Iran Vs Israel: ఇరాన్ పై బాంబులు కురిపించిన ఇజ్రాయెల్! ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు భయాందోళనలు కలిగిస్తున్నాయి.మిస్సైళ్లు, డ్రోన్లతో ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని అప్పుడే ఇజ్రాయెల్ చెప్పింది. ఈ క్రమంలోనే ఇరాన్ మీద ఇజ్రాయెల్ బాంబులతో దాడికి దిగింది. By Bhavana 19 Apr 2024 in క్రైం ఇంటర్నేషనల్ New Update షేర్ చేయండి Iran Vs Israel: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు భయాందోళనలు కలిగిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం వందలకొద్ది మిస్సైళ్లు, డ్రోన్లతో ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని అప్పుడే ఇజ్రాయెల్ చెప్పింది. ఈ క్రమంలోనే ఇరాన్ లోని ఓ సైట్ పైకి ఇజ్రాయెల్ క్షిపణిని ప్రయోగించదనే వార్తలు బయటకు వచ్చాయి. అయితే ఈ వార్తల గురించి అమెరికా స్పందించింది. ఇరాన్ నగరంలోని ఇసాఫహాన్‌లోని విమానాశ్రయంలో పేలుడు శబ్దం వినిపించిందని, అయితే కారణం వెంటనే తెలియరాలేదని ఇరాన్‌కు చెందిన ఓ వార్తా సంస్థ వివరించింది. దీంతో అనేక విమానాలు ఇరాన్ గగనతలం నుంచి మళ్లించబడ్డాయని సీఎన్ఎన్ తెలిపింది.ఏప్రిల్ 1న ఇజ్రాయిల్, సిరియా డమాస్కస్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయంపై వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్‌కి చెందిన ఇద్దరు కీలక జనరల్స్‌తో పాటు పలువురు ఇరాన్ అధికారులు మరణించారు. అయితే, ఈ దాడితో ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్ గత శనివారం ఇజ్రాయిల్‌పై దాడి చేసింది. ఇజ్రాయిల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ చాలా వరకు ఇరాన్ డ్రోన్లు, మిస్సైళ్లను ఆకాశంలోనే అడ్డుకుని కుప్పకూల్చాయి. గురువారం ఐక్యరాజ్యసమితి ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఇజ్రాయిల్ తమ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఏదైనా తదుపరి సైనిక చర్యలకు పాల్పడకుండా ఆపాలని ఇరాన్ యూఎన్‌కి చెప్పింది. #BREAKING Iran's semi-official Mehr News Agency says this video shows the Iranian air defense system which has been activated in Isfahan. pic.twitter.com/MdG1cH1lth — Iran International English (@IranIntl_En) April 19, 2024 Also read: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ హత్యకు కుట్ర.. వ్యక్తి అరెస్ట్! #attack #iran #drones #iran-vs-israel మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి