ఐఆర్‌‌సీటీసీ సమ్మర్ ఊటీ టూర్ ప్యాకేజీ వివరాలివే!

 సమ్మర్‌‌లో ఊటీ టూర్ అంటే ఎంతో స్పెషల్. అందుకే తెలుగు రాష్ట్రాల్లోని టూరిస్టుల కోసం ఇండియన్ రైల్వేస్.. స్పెషల్ ఊటీ టూర్ ప్యాకేజీని అందుబాటులో ఉంచింది. ప్యాకేజీ వివరాలు స్టోరీలో ఉన్నాయ్ చదివేయండి!

ఐఆర్‌‌సీటీసీ సమ్మర్ ఊటీ టూర్ ప్యాకేజీ వివరాలివే!
New Update

సమ్మర్‌‌లో ఊటీ వెళ్లాలనుకునేవారి కోసం ఐఆర్‌సీటీసీ.. ‘అల్టిమేట్ ఊటీ’ పేరుతో హైదరాబాద్ నుంచి ఊటీ టూర్ ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ ప్రతీ మంగళవారం అందుబాటులో ఉంటుంది. ఐదు రాత్రులు, ఆరు రోజుల పాటు ఈ టూర్ సాగుతుంది. టూర్ మ్యాప్ ఇదీ..

ఇదొక అంతుచిక్కని మిస్టరీ! ఐఆర్‌‌సీటీసీ అల్టిమేట్ ఊటీ టూర్ ప్యాకేజీలో భాగంగా ఊటీతో పాటు కూనూర్ కూడా కవర్ అవుతుంది. ఈ టూర్ ప్రతి మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభమవుతుంది. మొదటిరోజు మధ్యాహ్నం 12.20 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో శబరి ఎక్స్‌ప్రెస్ ఎక్కడంతో టూర్ మొదలవుతుంది. రెండో రోజు ఉదయానికి ట్రైన్ కొయంబత్తూర్ చేరుకుంటుంది. అక్కడ్నుంచి రోడ్డు మార్గంలో ఊటీకి చేరుకోవాలి. రెండో రోజు ఊటీలోని బొటానికల్ గార్డెన్స్, ఊటీ లేక్ వంటివి చూసి రాత్రికి హోటల్‌లో స్టే చేస్తారు.

ఒకేరోజు 4,71,751 మంది విమాన ప్ర‌యాణం మూడో రోజు ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ చేసి ఊటీ లోకల్ టూర్‌‌కి వెళ్తారు. ఊటీలోని దొడ్డబెట్ట హిల్ స్టేషన్, టీ మ్యూజియం, పైకారా వాటర్ ఫాల్స్ వంటివి చూసి రాత్రికి తిరిగి హోటల్ చేరుకుంటారు. నాలుగో రోజు రోడ్డు మార్గంలో కూనూర్ వెళ్లి అక్కడ సైట్ సీయింగ్ చేస్తారు. రాత్రికి తిరిగి ఊటీలోని హోటల్‌లో స్టే చేస్తారు. ఇక ఐదో రోజు ఊటీ నుంచి బయల్దేరి కొయంబత్తూర్‌ చేరుకుంటారు. కొయంబత్తూర్‌లో సాయంత్రం హైదరాబాద్ రిటర్న్ ట్రైన్ ఎక్కడంతో టూర్ ముగుస్తుంది.

టూర్ ప్యాకేజీలో భాగంగా రైలు ప్రయాణం, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, హోటల్ స్టే, బ్రేక్‌ఫాస్ట్, ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటివి కవర్ అవుతాయి. లంచ్, డిన్నర్, సైట్స్‌లో ఎంట్రన్స్ టికెట్స్ వంటివి ప్రయాణీకులే చూసుకోవాలి. ఇక టూర్ ధరల విషయానికొస్తే.. స్లీపర్ క్లాస్‌లో ట్రిపుల్ షేరింగ్‌కు రూ.10,510, ట్విన్ షేరింగ్‌కు రూ.12,250, ఏసీ కంఫర్ట్‌ క్లాస్‌లో ట్రిపుల్ షేరింగ్‌కు రూ.12,970, ట్విన్ షేరింగ్‌కు రూ.14,700 గా ఉన్నాయి

#hyderabad #summer #irctc #ooty
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe