Stock Market: ఈవారం స్టాక్ మార్కెట్ జోరు కొనసాగుతుందా? అంచనాలు ఎలా ఉన్నాయి?

గత వారంలో స్టాక్ మార్కెట్ పెరుగుదల బాటలో నడిచింది. చాలా కంపెనీలు రెండవ త్రైమాసిక ఫలితాలు ప్రకటించనున్న నేపథ్యంలో ఈ వారం అదే జోరు ఉండొచ్చని నిపుణుల అంచనా. 

New Update
Nifty 50 Record: స్టాక్ మార్కెట్ జంప్.. రూపాయి స్ట్రాంగ్.. మూడు కారణాలు.. 

Stock Market: స్టాక్ మార్కెట్  గతవారం పెరుగుదల కనపర్చింది. ట్రేడింగ్ వారం చివరి రోజు అంటే శుక్రవారం (నవంబర్ 3) సెన్సెక్స్ 282 పాయింట్ల లాభంతో 64,363 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 97 పాయింట్లు పెరిగి 19,230 వద్ద ముగిసింది. గత వారం మొత్తంలో సెన్సెక్స్ (Sensex) 1.37 శాతం లాభపడింది. నిఫ్టీ (Nifty) కూడా 1.15 శాతం పెరిగింది. ఈ నేపథ్యంలో ఈ వారం స్టాక్ మార్కెట్ అదే ధోరణి కనబరుస్తుందా? ఒడిదుడుకులకు అవకాశం ఉందా అనే విషయాన్ని పరిశీలిద్దాం. 

ఈ వారం స్టాక్ మార్కెట్‌లో(Stock Market) పెరుగుదల ఉండవచ్చని నిపుణులు గట్టిగా నమ్ముతున్నారు.  కంపెనీల రెండవ త్రైమాసిక ఫలితాలు, ఫెడ్‌ అప్ డేట్స్, దేశీయ ఆర్థిక డేటా, ఎఫ్‌ఐఐ-ఫ్లో, ముడి చమురు ధర అలాగే కొత్తగా వస్తున్న ఐపిఓలపై మార్కెట్ కదలికలను నిర్దేశిస్తాయి. ఈరోజు (నవంబర్ 6వ తేదీ అంటే సోమవారం) నుంచి  ప్రారంభమయ్యే వారంలో ఈ అంశాలు ఎలా ఉండొచ్చని అంచనా వేస్తున్నారో చూద్దాం

   1.కంపెనీల రెండవ త్రైమాసిక ఫలితాలు:

  • 2400 కంటే ఎక్కువ లిస్టెడ్ కంపెనీల రెండవ త్రైమాసిక ఫలితాలు రానున్న వారంలో కూడా మార్కెట్(Stock Market) కదలికను నిర్ణయించే అతిపెద్ద అంశంగా చెప్పవచ్చు. రాబోయే వారంలో, దివీస్ లేబొరేటరీస్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అదానీ పోర్ట్స్, కోల్ ఇండియా, ఐషర్ మోటార్స్, హిందాల్కో ఇండస్ట్రీస్, మహీంద్రా అండ్ మహీంద్రా - ONGC వంటి పెద్ద కంపెనీల ఫలితాలు రానున్నాయి.
  • ఇవే  కాకుండా, టాటా పవర్, ఎల్‌ఐసి, నైకా, జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్, అపోలో టైర్స్, ఐఆర్‌సిటిసి, బాటా ఇండియా, నజారా టెక్నాలజీస్, ఆయిల్ ఇండియా, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, అశోక్ లేలాండ్, గ్లెన్‌మార్క్ ఫార్మా - హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కూడా త్రైమాసిక ఫలితాలను  ప్రకటించనున్నాయి.
  1. US సెంట్రల్ బ్యాంక్ ఫెడ్‌ అప్ డేట్స్..
    ఈ వారంలో ఫెడ్ కి చెందిన కుక్, బార్, జెఫ్రీ, వాలర్, విలియమ్స్ , బార్కిన్ పలు సెషన్‌లలో ప్రసంగించబోతున్నారు.  నవంబర్ 8న జరిగే డివిజన్ ఆఫ్ రీసెర్చ్ అండ్ స్టాటిస్టిక్స్ సెంటెనియల్ కాన్ఫరెన్స్‌లో,  నవంబర్ 9న జరిగే 24వ జాక్స్‌పోలక్ వార్షిక పరిశోధన సదస్సులో ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ చేయబోయే ప్రసంగాలు కూడా మార్కెట్ కదలికలపై ప్రభావం చూపిస్తాయి.
  1. ముడి చమురు ధరలు
    మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య సప్లై విషయంలో కొన్ని టెన్షన్స్ సడలించడంతో వారంలోని చివరి ట్రేడింగ్ రోజున చమురు ధరలు 2% కంటే ఎక్కువ తగ్గాయి. బ్రెంట్,  WTI ముడి చమురు రెండూ వారానికి 6% కంటే ఎక్కువ తగ్గాయి. రానున్న రోజుల్లో ముడిచమురు ధర మరింత తగ్గే అవకాశం ఉంది.
  2. ఎఫ్‌ఐఐ-ఫ్లో
    సెప్టెంబర్ -  అక్టోబర్‌లలో స్టాక్ మార్కెట్‌లలో(Stock Market) కనిపించిన విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల (ఎఫ్‌ఐఐ) విక్రయాల ధోరణి నవంబర్ ప్రారంభంలో కూడా కొనసాగింది. నవంబర్ మొదటి మూడు రోజుల్లో ఎఫ్‌ఐఐలు క్యాష్ మార్కెట్ ద్వారా రూ.3,063 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు. అయితే, US బాండ్ ఈల్డ్‌లు తగ్గినందున ఇప్పుడు ఈ ట్రెండ్ మారుతుందని భావిస్తున్నారు. స్టాక్ మార్కెట్‌పై విదేశీ ఇన్వెస్టర్ల ఆసక్తి తగ్గడానికి బాండ్ ఈల్డ్స్ పెరగడం ఒక ముఖ్యమైన కారణంగా చెప్పవచ్చు.

Also Read: బంగారం గత వారం కాస్త తగ్గినట్టే కనిపించింది.. ఇప్పటి రేట్లు ఎంతో తెలుసా? 

  1. డేటాల విడుదల
    సెప్టెంబరు నెలకు సంబంధించిన దేశ ఫైనాన్షియల(Stock Market) డేటా అలాగే ఇండస్ట్రియల్  అవుట్ ఫుట్-మాన్యుఫాక్చరింగ్ అవుట్ ఫుట్  గణాంకాలు నవంబర్ 10న ప్రకటిస్తారు.  నవంబర్ 3తో ముగిసే వారానికి ఫారెక్స్ ఎక్స్ఛేంజ్ రిజర్వ్ డేటా కూడా అదే రోజు విడుదల చేస్తారు. ఇక అక్టోబర్ 27తో ముగిసిన వారంలో ఫారెక్స్ ఎక్స్ఛేంజ్ నిల్వలు 2.58 బిలియన్ డాలర్లు పెరిగి 586.11 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
  1. IPO లు..
    రెండు కొత్త IPOలు - ప్రొటీజ్ ఇగోవ్ టెక్నాలజీస్ - ASK ఆటోమోటివ్ - వచ్చే వారం మెయిన్‌బోర్డ్ విభాగంలో(Stock Market) ఓపెన్ అవుతాయి.  ప్రోటీన్ eGov IPO నవంబర్ 6న ఓపెన్  అవుతుంది. ఇది  నవంబర్ 8న క్లోజ్ అవుతుంది.  దీని ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.752-792. ఈ ఐపీఓ నుంచి కంపెనీ రూ.490.3 కోట్లు సమీకరించనుంది. ASK ఆటోమోటివ్ IPO నవంబర్ 7 నుంచి  9 వరకు ఓపెన్ లో ఉంటుంది.  దీని ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ. 268-282గా ఉంది.  ఈ ఐపీఓ నుంచి రూ.833.91 కోట్లు సమీకరించాలని కంపెనీ యోచిస్తోంది.

గమనిక: షేర్లలో ఇన్వెస్ట్ చేయడం అత్యంత రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఇక్కడ అందించిన సమాచారం మార్కెట్ ధోరణులపై వచ్చిన సమాచారం ఆధారంగా ఇవ్వడం జరిగింది. ఈ ఆర్టికల్ ఈ షేర్ లో పెట్టుబడి పెట్టమని కానీ, పెట్టుబడి విషయంలో ఇలా చేయండి అని కానీ, సూచించడం లేదు. ఇది కేవలం ఇన్వెస్టర్స్ సమాచారం కోసం మాత్రమే అందించడం జరిగింది. ఎవరైనా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకునే ముందు వారి ఆర్థిక సలహాదారుని సూచనలు తీసుకోవడం మంచిది.

Watch this interesting Video: