Israel India: ఇజ్రాయెల్‌కు లక్ష మంది భారతీయ కార్మికులు.. ఎందుకో తెలుసా?

హమాస్‌తో యుద్ధం కారణంగా భవన కార్మికుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఇజ్రాయెల్‌ ఇండియాను హెల్ప్ అడిగినట్లుగా సమాచారం. లక్షమంది భవన కార్మికులను ఇజ్రాయెల్‌ పంపాల్సిందిగా బెంజమిన్ సర్కార్‌ భారత్‌ను కోరినట్లు తెలుస్తోంది.

New Update
Israel India: ఇజ్రాయెల్‌కు లక్ష మంది భారతీయ కార్మికులు.. ఎందుకో తెలుసా?

Israel vs Hamas: ఇజ్రాయెల్‌-ఇండియా దౌత్య సంబంధాలు 1992 నుంచి కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్-హమాస్ వివాదానికి తక్షణం ముగింపు పలకాలని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఓటింగ్ కోరగా.. ఇటీవల ఇండియా ఓటుకు దూరంగా నిలిచింది. ఇది పరోక్షంగా ఇజ్రాయెల్‌కు మేలు చేసేలానే ఉందన్న వాదన ఉంది. ఇటు ట్రేడ్‌ విషయంలోనూ ఇరు దేశాలు పరస్పరం సహకరించుకుంటాయి. మరోసారి అదే ప్రూవ్‌ అయ్యేలా కనిపిస్తోంది. కార్మికుల కొరతతో ఇబ్బంది పడుతున్న ఇజ్రాయెల్‌ను ఇండియా ఆదుకోనుందని తెలుస్తోంది.

publive-image VOAలో పబ్లిష్ అయిన ఆర్టికల్

నెల రోజులుగా యుద్ధం:
ఇజ్రాయెల్‌-హమస్‌ మధ్య నెల రోజులుగా యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అక్టోబర్‌ 7న ఈ యుద్ధం మొదలైంది. అప్పటినుంచి ఇజ్రాయెల్‌లో భవన కార్మికుల కొరత ఏర్పాడింది. ఎందుకంటే ఇజ్రాయెల్‌ భవన కార్మికుల్లో 25శాతం పాలస్తీనియన్లు ఉంటారు. వారందరిని ఇజ్రాయెల్‌ తమ ప్లేస్‌లకు పంపేసింది. అందులో చాలా మంది గాజా నివాసితులు.. మరికొంతమంది వెస్ట్ బ్యాంక్‌లో ఉండే పాలస్తీనియన్లు. వీరంతా కలిపి 90 వేల కంటే ఎక్కువే ఉంటారని సమాచారం. యుద్ధానికి సెంట్రిక్‌ కూడా గాజానే కావడంతో పాలస్తీనియన్లను పంపేసింది ఇజ్రాయెల్. ఇప్పుడు వారని రిప్లేస్‌ చేయడం కష్టంగా మారింది.

ఇండియావైపే చూపు:
ఇటీవల కాలంలో ఏదైనా హెల్ప్ కావాలంటే ప్రపంచదేశాలు ఇండియావైపే చూస్తున్నాయి. కరోనా సమయంలోనూ చాలా దేశాలకు ఇండియా సాయం చేసింది. ఇటు ఇజ్రాయెల్‌ ఇండియాకు మిత్రపక్షమే కావడంతో మరోసారి భారత్‌వైపే చూసింది. భారత్‌ నుంచి లక్ష మంది భవన కార్మికులు కావాలని ఇండియాను ఇజ్రాయెల్‌ సంప్రదించిందని యూఎస్‌ ప్రముఖ మీడియా సంస్థ 'వాయిస్‌ ఆఫ్‌ అమెరికా' ఓ కథనాన్ని ప్రచురించింది. అయితే ఈ విషయంపై భారత్‌ ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు. అటు మోదీ ఇటీవలే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును కలిశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. ఇక గత మేలో ఇజ్రాయెల్ భారత్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ 42,000 మంది భారతీయులు ఇజ్రాయెల్‌లో పని చేయడానికి వీలు కల్పిస్తుంది. నర్సింగ్‌తో పాటు నిర్మాణ రంగంలోని వర్కర్స్‌ కోసం ఈ డీల్ జరిగింది.

Also Read: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం గురించి ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ చర్చలు

WATCH: 

Advertisment
Advertisment
తాజా కథనాలు