప్పింది.
• అక్టోబర్‌లో కోర్సు:
అంతరిక్ష పరిస్థితులపై అవగాహన కోసం మూడు రోజుల పాటు విద్యార్థుల నుంచి ఇస్రో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అక్టోబర్ 12, 13, 14 తేదీలలో బెంగుళూరులోని ISRO ప్రధాన కార్యాలయంలో ఈ కోర్సు నిర్వహించనున్నారు. ఇస్రో శాస్త్రవేత్తలతో సెషన్‌లను ఏర్పాటు చేస్తారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ కోర్సుకి అప్లై చేసుకోవచ్చు. ఇక సైన్స్ ఫిల్డ్‌లోనే పనిచేస్తున్న పరిశోధకులు, అధ్యాపకుల నుంచి కూడా దరఖాస్తులు స్వీకరిస్తోంది ఇస్రో.
అంతరిక్ష రంగంలో పనిచేయాలని ఆశించే విద్యార్థులు, కంపెనీ, ఏజెన్సీ లేదా స్టార్టప్‌లకి ఈ కోర్సు ఉపయోగపడుతుంది. స్పేస్ సిట్యువేషనల్ అవేర్‌నెస్ అండ్ స్పేస్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ కీలకమైన అంశంగా ఈ కోర్సును అందిస్తున్నట్లు ఇస్రో తెలిపింది. మానవ నైపుణ్యం, కక్ష్య(orbit) సమాచారం కోసం రాడార్లు, టెలిస్కోప్‌లు, అంతరిక్ష-ఆధారిత ప్లాట్‌ఫామ్స్ గురించి విద్యార్థులకు సైంటిస్టులు చెబుతారు.
• ఇస్రో ఉచిత కోర్సు కోసం ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
కాలేజీలు, యూనివర్శిటీలు లేదా ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి కింది కోర్సులను అభ్యసిస్తున్న ఇండియన్స్ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
‣ 4వ సంవత్సరం చదువుతున్న బీఈ లేదా బీటెక్ విద్యార్థులు.
‣ అన్ని శాఖలకు చెందిన ఎంఈ(ME), ఎంటెక్(MTech), ఎమ్మెస్సీ(MSc) విద్యార్థులు.
‣ పూర్తి సమయం లేదా పార్ట్‌టైమ్ పీహెచ్‌డీ విద్యార్థులు లేదా రీసెర్చ్ స్కాలర్‌లు
‣ భారతీయ విద్యాసంస్థల ఫ్యాకల్టీ సభ్యులు.
మూడు రోజుల కోర్సులో మొత్తం 200 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కోర్సు కోసం పాల్గొనేవారిని ఎంపిక చేయడానికి ఆన్‌లైన్ క్విజ్ నిర్వహించవచ్చు. క్విజ్‌తో పాటు, ఎంపిక ప్రక్రియ కోసం విద్య అర్హతను కూడా పరిగణనలోకి తీసుకునే ఛాన్స్ ఉంది.
• ఎలా దరఖాస్తు చేయాలి?
ఆసక్తి ఉన్న విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఆగష్టు 30లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన విద్యార్థుల ఫలితాలు సెప్టెంబర్ 12న ప్రకటిస్తారు. ఆన్‌లైన్ క్విజ్ సెప్టెంబర్ మొదటి వారంలో నిర్వహిస్తారు. లాగిన్ క్రెడెన్షియల్ ఇస్తారు. క్విజ్‌లో అంతరిక్ష పరిస్థితుల అవగాహనపై 20 ప్రశ్నలు ఉంటాయి, వాటిని పది నిమిషాల్లో సమర్పించాలి. దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ని చెక్ చేయండి.