Delhi : ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ భార్య సునీత? ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన అరవింద్ కేజ్రీవాల్ పద్నాలుగు రోజుల రిమాండ్ మీద తీహార్ జైలుకు వెళ్ళారు.ప్రస్తుతానికి ఆయన తన పదవికి రాజీనామా చేయకపోయినా..ఇక మీదట చేయకతప్పదేమో అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన భార్య సునీతే నెక్ట్స్ ఢిల్లీ సీఎం అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. By Manogna alamuru 03 Apr 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Sunita Kejriwal : ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్(Delhi Liquor Policy Scam) కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Aravind Kejriwal) అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన తీహార్ జైల్లో(Tihar Jail) పధ్నాలుగు రోజుల రిమాండ్‌లో ఉన్నారు. అరెస్ట్ అయిన తర్వాత కూడా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయలేదు కేజ్రీవాల్. కానీ చరిత్ర చూసుకుంటే రాజకీయ నేతలు ఎవరైనా సరే పదవుల్లో ఉండి అరెస్ట్ అయితే వెంటనే వారి పదవులకు రాజీనామా చేశారు. రీసెంట్‌గా జార్ఖండ్ ముఖ్యమంత్రి సోరెన్ కూడా ఇంకా కాసేపట్లో అరెస్ట్ చేస్తారు అనగా తన పదవికి రాజీనామా చేసేశారు. కానీ అరవింద్ కేజ్రీవాల్ మాత్రం అలా చేయలేదు. పైగా కస్టడీ ఉన్న సమయంలో అక్కడి నుంచే పాలన కూడా చేశారు. ఈడీ(ED) అధికారుల కస్టడీలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా రెండు ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే ఇప్పుడు రిమాండ్ మీద తీహార్ జైలులో ఉన్నారు కాబట్టి ఆయన పదవికి రాజీనామా చేయకతప్పని పరిస్థితి. దీంతో ఆయన స్థానంలో నెక్స్ట్ ఢి్లీకి సీఎం ఎవరు అవుతారనే ఊహాగానాలు నడుస్తున్నాయి. ముఖ్యమంత్రిగా సునీతా కేజ్రీవాల్.. కేజ్రీవాల్ తరువాత ఢిల్లీకి ముఖ్యమంత్రి ఎవరవుతారు అనే నేపథ్యంలో కొంతమంది పేర్లు తెర మీదకు వచ్చాయి. ఇందులో బాగా వినిపిస్తున్న పేరు సునీతా కేజ్రీవాల్(Sunita Kejriwal). ఈమె అరవింద్ కేజ్రీవాల్ భార్య. ఇప్పటి వరకు రాజకీయాలకు దూరంగానే ఉన్న ఈమె...ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత సడెన్‌గా లైమ్ లైట్‌లోకి వచ్చారు. భర్త తరుఫున మాట్లాడుతూ బీజేపీ మీద విమర్శలు కూడా చేశారు. మొన్న జరిగిన ర్యాలీలో కూడా సునీత పాల్గొన్నారు. దీంతో తదుపరి ఢిల్లీ ముఖ్యమంత్రిగా సునీతానే అవుతారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇంతకు ముందు లాలాప్రసాద్ యాదవ్ విషయంలో కూడా ఇదే జరిగింది. లాలూ అరెస్ట్ అయినప్పుడు రబ్రీనే ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. ఇప్పుడు అదే రీతిలో సునీత కూడా ఢిల్లీ సీఎం అవుతారని అంటున్నారు. అర్హత ఉందా... అయితే ఇప్పుడు సునీతా కేజ్రీవాల్‌కు ముఖ్యమంత్రి అయ్యే అర్హతలున్నాయా అనే విషయం మీద కూడా చర్చలు జరుగుతున్నాయి. అరవింద్ లాగే సునీత కూడా ఉన్నత చదువులు చదివారు. ఐఆర్ఎస్ ఆఫీసర్‌గా రిటైర్డ్ కూడా అయ్యారు. ఈమెకు ప్రజల్లోనూ మంచి ఆదరణ ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలోనూ చురుగ్గా పాల్గొన్నారు. ఇవన్నీ సునీత ముఖ్యమంత్రి అవ్వడానికి అర్హతలు అంటున్నారు. అరవింద్ కేజ్రీవాల్ కూడా ఐఆర్ఎస్ ఆఫీసర్‌గా చేసిన వ్యక్తే కదా అని చెబుతున్నారు. Also Read : Rahul Gandhi: నామినేషన్ దాఖలు చేసిన రాహుల్ గాంధీ #arrest #aravind-kejriwal #delhi-cm #sunita-kejriwal మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి