Israel-Hamas War: హమాస్ మిలిటెంట్ల చెరలో 222 మంది బందీలు.. స్పందించిన ఇజ్రాయెల్..

గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న నేపథ్యంలో ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం హమాస్ మిలిటెంట్ల చెరలో 222 మంది బందీలుగా ఉన్నట్లు ఐడీఎఫ్‌ అధికార ప్రతినిధి ప్రకటన చేశారు. ఇదే చివరి సంఖ్య కాదని.. కనిపించకుండా పోయిన వారి కోసం ప్రస్తుతం మిలిటరీ దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ఇక హమాస్ దాడి జరిగిన అనంతరం 13 కుటుంబాలకు చెందిన 21 మంది చిన్నారులు అనాథలుగా మారిపోయారని తాజాగా ఇజ్రాయెల్‌ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Israel-Hamas War: హమాస్ మిలిటెంట్ల చెరలో 222 మంది బందీలు.. స్పందించిన ఇజ్రాయెల్..
New Update

హమాస్ మిలిటెంట్లు జరిపిన ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంటున్న ఇజ్రాయెల్.. గాజా నగరంపై విరుచుకుపడుతోంది. రాత్రి సమయాల్లో పరిమిత స్థాయిలో ఈ దాడులు నిర్వహించినట్లు ఇజ్రాయెల్‌ మిలిటరీ తెలిపింది. తమదేశంపై దాడులు జరిపేందుకు హమాస్ మిలిటెంట్లు‌ సమావేశమైన స్థావరాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టామని ఇజ్రాయెల్ తెలిపింది. అయితే ఇందులో సాయుధ, పదాతిదళాలు కూడా పాల్గొన్నట్లు పేర్కొంది.ఇక తదుపరి దశలో.. యుద్ధానికి సిద్ధమయ్యే మిలిటెంట్లను అంతం చేయడమే ఈ దాడుల ఉద్దేశమని ఇజ్రాయెల్‌ మిలిటరీ(ఇజ్రాయెల్ డిఫెన్స్‌ ఫోర్సెస్‌) ప్రతినిధి రేర్‌ అడ్మిరల్ డానియల్ హగారీ వెల్లడించారు.అంతేకాదు ప్రస్తుతం హమాస్ చేతిలో బందీలుగా మారిపోయిన వారిని గుర్తించే ప్రయతాలు కూడా జరగుతున్నాయని చెప్పారు. గత 24 గంటల్లోనే గాజాలోని ఏకంగా 320 లక్ష్యాలపై దాడి చేశామని పేర్కొన్నారు.

ఇక ఇజ్రాయెల్‌ నుంచి ఈ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో హమాస్ నుంచి కూడా ఓ ప్రకటన వెల్లడైంది. ఇజ్రాయెల్‌ దళానికి చెందిన సామాగ్రిని తాము ధ్వంసం చేసినట్లు తెలిపింది. అంతేకాదు ఆ బలగాలు వెనక్కివెళ్లేలా ఒత్తిడి తీసుకొచ్చామని చెప్పింది. అయితే ఇప్పటికీ లక్షలాది మంది సామాన్య పౌరులు గాజాలోని ఉత్తర ప్రాంతంలోనే ఉన్నట్లు సమాచారం. వాళ్లందరూ దక్షిణ ప్రాంతానికి తరలివెళ్లాలని ఇజ్రాయెల్‌ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.

Also Read: ప్రతి 15 నిమిషాలకు ఒక చిన్నారి మృతి.. 5వేల మంది అమాయకులను బలితీసుకున్న యుద్ధం!

మరోవైపు గాజాలోని హమాస్‌ చెరలో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్‌, ఇతర దేశాల పౌరుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం హమాస్ మిలిటెంట్ల వద్ద 222 మంది బందీలుగా ఉన్నట్లు ఐడీఎఫ్‌ అధికార ప్రతినిధి ప్రకటన చేశారు. అయితే.. ఇదే చివరి సంఖ్య కాదని.. కనిపించకుండా పోయిన వారి కోసం ప్రస్తుతం మిలిటరీ దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. మరో విషయం ఏంటంటే.. హమాస్ దాడి జరిగిన అనంతరం 13 కుటుంబాలకు చెందిన 21 మంది చిన్నారులు అనాథలుగా మారిపోయారని తాజాగా ఇజ్రాయెల్‌ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ విషయాల్ని ‘ది టైమ్స్‌ ఆఫ్ ఇజ్రాయెల్‌’ కథనం పేర్కొంది. అంతేకాదు చివరికి నాలుగేళ్ల చిన్నారిని కూడా హమాస్ బందీగా చేసుకుందని పేర్కొంది.

#israel-attack #hamas-vs-israel #hamas-israel-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe