టీ20 వరల్డ్ కప్ 2024కు అమెరికా, వెస్టిండీస్ అతిథ్యం ఇవ్వనున్నాయి. జూన్‌లో ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీ కోసం ఆయా దేశాలు తమ జట్లను ప్రకటిస్తున్నాయి. భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఇటీవల ప్రకటించింది. ఈ టోర్నీలో భారత జట్టుకు హిట్‌మ్యాన్ రోహిత్‌శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. భారత జట్టు ప్రకటన నేపథ్యంలో బీసీసీఐ మీడియా సమావేశం నిర్వహించింది. విలేకర్లు అడిగిన ప్రశ్నలకు చీఫ్ కోచ్ అజిత్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ సమాధానాలు ఇచ్చారు.
అయితే టీ20ల్లో విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ గురించి విలేకర్లు రోహిత్‌ను కొన్ని ప్రశ్నలు అడిగారు. వీటికి కెప్టెన్ సమాధానం ఇస్తూ మరోసారి ‘రో-కో’ (రోహిత్- కోహ్లీ బాండ్) బంధాన్ని ప్రదర్శించాడు. వీరిద్దరూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం చూసి ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.
* ఇప్పుడు రోహిత్
ప్రస్తుత భారత క్రికెట్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దిగ్గజ ఆటగాళ్లు. వారిద్దరూ ఒంటి చేత్తో జట్టుకు విజయాన్ని అందించిన సందర్భాలు చాలా ఉన్నాయి. మీడియా సమావేశాల్లో ఒకరికొకరు చాలా సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. విమర్శలు వచ్చినప్పుడు ఇద్దరూ ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ రో-కో బంధాన్ని ఎప్పటికప్పుడు చాటుకుంటున్నారు. తాజాగా టీ20 వరల్డ్‌కప్-2024 కోసం జట్టు సభ్యులను ప్రకటించిన సందర్భంగా ఇలాంటి సన్నివేశం మరోసారి పునరావృతమైంది.
బీసీసీఐ నిర్వహించిన మీడియా సమావేశంలో ఓ విలేకరిT20 క్రికెట్‌లో కోహ్లీ స్ట్రైక్ రేట్ గురించి రోహిత్‌ను ప్రశ్నించాడు. అందుకు రోహిత్ నవ్వాడు. అది అసలు సమస్యే కాదని తన నవ్వుతో సమాధానం ఇచ్చాడు. అలా నవ్వుతో కోహ్లీకి సపోర్ట్‌గా నిలిచాడు. దీన్ని రో-కో బంధంగా పేర్కొంటారు.
రోహిత్ నవ్వు రెండేళ్ల క్రితం విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్న క్షణాన్ని గుర్తు చేసింది. దుబాయ్ వేదికగా జరిగిన T20 ప్రపంచ కప్ 2021లో భారత జట్టు 10 వికెట్ల తేడాతో పాక్‌పై ఘోర ఓటమిని మూటగట్టుకుంది. మ్యాచ్ అనంతరం అప్పటి కెప్టెన్ కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ తడబడ్డాడు. అదే విషయాన్ని ఓ విలేకరి ప్రస్తావిస్తూ రోహిత్ T20 భవిష్యత్తు ఎలా ఉండబోతుందని కోహ్లీని ప్రశ్నించాడు. దానికి విరాట్ బదులుగా నవ్వి సహచర ఆటగాడు రోహిత్‌కు సపోర్ట్‌గా నిలిచి, రో-కో బంధాన్ని చాటుకున్నాడు.
* సోషల్ మీడియాలో ట్రెండింగ్
ఈ రెండు దృశ్యాలు(రోహిత్, కోహ్లీ నవ్వు) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విమర్శలు వచ్చినా ప్రతిసారీ ఈ ఇద్దరు ఆటగాళ్లు ఒకరికొకరు సపోర్ట్‌గా నిలిచారు. దీనిపై నెటిజన్లు మీమ్స్, ట్వీట్స్ చేస్తున్నారు.
* నెటిజన్ల రెస్పాన్స్
రోహిత్, కోహ్లీ బంధం అద్భుతమని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. insideSport ఓ ట్వీట్ చేస్తూ.. ‘విరాట్ స్ట్రైక్ రేట్ గురించి జర్నలిస్టులు మాట్లాడుతున్నప్పుడు రోహిత్ శర్మ ఫన్నీగా నవ్విన విధానం చూస్తే ఇది ఓ వెర్రి ప్రశ్న అన్నట్లుగా అర్థం వచ్చేలా ఉంది.’ అని పేర్కొంది. తనూజ్ సింగ్ అనే వ్యక్తి స్పందిస్తూ ‘మీడియా విరాట్ SR గురించి అడిగినప్పుడు, రోహిత్ శర్మ నవ్వుతున్నాడు. ఇదంతా అతని PR సలహా మేరకు చేశాడు.’ అని ఫన్నీగా కామెంట్ చేశాడు. మరో నెటిజన్ Ro-KO బాండ్ ఫరెవర్ అంటూ ట్వీట్ చేశారు.
రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వీ జైశ్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, రిషబ్ పంత్, హార్థిక్ పాండ్య, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, బూమ్రా, సిరాజ్