IRCTC Refund : ఐఆర్‌సీటీసీ రిఫండ్స్‌ ఇక నుంచి మరింత వేగంగా.. గంటలోనే మీ అకౌంట్ లోకి నగదు!

వినియోగదారులకు రిఫండ్లను ఇచ్చేందుకు ఆలస్యమవుతున్న సమయాన్ని తగ్గించేందుకు రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. రిఫండ్లను గంటలోపే తిరిగి ఇచ్చేందుకు సన్నాహాలు మొదలు పెట్టింది రైల్వే శాఖ. ఐఆర్‌సీటీసీ యూజర్ల నుంచి రిఫండ్ విషయంలో ఫిర్యాదులు అందుతున్న క్రమంలో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

Railway : రైల్వే శాఖ కీలక నిర్ణయం... ఇక నుంచి అలా చేస్తే జరిమానా తప్పదు!
New Update

IRCTC : రైలు ప్రయాణం(Train Journey)  చేసేవారు ఎక్కువగా ఆన్‌ లైన్ లో టికెట్లు బుక్‌(Online Ticket Booking) చేసుకుంటుంటారు. ఐఆర్‌సీటీసీ(IRCTC) లో కొన్నిసార్లు టికెట్ మనకి బుక్ కాకపోయినా అకౌంట్ లో నుంచి మాత్రం డబ్బులు కట్‌ అయిపోతాయి. అలాంటి సందర్భాల్లో ఐఆర్ సీటీసీ డబ్బులను తిరిగి అకౌంట్‌ లోకి వేస్తుంది. ఈ విషయం గురించి అందరికీ తెలిసిందే... అయితే ఆ రిఫండ్‌ చేసే దగ్గరే కొన్నిసార్లు రోజుల తరబడి వెయిట్‌ చేయాల్సి ఉంటుంది.

కానీ ఇప్పుడు ఆ అవసరం లేకుండా అలా డబ్బులు అకౌంట్లో నుంచి కట్‌ అయిన గంటలోపే డబ్బులను రిఫండ్ చేసేందుకు ఐఆర్‌సీటీసీ రిఫండ్‌(IRCTC Refund) ప్రక్రియను వేగం చేయనుంది. మరికొద్ది రోజుల్లోనే ఈ సమస్యకు పరిష్కారం దొరకనుంది. ఐఆర్‌సీటీసీ యూజర్ల నుంచి రిఫండ్ విషయంలో చాలా ఫిర్యాదులు అందుతున్న క్రమంలో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

వినియోగదారులకు రిఫండ్లను ఇచ్చేందుకు ఆలస్యమవుతున్న సమయాన్ని తగ్గించేందుకు రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. రిఫండ్లను తిరిగి ఇవ్వడానికి పడుతున్న సమయాన్ని తగ్గించడానికి ఈ ఏడాది జనవరిలో రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఐఆర్ సీటీసీ , ఆ సంస్థకు సేవలను అందించే ఐటీ స్టిస్టమ్స్ కూడా ఈ విషయం గురించి పని చేస్తున్నాయి.

టికెట్లను క్యాన్సిల్(Ticket Cancel) చేసుకున్నప్పుడు కానీ, టికెట్లు వెయిటింగ్‌ లిస్టు లో ఉన్నప్పుడు కానీ రిఫండ్ల ప్రక్రియ అనేది చాలా ఆలస్యంగా జరుగుతుంటుంది. ఇక నుంచి అలాంటి ఆలస్యం జరగకుండా రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వివరించారు.

Also Read : ”టిక్‌ టాక్‌” కథ కంచికి.. కీలక బిల్లుకు ఆమోదం తెలిపిన అగ్రరాజ్యం!

#tickets #railway #irctc #refund
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe