Paytm: పేటియం పని చేస్తూనే ఉంటుంది: పేటీఎం సీఈవో! దేశంలోని పెద్ద బ్యాంకుల నుంచి తమకు మద్దతు ఉందని శర్మ పేర్కొన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలు కంపెనీ మార్కెటింగ్ అండ్ ఫైనాన్షియల్ అంశాల కారణంగా సేవల వల్ల వ్యాపారం ప్రభావితం కాదని శర్మ పేర్కొన్నారు. ఈ చర్య పై ఆర్బీఐ తమకు ఎలాంటి వివరాలను అందించలేదన్నారు. By Bhavana 02 Feb 2024 in బిజినెస్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Paytm: పేటీఎం షేర్లు ఒక్కసారిగా పడిపోవడంతో దాని వినియోగదారులు ఆందోళనకు గురయ్యారు. దీంతో వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేటీఎం వ్యవస్థాపకుడు , సీఈవో(Paytm CEO) విజయ్ శేఖర్ శర్మ (Sarma) స్పందించారు. తమ కంపెనీ ఇతర బ్యాంకులతో మాత్రమే పని చేస్తున్నందున పేమెంట్స్ బ్యాంక్ కాదని అన్నారు. దేశంలోని పెద్ద బ్యాంకుల నుంచి తమకు మద్దతు ఉందని శర్మ పేర్కొన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలు కంపెనీ మార్కెటింగ్ అండ్ ఫైనాన్షియల్ అంశాల కారణంగా సేవల వల్ల వ్యాపారం ప్రభావితం కాదని శర్మ పేర్కొన్నారు. ఈ చర్య పై ఆర్బీఐ తమకు ఎలాంటి వివరాలను అందించలేదన్నారు. రిజర్వ్ బ్యాంక్ (RBI) విధించిన ఆంక్షల వల్ల పేటీఎం షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఒక్కో షేరు ధర 20 శాతం వరకు క్షీణించి ఎన్‌ఎస్‌ఈలో ఆరు వారాల కనిష్టానికి చేరుకుంది. దీంతో కంపెనీ మార్కెట్ 1.2 బిలియన్ డాలర్లు నష్టపోయింది. 2021 నుంచి కంపెనీ ఫార్మ్ లోకి వచ్చిన తరువాత అత్యంత చెత్త ట్రేడింగ్ ను గురువారం నాడు నమోదు చేశాయి. కంపెనీలో శర్మ 19. 4 శాతం వాటాను కలిగి ఉన్నారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంకులో 51 శాతం వాటాను హోల్డ్ చేస్తున్నారు. గురువారం నాడు స్టాక్ మార్కెట్లో షేర్లు కూలిపోవడంతో శర్మ సంపద 233 మిలియన్ డాలర్ల మేర క్షీణతకు గురైంది. శర్మ ఈ కంపెనీని 20 సంవత్సరాల ముందు మొదలుపెట్టారు. ఉబర్ తరువాత దేశంలో అత్యంత వేగంగా దూసుకెళ్లిన స్టార్టప్ కంపెనీ పేటీఎం. 2016 నవంబర్ లో మోడీ పెద్ద నోట్లను రద్దు చేసిన తరుణంలో పేటీఎం చాలా వేగంగా మార్కెట్లో ప్రాచుర్యాన్ని పొందింది. డిజిటల్ చెల్లింపుల విభాగంలో కొత్త ఒరవడిని సృష్టించింది. రిజర్వు బ్యాంకు తీసుకున్న చర్యలు తమ వ్యాపారానికి ఎలాంటి నష్టాన్ని కలిగించవని శర్మ పేర్కొన్నారు. Also read: సార్..కాళ్లు నొప్పిగా ఉన్నాయి.. అత్తగారింటి వరకు లిఫ్ట్ ఇవ్వండి! #paytm #business #rbi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి