Israel News: గాజా సెక్యూరిటీ ఫెన్స్ వద్ద సాహసోపేతమైన ఆపరేషన్ నిర్వహించి 250 మంది బందీలను కాపాడాయి ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్స్ బృందాలు.
ఇందులలో 60 మంది హమాస్ మిలిటెంట్లను మట్టుబెట్టారు. మరో 26 మందిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే హమాస్ సౌత్ డివిజన్ కమాండర్‌నీ అరెస్ట్ చేశారు. ఈ ఆపరేషన్‌కి సంబంధించిన ఓ వీడియోని IDF ట్విటర్‌లో విడుదల చేసింది.
డిఫెన్స్ బలగాలు దాడులు చేస్తున్నప్పుడు ఓ సైనికుని దుస్తులకు ఉన్న కెమెరాలో ఈ దృశ్యాలు బంధించబడ్డాయి. ఈ వీడియోలో ఇజ్రాయేల్ సైనికులు మిలిటెటంల్ స్థావరాల్లోకి దూసుకెళ్ళడం, కాల్పులు చేయడం గమనించవచ్చును. కొందరు కాల్పులు చేస్తుండగా మరికొందరు గ్రనేడ్‌లు విసురుతూ ఉగ్రవాదులను చుట్టుముట్టారు. అటాక్ చేయండి అని కమాండర్ అనడం, గన్ తీయండి..గురి పెట్టండి అని మరో సోల్జర్ గట్టిగా అరవడం ఈ వీడియోలో కనిపిస్తుంది. దీనిబట్టి అక్కడ ఎంత ఉద్రిక్త వాతావరణం ఉందో అర్థమైపోతుంది. దాదాపు ఏడు రోజులుగా ఇజ్రాయేల్, పాలస్తీనా మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. ఈ యుద్ధం కారణంగా ఇజ్రాయేల్‌లో 12 వందల మంది, గాజా స్ట్రిప్ వద్ద మరో 14 వందల మంది ప్రాణాలు కోల్పోయారు.
మరోవైపు గాజాపై భూ దాడికి సిద్ధమైంది ఇజ్రాయెల్. దీనికి సంబంధించి 11 లక్షల మంది పాలస్తీనియన్లకు ఇజ్రాయెల్ డెడ్‌లైన్ ఇచ్చింది. 24 గంటల్లో దక్షిణ దిశకు వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే గాజాకు నిత్యావసరాల సరఫరాను ఇజ్రాయెల్ నిలిపేసింది. ఇప్పటివరకు వైమానిక దాడులకు మాత్రమే పరిమితమైన ఇజ్రాయెల్ సైన్యం ఇప్పుడు భూతల యుద్ధానికి సన్నద్ధమవుతోంది. గాజాలో అడుగుపెట్టి ప్రతీ ఇంటినీ గాలించి మిలిటెంట్లను ఏరిపారేయాలని అనుకుంటోంది. పాలస్తీనా మిలిటెటంట్లను సమూలంగా నాశనం చేయడమే లక్ష్యంగా కదులుతోంది. యుద్ధానికి తమ పదాధిదళపతులు రెడీగా ఉన్నారని…ప్రభుత్వం నుంచి సిగ్నల్ రావడమే ఆలస్యమని చెబుతున్నారు ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ రిచర్డ్ హెచ్ట్. భూతల యుద్ధం కోసం 3.60 లక్షల మంది సైన్యాన్ని రిజర్వ్ చేశామని తెలిపారు. ఇందుకోసం ఇజ్రాయెల్-గాజా సరిహద్దుల్లో ఉన్న యూదు కాలనీలను ఖాశీ కూడా చేయించారు.
Also Read: మేము సైతం అంటూ యుద్ధంలో మాజీ ప్రధాని, మోడల్ ఫదీప్..!!