Israel-Hamas: హమాస్ దాడుల నుంచి ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడిన టెస్లా కారు.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే

హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై దాడి చేసి యుద్ధానికి తెరలేపారు. మహిళలు, పసిపిల్లలను హతమార్చారు. ఇలాంటి తరుణంలో హమాస్ దాడుల నుంచి టెస్లా కారు సాయంతో ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడటం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇందుకు సంబంధించి ఇజ్రాయెల్ ఫ్రీడమ్ పార్టీ నేత గిలాద్ ఆల్పర్ ఎక్స్‌లో షేర్ చేశారు. అయితే ఆ బాధితుడి వివరాలు మాత్రం వెల్లడించలేదు.

Cars Recall: 2లక్షల కార్లను రీకాల్ చేసిన టెస్లా..కారణం ఇదే..!!
New Update

హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై దాడి చేసి యుద్ధానికి తెరలేపారు. మహిళలు, పసిపిల్లలను హతమార్చారు. ఇలాంటి తరుణంలో హమాస్ దాడుల నుంచి టెస్లా కారు సాయంతో ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడటం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇందుకు సంబంధించి ఇజ్రాయెల్ ఫ్రీడమ్ పార్టీ నేత గిలాద్ ఆల్పర్ ఎక్స్‌లో షేర్ చేశారు. అయితే ఆ బాధితుడి వివరాలు మాత్రం వెల్లడించలేదు. హమాస్ దాడిని మొదట ఎదుర్కొన్న ఓ వ్యక్తి.. తన ప్రాణాలను రక్షించుకునేందుకు అతనికి టెస్లా కారు సాయపడిన తీరు అద్భతం అంటూ గిలాద్ రాసుకొచ్చారు. ఆ వ్యక్తి చెప్పిన విషయాలను గిలాద్ ఈ విధంగా వివరించారు. హమాస్‌ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై దాడి చేశారని తెలియడంతో.. అత్యవసర బృందాలకు అధికారుల నుంచి పిలుపు వచ్చింది. అందులో నేను ఒక సభ్యుణ్ని. ఈ విషయం తెలుసుకున్నాక వెంటనే నా టెస్లా మోడల్‌ 3 కారులో అసెంబ్లీ పాయింట్‌కు బయలుదేరాను. అలా రోడ్డుపై వెళ్తుండగా.. నన్ను పది అడుగుల దూరం నుంచి హమాస్ మిలిటెంట్లు చూశారు. ఆ తర్వాత నా కారు ముందు, కుడి భాగం వైపు కాల్పులు జరిపారు. అయితే నేను నడిపేది ఎలక్ట్రిక్ కారు అనేది వాళ్లకు తెలియదు.

కారు ముందు భాగం ఇంజిన్ అలాగే కుడివైపు డీజిల్ ట్యాంకు ఉంటాయని అనుకొని కాల్పులు జరిపారు. కానీ టెస్లా మోడల్ కార్లకు ముందు భాగం స్టోరేజ్ ఉంటుంది. కాల్పులు జరిగినా కూడా నేను ఆగకుండా వేగంగ కారును ముందుకు పొనిచ్చాను. దీంతో వారు టైర్లు, కారు ముందువైపు ఉన్న అద్దం, కుడివైపు డోర్‌పై కాల్పులు జరిపగా.. నా కాలు, తలకు బుల్లెట్ గాయాలయ్యాయి. నేను కారు వేగాన్ని మరింత పెంచగా.. కొద్ది దూరం పాటు వాళ్లు నన్ను వెంబడించారు. కానీ టెస్లా వేగాన్ని అందుకోలేకపోయారు. టైర్లు దెబ్బతిన్నా కూడా.. టెస్లాలోని డ్యూయల్‌ మోటార్‌ ఆల్‌ వీల్‌ డ్రైవ్‌ సిస్టమ్‌ యాక్టివేట్‌ కావడం వల్ల కారు ఎక్కడా ఆగకుండా ముందుకు వెళ్లింది. నాకు రక్తం కారుతున్నా కూడా కారును డ్రైవ్ చేసుకుంటూ దగ్గర్లోని ఆసుపత్రికి చేరుకున్నారను అని ఆ వ్యక్తి చెప్పిన మాటాలను గిలాద్ ఎక్స్‌లో తెలిపారు.

ప్రస్తుతం ఆ వ్యక్తి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. అతడు ఆసుపత్రికి వెళ్లిన తర్వాత అతడ్ని కారు నుంచి బయటకు తీసేందుకు కారు అద్దాలు పగలగొట్టాల్సి వచ్చిందని సహాయక బృందాలు తెలిపాయి. కారుపై ఏకంగా 100కు పైగా బుల్లెట్ రంధ్రాలున్నాయని.. విండ్ షీల్డ్ గట్టింగా ఉండటం వల్ల అతడు ప్రాణాలతో బయటపడ్డాడని పేర్కొన్నారు. అయితే ఈ సంఘటనకు సంబంధించిన విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ స్పందించారు. అతడు ప్రాణాలతో బయటపడినందుకు ఆనందంగా ఉందంటూ ట్విట్ చేశారు.

#tesla #israel-hamas-war #hamas-israel-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe