Iron Foods: రక్తం తక్కువగా ఉందా..? ఈ ఐరన్ ఫుడ్‌ని తింటే సమస్య దూరం శరీరంలో రక్తం చాలా ముఖ్యమైన అంశం. రక్తం పుష్కలంగా ఉంటే ఎటువంటి ఇబ్బందులు రావు. ఈ రోజుల్లో రక్తలేమి కారణంగా కొందరూ బాధపడుతున్నారు. ఐరన్ లోపం వలన ఈ సమస్య వస్తుంది. కొన్ని ఆహార పదార్థాలను ప్రతీరోజు తీసుకుంటే ఈ సమస్య దూరం అవుతుంది. By Vijaya Nimma 18 Nov 2023 in Latest News In Telugu ట్రెండింగ్ New Update షేర్ చేయండి Iron Food benefits: శరీరంలో రక్తం తక్కువగా ఉన్నా.. రక్త ప్రసరణ సక్రమంగా లేకపోయినా అనారోగ్య సమస్యలు వస్తాయి. రక్త ప్రసరణ శరీరం అంతా సక్రమంగా ఉంటేనే అవయవాలన్ని సక్రమంగా పనిచేస్తాయి. కొన్ని సందర్భాల్లో రక్త ప్రసరణ సక్రమంగా లేకపోతే గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకు మంచిగా రక్తం పట్టాలన్నా.. ప్రసరణ సజావుగా ఉండాలన్నా, మెదడు ఆరోగ్యంగా ఉండాలన్నా.. కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవాలి. సాధారణంగా దొరికే పండ్లను తీసుకుంటే ప్రాణానికి ముప్పు ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఏ పండ్లు తీసుకుంటే ఎలాంటి ఉపయోగాలున్నాయో ఇప్పుడు తెలుసుకుద్దాం. ఇది కూడా చదవండి: క్యాన్సర్ ముప్పు తగ్గాలంటే ఈ గింజలను రోజూ తినాలి సిట్రస్ జాతికి చెందిన కమల పండులో ఐరన్ సమృద్ధిగా ఉంది. దీనిలో విటమిన్-సి పుష్కలం. రోజూ ఈ పండు తీసుకుంటూ శరీరం ఐరన్ పెరుగుతుంది గుడ్డులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఒక ఉడికించిన గుడ్డులో 1 గ్రాం ఐరన్ ఉంటుంది. ఐరన్ లోపం ఉన్నవారు రోజూ ఓ గుడ్డు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. పాలకూరలో ఎర్రరక్త కణాల ఉత్పత్తికి కీలక పాత్ర పోషిస్తుంది. ఫోలేట్, ఐరన్ మెరుగుపరచడానికి విటమిన్-సి ఉపయోగపడుతుంది. పాలకూరలో విటమిన్ ఏ, బి, సి, కె, మెగ్నీషియం వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తయని నిపుణులు చెబుతున్నారు. దానిమ్మకాయలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది రోజూ తింటే రక్తహీనత తగ్గుతుంది. దానిమ్మలో ఉండే విటమిన్-సి కంటెంట్ ఐరెన్‌ను పెంపొందిస్తుంది. దానిమ్మలో పొటాషియం, క్యాల్షియం, ఫైబర్‌తో పాటు విటమిన్-సి, కె, బి, ఎ పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయ ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి హిమోగ్లోబిన్ ఎర్రరక్త కణాలలో ఉండే ప్రోటీన్. ఇవి శరీరమంతా ఆక్సిజన్‌ను తీసుకువెళ్లేందుకు కృషి చేస్తుంది. శరీరంలో రక్తం తయారీకి.. కణాలకు హీమ్ అనే భాగాన్ని నిర్మించడానికి ఐరన్ అవసరం. మీరు తీసుకునే ఆహారంలో ఐరన్ లేకపోతే శరీరం ఎర్రరక్త కణాలను ఉత్పత్తి చేయలేదు. అంతేకాకుండా తక్కువ హిమోగ్లోబిన్ స్థాయిలు రక్తహీనతకు దారితీస్తుంది. దీని వలన అలసట, తల తిరిగినట్టు, చర్మం పాలిపోవటం, బలహీనత ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఐరన్ లోపాన్ని దూరం చేయాడానికి, హిమోగ్లోబిన్ లెవల్స్ పెంచాలంటే ఐరన్ ఫుడ్స్ రోజూ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. #health-benefits #hemoglobin #iron-foods మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి