Paytm News: Paytm బ్యాంక్ పై ఆర్బీఐ చర్యలు.. మరి డిజిటల్ పేమెంట్స్ మాటేమిటి? Paytm బ్యాంక్ పై ఆర్బీఐ చర్యలు తీసుకోవడంతో అందరూ గందరగోళంలో ఉన్నారు. పేటీఎం ద్వారా డిజిటల్ పేమెంట్స్ మామూలుగా చేసుకోవచ్చు. కానీ, పేటీఎం బ్యాంకింగ్ సర్వీసులను మాత్రం ఉపయోగించుకోవడం కుదరదు. ఈ విషయాన్ని పూర్తిగా అర్ధం చేసుకోవడానికి ఈ ఆర్టికల్ చదవండి. By KVD Varma 02 Feb 2024 in బిజినెస్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Paytm Crisis: పేటీఎం(Paytm) ఇప్పుడు అందరినీ కలవరపెడుతున్న అంశం. డిజిటల్ పేమెంట్స్ లో విప్లవాన్ని తీసుకురావడంలో పేటీఎంది కీలకపాత్ర. ఒక చిన్న స్టార్టప్ కంపెనీగా ప్రారంభమైన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ స్థాయికి వేగంగా ఎదిగింది. ఈ క్రమంలో ఆర్బీఐ (RBI) నిబంధనలను పాటించడం విషయంలో విఫలం అయిందంటూ చర్యలు తీసుకుంటున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. దీంతో అందరిలోనూ టెన్షన్ మొదలైంది. ఎందుకంటే, చాలామంది పేటీఎం వాలెట్ (Paytm Wallet) ఉపయోగిస్తున్నారు. చిన్న వ్యాపారుల దగ్గరనుంచి పెద్ద సంస్థల వరకు పేటీఎం వాలెట్ ద్వారా లావాదేవీలు చేస్తున్నాయి. ప్రజలు కూడా పేటీఎం ద్వారా పేమెంట్స్ చేయడం కోసం పేటీఎంను ఉపయోగిస్తూ వస్తున్నారు. అయితే, ఇప్పటికిప్పుడు పేటీఎం వాలెట్ లో ఉన్న డబ్బుకు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ, ఇకపై అందులో డిపాజిట్స్ చేయడం కుదరదు. ఇప్పుడు ఉన్న బ్యాలెన్స్ వాడుకునే వెసులుబాటు ఉంది. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే.. పేటీఎం నుంచి మనం యధావిధిగా పేమెంట్స్ చేయవచ్చు. అంటే.. మనం మన బ్యాంకు ఎకౌంట్ ద్వారా పేమెంట్స్ చేస్తాం. డబ్బు మన ఎకౌంట్ నుంచి అవతలి వారికి చేరుతుంది. అందువల్ల దీని విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. ఏదైనా లావాదేవీ పేటీఎం బ్యాంక్ తో జరిపే అవకాశం మాత్రమే ఉండదు. అంటే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్(Paytm Payment Bank) లో ఉన్న డిపాజిట్స్ విషయంలో ఆర్బీఐ చర్యల ప్రభావం ఉంటుంది. ఈ విషయాన్ని పూర్తిగా సరిగ్గా అర్ధం చేసుకోవాలంటే.. పేటీఎం-పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (Paytm and Paytm Payments Bank) మధ్యలో ఉండే తేడా తెలుసుకోవడం అవసరం. మామూలు భాషలో చెప్పాలంటే రెండూ వేరువేరు. ఒకే పేరుతొ కనిపించినా.. రెండిటి పనితీరు వేరు. Paytm అనేది డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌గా పనిచేస్తుంది. అలాగే, Paytm పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ పొందిన ఆర్థిక సంస్థ. ఈ రెండిటికీ చాలా తేడా ఉంది. Paytm పేమెంట్స్ బ్యాంక్‌కి బ్యాంకింగ్ లైసెన్స్ అవసరం. ఇది బ్యాంకింగ్ సర్వీసులను అంటే డిపాజిట్లు, లోన్స్, క్రెడిట్ కార్డు ఇలాంటి సర్వీసులను అందిస్తుంది. అందువల్ల ఇది మన సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ నిబంధనల చక్రంలోనే పనిచేయాల్సి ఉంటుంది. ఆ నిబంధనల్లో దేనిని ఉల్లంఘించినా సరే.. ఆర్బీఐ చర్యలు తీసుకుంటుంది. ఇక Paytm డిజిటల్ ప్లాట్ ఫారమ్ విషయానికి వస్తే.. ఇది ఎటువంటి డిపాజిట్లు నేరుగా తీసుకోదు. లోన్స్ నేరుగా ఇవ్వదు. కస్టమర్ కి మర్చంట్ అంటే వ్యాపారికి, కస్టమర్ కి కస్టమర్ కి మధ్య డిజిటల్ గా పేమెంట్స్ చేయడంలో సహకరిస్తుంది. దీనిలో చేసే బిల్ పేమెంట్స్ వంటివి కస్టమర్ బ్యాంక్ ఎకౌంట్ నుంచి జరుగుతాయి. అందువల్ల దీనికి ఆర్బీఐ బ్యాంకింగ్ నిబంధనలు వర్తించవు. Also Read: పేటియం పని చేస్తూనే ఉంటుంది: పేటీఎం సీఈవో! ఇప్పుడు అర్థం అయి ఉంటుంది కదా. అందువల్ల ఇప్పుడు ఎప్పటిలానే మనం Paytm (APP) డిజిటల్ యాప్ నుంచి పేమెంట్స్ చేసుకోవచ్చు. అయితే, గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే.. Paytm వాలెట్ లో మీరు డబ్బును ఉంచడం కుదరదు. ఎందుకంటే, వాలెట్ లో ఉండే మీ డబ్బు Paytm పేమెంట్స్ బ్యాంకులో జమ అయి ఉంటుంది. ఇప్పుడు ఆర్బీఐ చర్యలు తీసుకున్నది Paytm పేమెంట్స్ బ్యాంక్ పైన. అందువల్ల వాలెట్ లో ఏదైనా బైలెన్స్ ఉంటే దానిని మీరు మీ బ్యాంక్ ఎకౌంట్ కి ట్రాన్స్ ఫర్ చేసుకోవాలి. మొత్తంగా చూసుకుంటే కనుక పేటీఎం డిజిటల్ పేమెంట్స్ కి ఇప్పుడు వచ్చిన ఇబ్బంది ఏమీలేదు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్స్ వారికి సంబంధించిన లావాదేవీలు మాత్రం పూర్తిగా ఈ నెలాఖరు లోగా తెగతెంపులు చేసుకోవాల్సి ఉంటుంది. #ban-on-paytm #paytm-news #paytm #paytm-shares మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి