Fruits and Salt: పండ్లలో ఉప్పు కలిపి తింటే మంచిదా..?

ఉప్పు చల్లుకుని జామకాయలను తింటే పళ్లు మరింత శుభ్రంగా కనిపిస్తాయి. పుల్లమామిడికాయలు, నిమ్మకాయలు లాంటి వాటిలో సిట్రజన్ పండ్లపై ఉప్పు చల్లి తినడం వల్ల జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు వస్తాయి. షుగర్‌ వ్యాధి ఉన్నవారు పండ్లపై ఉప్పు చల్లుకోని తినడం అసలు మంచిదికాదు.

New Update
Fruits and Salt: పండ్లలో ఉప్పు కలిపి తింటే మంచిదా..?

Fruits and Salt: ఈ భూమి మీద ఉప్పు ఆహారంలో చాలా ముఖ్యమైంది. షఢ్రుచులలో ఇది ఒకటిగా చెబుతారు. సముద్రపునీటిని ఇంకించి ఉప్పును తయారు చేస్తారు. మానవ శరీరం సరిగ్గా పనిచేయడానికి ఉప్పు చాలా అవసరమంటారు. కానీ దానిని ఎక్కువ తిన్నా.. తక్కువ తిన్న అనేక రకాల సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతుంటారు. అయితే కొందరూ పండ్లమీద ఉప్పు చల్లి తింటారు. ఆలా ఉప్పు చల్లటం వలన చాలా రుచిగా ఉంటుందని చెబుతుంటారు. ఎక్కువగా జామకాయ,పచ్చిమామిడికాయ ముక్కల మీద కూడా  ఉప్పుకారం కలిపిన పౌడర్ చల్లుతారు. ఇలా చల్లిన తరువాత సూపర్ అని లాగిస్తారు. కొందరైతే రుచికోసం పుచ్చకాయ ముక్కల మీద కూడా ఉప్పు చల్లుతారు. ఉప్పు చల్లుకుని పండ్లను తినడం మంచిదా..? కాదా? అనే డౌట్ ఉంటుంది. రుచి కోసం ఉప్పును అతిగా తినటం ఎవరికైనా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

publive-image

కిడ్నీ, గుండె సమస్యలు వస్తాయి:

వైద్యుల అభిప్రాయం ప్రకారం.. ఉప్పు ఎక్కువగా తినటం వలన కిడ్నీ, గుండెకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నయని చెబుతున్నారు. అంతేకాకుండా బీపి కూడా పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. షుగర్‌ వ్యాధి ఉన్నవారు పండ్లపై ఉప్పు చల్లుకోవడం అసలు మంచిదికాదని అంటున్నారు. అయితే..కొన్ని పండ్ల మీద ఉప్పు చల్లుకుని తింటే ఉపయోగాలు ఉన్నాయని చెబుతున్నారు.

publive-image

పళ్లను మరింత శుభ్రం చేస్తుంది:

ఉప్పు చల్లుకుని జామకాయలను తింటే పళ్లను మరింత శుభ్రం చేస్తుందని డాక్టర్ల చెబుతున్నారు. అయితే.. కొన్ని పండ్ల మీద కనిపించని బ్యాక్టీరియా ఉంటుంది. వాటిని మనం శుభ్రం చేసి ఉప్పు చల్లడం వల్ల ఆ బ్యాక్టీరియా చనిపోతుందని నిపుణులు అంటున్నారు. జామకాయలు, పుల్ల మామిడికాయలు, నిమ్మకాయలు, లాంటి వాటిలో సిట్రజన్ పండ్లపై ఉప్పు చల్లి తినడం వల్ల జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు వస్తాయి. ఉప్పు వీటిని సులభంగా జీర్ణం చేస్తుంది.. కావున గ్యాస్ట్రిక్ సమస్య ఎక్కువగా వచ్చస్తాయని చెబుతున్నారు.

publive-image

ఇది కూడా చదవండి: మెడ నల్లగా మారడం దేనికి సంకేతం..ఈ అవయవానికి ముప్పుతప్పదా?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు