Israel-Hamas: కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ సిద్ధం.. అమెరిక ఉన్నతాధికారి కీలక వ్యాఖ్యలు హమాస్ వద్ద బందీలుగా ఉన్నవారిని విడిచిపెట్టేందుకు ఒప్పుకుంటే.. ఆరువారాల పాటు కాల్పుల విరమణ చేసేందుకు ఇజ్రాయెల్ సిద్ధంగా ఉన్నట్లు అమెరికా ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. అయితే హమాస్ మాత్రం తన వైఖరిపై స్పందించలేదని చెప్పారు. By B Aravind 03 Mar 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Israel-Hamas War: ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ భీకర దాడుల్లో ఇప్పటికే వేలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. గాజాలో అయితే పరిస్థితులు రోజురోజుకి క్షిణించిపోతున్నాయి. హమాస్‌ల వద్ద బందీలుగా ఉంటున్నవారిని విడిపించాలని ఇజ్రాయెల్‌పై ప్రజల నుంచి ఒత్తిడి పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్‌కు సంబంధించి అమెరికాకు చెందిన ఓ ఉన్నతాధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ అంగీకరించినట్లు పేర్కొన్నారు. అయితే హమాస్ మాత్రం తన వైఖరిపై స్పందించలేదని చెప్పారు. Also read: భారత మీడియాపై చైనా ఆగ్రహం.. కారణం ఏంటంటే రంజాన్ వస్తున్న నేపథ్యంలో.. హమాస్ వద్ద బందీలుగా ఉన్నవారిని విడిచిపెట్టేందుకు ఒప్పుకుంటే.. ఆరువారాల పాటు కాల్పుల విరమణ చేసేందుకు ఇజ్రాయెల్ రెడీగా ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం హమాస్ వద్ద వృద్ధులు, మహిళలు, గాయపడినవారు, అనారోగ్యంతో బాధపడేవారు ఉన్నారని.. వాళ్లని వదిలేసేందుకు హమాస్ ఒప్పుకుంటే.. తక్షణమే కాల్పుల విరమణ అమల్లోకి వస్తుందని చెప్పారు. అయితే మార్చి 10 నుంచి రంజాన్ నెల ప్రారంభం కానున్న దృష్ట్యా ముందుగానే ఇరువర్గాలు మధ్య ఒప్పందాలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆహార పొట్లాలు జారవిడిచిన అమెరికా ఇదిలాఉండగా.. ఇప్పటికే యుద్ధం వల్ల గాజాలో ఆహార సంక్షోభం తలెత్తింది. తిండి లేక అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. మానవతా సాయం అందించేందుకు వచ్చే అమెరికా ట్రక్కులపై కూడా దాడులు జరిగాయి. దీంతో గాజా ప్రజల్ని ఆదుకునేందుకు అమెరికా మరోసారి రంగంలోకి దిగింది. శనివారం మూడు సైనిక రవాణా విమానాలతో.. ఏకంగా 38 వేల ఆహార పొట్లాలను జారవిడిచింది. జోర్డాన్ సమన్వయంతోనే ఆహార పొట్లాల పంపిణీ ప్రారంభమైంది. అయితే ఈ మానవతా సాయం నిరంతర ప్రక్రియ అని వైట్‌హౌస్ ప్రతినిధి ఒకరు తెలిపారు. Also Read: విద్యార్థులకు గుడ్ న్యూస్.. విదేశీ విద్యకు రూ.20 లక్షల ఆర్థిక సాయం! #telugu-news #gaza-strip #israel-hamas-war #hamas-israel-war #israel-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి