ISRO Chief Somnath Detected with Cancer: ప్రాణాలకు తెగించి దేశం కోసం పని చేయడమంటే ఏంటో ఇస్రో చీఫ్ సోమనాథ్ నుంచి నేర్చుకోవాలి. సన్ మిషన్ ఆదిత్య L-1 (Aditya L1) ప్రారంభించిన రోజున సోమనాథ్‌కు క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. అయినప్పటికీ ఆయన భయపడలేదు. ఈ విషయాన్ని స్వయంగా సోమనాథ్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. తార్మాక్ మీడియా హౌస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సోమనాథ్ చెప్పిన విషయాలు ప్రజలకు షాక్‌కు గురిచేశాయి. స్కానింగ్‌లో క్యాన్సర్ పెరుగుదలను కనుగొన్నట్లు చెప్పారు. చంద్రయాన్-3 మిషన్ ప్రయోగ సమయంలో తాను కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నానని సోమనాథ్ (S.Somnath) చెప్పారు. అయితే ఆ సమయంలో ఈ ఆరోగ్య సమస్య గురించి స్పష్టంగా తెలియలేదన్నారు.
వారందరూ నాకు అండగా నిలిచారు:
ఆదిత్య ఎల్-1 మిషన్‌ను ప్రారంభించిన రోజున తనకు క్యాన్సర్ ఉందని నిర్ధారణ అయినట్లు సోమనాథ్ తెలిపారు. ఈ వ్యాధి తనకే కాదు తన కుటుంబంతో పాటు సహోద్యోగులకు కూడా షాక్‌కు గురి చేసిందన్నారు. ఛాలెంజింగ్ టైమ్‌లో వాళ్లంతా తనతో ఉన్నారన్నారు సోమనాథ్. దేశపు మొదటి సన్ మిషన్ ఆదిత్య L-1 తన ప్రయాణాన్ని సెప్టెంబర్ 2, 2023న ప్రారంభించిన విషయం తెలిసిందే. అదే రోజు సోమనాథ్ రొటీన్ చెకప్ కోసం ఆస్పత్రికి వెళ్లారు. ఆ రోజే ఆయన కడుపులో క్యాన్సర్ ఉన్నట్టు డాక్టర్లు చెప్పారు.
ఎలాంటి భయం లేకుండా:
ఈ వ్యాధి గురించి తెలిసిన తరువాత క్రాస్ చెకింగ్ కోసం ఆయన చెన్నైలోని ఆస్పత్రికి వెళ్ళారు. అక్కడ కూడా ఆయనకు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. వంశపారంపర్య వ్యాధి ఉన్నట్లు తెలిసింది. కొద్ది రోజుల్లోనే ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కీమోథెరపీ చికిత్స తీసుకున్నారు. క్యాన్సర్‌ను నయం చేయడానికి ఆయనకు ఒక ఆపరేషన్ కూడా చేసినట్టు సమాచారం. ఎలాంటి భయం లేకుండా వ్యాధికి చికిత్స చేయించుకున్నానని సోమనాథ్ చెప్పుకొచ్చారు. ఆ సమయంలో తాను పూర్తిగా కోలుకుంటానని నమ్మకం లేదని.. అయితే తాను కోలుకోవడం ఒక అద్భుతమేనన్నారు.
Also Read: స్పానిష్ మహిళపై సామూహిక అత్యాచారం..థ్రెడ్‌లో భర్త ఆవేదన!