ICC Chairman: అంతర్జాతీయ క్రికెట్ మండలి తరువాత ఛైర్మన్ ఎన్నికలు ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్నాయి. ఈ రేసులో ప్రస్తుత బీసీసీఐ సెక్రటరీ జైషా ఉన్నారని సమాచారం. ఇప్పుడు ఛైర్మన్‌గా గ్రెగ్ బార్క్‌లే నాలుగు సంవత్సరాలుగా ఈ పదవిలో కొనసాగుతున్నారు. అతడు మరో టర్మ్ ఛైర్మన్‌గా కొనసాగడానికి అర్హత ఉంది. నాలుగు ఏళ్ళ క్రితం జైషా మద్దతుతోనే బార్క్‌లే ఐసీసీ ఛైర్మన్ అయ్యారు.
ఈసారి జైషా కనుక ఐసీసీ ఛైర్మన్‌గా పోటీ చేస్తే గెలవడం ఖాయం అని చెబుతున్నారు. ఒకవేళ ఆయనే కనుక ఐసీసీ ఛైర్మన్ పదవిని చేపడితే అత్యంత చిన్న వయస్కుడిగా నిలుస్తారు. అిే దీని మీద జైష మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. మరోవైపు ఐసీసీ వార్షిక సమావేశం జులై 19 - 22 మధ్య కొలంబోలో జరగనుంది. ఈ వార్షిక సదస్సులో ఛైర్మన్ ఎన్నికకు సంబంధించిన టైమ్‌లైన్‌ను అధికారికంగా తయారుచేయాలని అనుకుంటున్నారు.
Also Read:Maldives: మాల్దీవుల్లో సెలబ్రేట్ చేసుకోండి..క్రికెటర్లకు ఆఫర్