Cricket : టీ20 కు ఎంపిక అయిన భారత జట్టు కప్పు తెస్తుందా?

టీ20 వరల్డ్‌కప్‌ కోసం నిన్న బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. 11 మంది మెయిన్ ప్లేయర్లతో పాటూ నలుగురు రిజర్వ్ ఆటగాళ్ల పేర్లను అనౌన్స్ చేసింది. సీనియర్లు, కుర్రాళ్ళతో నమానంగా ఉన్న ఈజట్టు ఈసారి అయినా భారత్‌కు వరల్‌కప్‌ను అందిస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Cricket : టీ20 కు ఎంపిక అయిన భారత జట్టు కప్పు తెస్తుందా?
New Update

T20 World Cup Indian Team : మరి కొన్ని రోజుల్లో టీ20 వరల్డ్ కప్(T20 World Cup) జరగనుంది. జూన్ 1 మొదలయ్యే ఈ పొట్టి కప్ ఫార్మాట్‌కు బీసీసీఐ(BCCI) నిన్న భారత జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ(Rohit Sharma) సారధ్యంలో మొత్తం 15 మందితో కూడిన జట్టును అనౌన్స్ చేసింది. రోహిత్ శర్మ, విరాట్‌తో పాటూ ఇందులో హార్ధిక్ పాండ్యాను కూడా ఎంపిక చేవారు సెలెక్టర్లు. రోహిత్ శర్మను, కోచ్ రాహుల్ ద్రావిడ్ గురించి ముందు నుంచే తెలిసిందే. వరల్డ్ కప్ అయిన తర్వాత నుంచే ట20 వరల్డ్‌కప్‌ వరకు వీళ్ళిద్దరూ ఉండాలని అందరూ బలంగా కోరుకున్నారు. ఇప్పుడు అదే చేసింది. కానీ ఐపిఎల్ లో ఘోరంగా విఫలమవుతున్న హార్ధిక్ పాండ్యాలాంటి వారిని మెయిన్ 11లో ఉంచి బాగా ఆడుతున్న రింకూ సింగ్‌ లాంటి వారిని రిజర్వవలో పెట్టడంతో ఇప్పుడు బీసీసీఐ ప్రకటించిన భారత జట్టు కప్ తెచ్చే జట్టేనా అని అందరికీ అనుమానాలు మొదలయ్యాయి.

మొదట నుంచీ టీ 20 అంటే కుర్రాళ్ళు ఆడాల్సిన ఫార్మాట్ అనే ఉద్దేశం బలంగా ఉంది. 2022 టీ 20 వరల్డ్‌కప్‌లో సెమీ ఫెనల్లో బారత జట్టు ఇంగ్లాండ్ చేతిలో ఘేరంగా ఓడిపోయింది. దాని తర్వాత బీసీసీఐ రోహిత్ శర్మ, విరాట్ లాంటి వాళ్లను పక్కన పెట్టింది. ఇక వాళ్ళు టీ20లు ఆడడం కష్టమే అనుకున్నారు అందరూ. అయితే రెండేళ్ళు తిరిగేసరికి మొత్తం మారిపోయింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలే జట్టులో ముఖ్యమైన వ్యక్తులు అయిపోయారు. దాంతో పాటూ హార్ధిక్ పాండ్యాను కూడా జట్టులోకి తీసుకోవడంతో చాలాకాలంగా ఐసీసీ ట్రోపీ(ICC Trophy) కోసం ఎదురు చూస్తున్న భారత జట్టు ఈసారి అయినా కప్‌ను తెస్తుందా అని అంటున్నారు.

గత ప్రపంచకప్‌లో ఆడిన ఎనిమిది మంది ఆటగాళ్ళు ఈసారి కూడా జట్టులో చోటు సంపాదించారు. రోహిత్ , కోహ్లీ, హార్ధిక్, సూర్యకుమార్, రిషబ్ పంత్, అర్షదీప్, అక్షర్ పటేల్, చాహల్ ఈసారి కూడా ఎంపిక అయ్యారు. ప్రస్తుతానికి వీరందరూ ఫామ్‌లోనే ఉన్నారు. దానికి తోడు వరల్డ్‌కప్‌కు మందు ఐపీఎల్ జరుగుతుండడంతో బాగా ప్రాక్టీస్ కూడా అవుతోంది. రోహిత్, కోహ్లీలు కూడా సూపర్ పామ్‌లో ఉన్నారు. ఇది కూడా జట్టు బలాన్ని మరింత పెంచుతుంది. కోహ్లీ అయితే ఐపీఎల్‌లో ఎక్కువ పరుగులు చేసిన వారిలో టాప్‌లో ఉన్నాడు కూడా. అమెరికాలో పిచ్‌లు మందకొడిగా ఉంటాయని చెబుతున్నారు. అలాంటి చోట్ల వీరిద్దరి బ్యాటింగ్ కీలకంగా మారుతుంది అనడంలో ఎటువంటి సందేమం లేదు. ఇక రిషబ్ పంత్...యాక్సిడెంట్ అయి మళ్ళీ వచ్చాడు. అయినా కూడా ఎక్కడా తగ్గడం లేదు. ఐపీఎల్‌లో తన సత్తా చాటుకుంటున్నాడు మళ్ళీ. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆడిడడం పంత్‌కు లిసి వచ్చే అంశం. సంజూ, అర్సదీప్, చామల్ వీళ్ళందరూ కూడా ఐసీఎల్‌లో బాగా ఆడుతూ మంచి ఫామ్‌ను కొనసాగిస్తున్నారు. ఇక హార్ధిక్, యశస్వి, సూర్యకుమార్‌లు...వీరు మాత్రం ఐపీఎల్‌లో అస్సలు బాగా ఆడని ప్లేయర్స్. వీరిమీదే అందరి డౌటూ. వీరు కానీ టీ20 వరల్డ్‌కప్‌లో సరిగ్గా ఆడలేదో...మన జట్టు పరిస్థితి అంతే. దాంతో పాటూ వాళ్ళ కెరీర్ కూడా ఖతం అయ్యే ఛాన్సులు ఉంటాయి. కాబట్టి ఇక మీదట అయినా వీళ్ళు ఆట మీద దృష్టి పెడితే మంచిది.

భారత జట్టుకు మరో కలిసి వచ్చే అంశం స్పిన్నర్లు. ఈసారి వాళ్ళదే కీలక పాత్ర. కులదీప్, చాహల్‌లు జట్టులో ఉన్నారు. వీళ్ళిద్దరూ ఐపీఎల్‌లో వికెట్ల రేస్‌లో ముందంజలోనే ఉన్నారు. అయితే వీరితో పాటూ ఉన్న సిరాజ్, అర్షదీప్‌, బుమ్రాలు మాత్రం ఏమీ ప్రభావం చూపించలేకపోతున్నారు. వరల్డ్‌కప్‌లో అద్భుతాలు చేసిన సిరాజ్ టీ20 ప్రపంచకప్‌లో కూడా అలానే రెచ్చిపోతే కప్‌కు ఢోకా ఉండదు. మొత్తానికి టీ20 వరల్డ్‌కప్‌ ఆడనున్న భారత జట్టు సీనియర్లు, కుర్రాళ్లతో సమతూకంగానే ఉంది. అందరూ కలిసి సమిష్టిగా రాణిస్తే కప్ సాధించడం ఏమీ అంత కష్టం కాదు.

Also Read:Delhi: నాలుగు స్కూల్స్‌కు బాంబు బెదిరింపులు..అప్రమత్తమైన పోలీసులు

#bcci #t20-world-cup #indian-squad
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe