Telangana BJP Leaders to Join Congress: తెలంగాణ బీజేపీలో ఏదో జరుగుతోంది? ఓవైపు ప్రధాని వరుస పర్యటనలలో బీజేపీ(Telangana) శ్రేణుల్లో కొత్త ఉత్సాహం ఉప్పొంగుతుండగా.. మరోవైపు.. కీలక నేతలు ఆ పార్టీకి ముఖం చాటేస్తున్నారు? మరి వారెందుకిలా చేస్తున్నారు. ఏకంగా ప్రధానే వచ్చినా.. వారు మాత్రం కారరాలేదు. కారణం ఏమై ఉంటుంది. అలిగారా? లేక అసంతృప్తితో ఉన్నారా? అదీకాక.. వేరే పార్టీ వైపు చూస్తున్నారా? ఆ ముగ్గురు పరిస్థితి ఏంటి? ఇప్పుడిదే అంశంపై తెలంగాణ బీజేపీ(Telangana BJP)లో హాట్ డిస్కషన్ నడుస్తోంది. ఒక్క బీజేపీలోనే కాదు.. స్టేట్ పొలిటికల్ సర్కిల్‌లోనూ ఇదే ప్రధాన అంశంగా మారింది. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరు? బీజేపీలో అసలేం జరుగుతోంది? ఇంట్రస్టింగ్ డీటెయిల్స్ మీకోసం..
మొన్న మహబూబ్‌నగర్‌లో జరిగిన ప్రధాని మోదీ సభకు బీజేపీ శ్రేణులంతా భారీగా తరలి వచ్చారు. కానీ, ఆ ముగ్గురు మాత్రం మచ్చుకైనా కనిపించలేదు. ఒకరైతే మీటింగ్‌కు హాజరు కాకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం పోస్టులు పెట్టారు. ఆ ముగ్గురు మరెవరో కాదు.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, విజయ శాంతి, గడ్డం వివేక్. వీరికి తోడు ఇప్పుడు మరో నేత కూడా కనిపించడం లేదు. ఆయనే.. ఈటల రాజేందర్‌కు అత్యంత సన్నిహిత నేత, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి. ఇవాళ జరిగిన మీటింగ్‌లో ఏనుగు రవీందర్ రెడ్డి కూడా కనిపించలేదు.
ఇదికూడా చదవండి: PM Modi vs CM KCR: కేసీఆర్ గురించి సంచలన విషయాలు రివీల్ చేసిన ప్రధాని మోదీ..
అవును, పసుపు బోర్డు ప్రకటనతో ఫుల్ జోష్‌లో ఉన్న బీజేపీ శ్రేణులు ఇందూరు వేదికగా ప్రధాని మోదీకి థ్యాంక్స్ చెబుతూ ధన్యవాద సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు బీజపేపీ సీనియర్ లీడర్స్ అంతా డుమ్మా కొట్టారు. మొన్న మహబూబ్‌నగర్ సభలో, ఇవాళ ఇందూరు సభలోనూ వారు కనిపంచలేదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి, ఏనుగు రవీందర్ రెడ్డి, గడ్డం వివేకా కనిపించలేదు.
మోదీ సభలకు సైతం డుమ్మా కొట్టిన ఈ నేతలు.. పార్టీ మారుతారని కొంతకాలంగా గట్టి ప్రచారం జరుగుతోంది. కొన్నాళ్లుగా పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న ఈ నేతలంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారంటూ విపరీతమైన ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని వారు కూడా ఖండించకపోవడం ఆ అనుమానాలకు మరింత బలం చేకూర్చినట్లయ్యింది. ఇదే సమయంలో ప్రధాని సభలకు సైతం గౌర్హాజరవడంతో.. వీరి జంపింగ్ ఫిక్స్ అని ఓ క్లారిటీకి వచ్చేశారు పొలిటికల్ అనలిస్ట్‌లు. ఈ అసంతృప్త నేతలంతా ఇటీవలే రహస్యంగా సమావేశమైనట్లు వార్తలు వచ్చాయి. మరి ఈ నేతలు స్పందిస్తే గానీ.. పార్టీ మార్పుపై క్లారిటీ వచ్చే పరిస్థితి లేదు. చూద్దాం ఏమవుతుందో మరి.
ఇదికూడా చదవండి: PM Modi vs CM KCR: కేసీఆర్ గురించి సంచలన విషయాలు రివీల్ చేసిన ప్రధాని మోదీ..