Telangana Elections: ఎన్నికల్లో పోటీకి షర్మిల వెనుకడుగు.. పొంగులేటి వ్యూహం ఫలితమేనా?!

తెలంగాణ ఎన్నికల బరిలోంచి వైఎస్ షర్మిల తప్పుకోవడం వెనుక పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యూహం ఉందట. ఆయన వల్లే వైఎస్ షర్మిల పోటీ నుంచి తప్పుకుని కాంగ్రెస్ పార్టీకి మద్ధతు ప్రకటించారు. ఖమ్మం పార్లమెంట్ నుంచి షర్మిల్ పోటీ చేస్తారని సమాచారం.

Telangana Elections: ఎన్నికల్లో పోటీకి షర్మిల వెనుకడుగు.. పొంగులేటి వ్యూహం ఫలితమేనా?!
New Update

Telangana Elections: తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ వైఎస్ షర్మిల(YS Sharmila) ప్రకటించడం కాంగ్రెస్‌(Congress)లో కలకలం రేపింది. ప్రధానంగా వైఎస్ షర్మిల(YS Sharmila) పాలేరు బరిలో నిలుస్తారని ప్రచారం జరగడంతో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాస్త ఇబ్బందిగానే ఫీల్ అయినట్లు తెలుస్తోంది. అందుకే.. నేరుగా రంగంలోకి దిగిన పొంగులేటి.. వైఎస్ షర్మిలను కన్వీన్స్ చేశారట. ఆ కారణంగానే ఆమె ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారని సమాచారం.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యూహం ఫలితంగానే తెలంగాణ ఎన్నికల బరి నుంచి వైఎస్ షర్మిల తప్పుకున్నట్లు పొలిటికల్ సర్కిల్‌లో టాక్ నడుస్తోంది. పోటీ విషయంలో షర్మిలను ఆయన కన్వీన్స్ చేశారట. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా పోటీ దూరంగా ఉండాలని ఆమెను విజ్ఞప్తి చేశారని సమాచారం. ఈ విషయంలో ఏఐసీసీకి, వైఎస్ షర్మిలకు మధ్యవర్తులుగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, డీకే శివకుమార్ వ్యవహరించినట్లు విశ్వసనీయ సమాచారం. అంతేకాదు.. వైఎస్ షర్మిలతో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ ఫోన్‌లో మాట్లాడరట. వైఎస్ఆర్‌టీపీ త్యాగాన్ని వృథా కానివ్వమని, భవిష్యత్‌కు భరోసా కల్పిస్తామంటూ షర్మిలకు ప్రియాంక భరోసా ఇచ్చారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఈ కారణంగానే వైఎస్ షర్మిల తెలంగాణలో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిందని తెలుస్తోంది.

Also Read:ప్లీజ్ నన్ను మైలార్డ్ అని పిలవకండి…

ఈ రాయబారాల నేపథ్యంలోనే.. బీఆర్ఎస్ ఓటమే తమ ఉమ్మడి లక్ష్యమనే ఏకాభిప్రాయానికి షర్మిల, పొంగులేటి వచ్చారట. ఈ క్రమంలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నామని, భేషరతుగా కాంగ్రెస్ పార్టీకి మద్ధతు ఇస్తున్నట్లు బహిరంగ ప్రకటన విడుదల చేశారు వైఎస్ షర్మిల. ఇకపోతే.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వైఎస్ షర్మిల పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. అంటే.. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్ట్ ఇస్తే.. పార్లమెంట్‌ ఎన్నికల్లో షర్మిలకు కాంగ్రెస్ సపోర్ట్ ఇచ్చేలా ఒక అవగాహనకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా.. వైఎస్‌ఆర్‌టీపీ పోటీ నుంచి తప్పుకోవడం కాంగ్రెస్‌కు పెద్ద ఊరట అని చెప్పాలి. ముఖ్యంగా పాలేరులో పొంగులేటికి ముప్పు తప్పినట్లుగానే భావించొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

భేషరతు మద్దతు..

ఇదే అంశంపై ఉదయం మీడియా ముందుకొచ్చి ప్రకటన విడుదల చేసిన వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. 'ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ సర్కార్ పడిపోయే అంత ఛాన్స్ ఉంది. కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేక ఓట్లను చీలిస్తే మళ్లీ ఆయనే ముఖ్యమంత్రి అవుతారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చొద్దని ఎంతో మంది మేధావులు, మీడియా అధిపతులు తమను కోరారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో వైఎస్సార్టీపీ పోటీకి దూరంగా ఉండాలన్న నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నాం. తెలంగాణ ప్రజల కోసం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వైఎస్సార్టీపీ కార్యకర్తలు కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలి. గెలుపు గొప్పది.. త్యాగం అంతకన్నా గొప్పది.' అన అన్నారు వైఎస్ షర్మిల.

Also Read: కాళేశ్వరం పై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సంచలన నివేదిక

#telangana-elections #ponguleti-srinivasa-reddy #ys-sharmila #telangana-politics
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe