Israel-Iran: ఇస్మాయిల్‌ హనియాను అలానే హత్య చేశారు.. ప్రతీకారం తప్పదు : ఇరాన్

హమాస్ పొలిటికల్ చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియా హత్యకు ఇజ్రాయెల్‌ స్వల్పశ్రేణి రాకెట్‌ను వినియోగించిందని ఇరాన్‌ ఆరోపణలు చేసింది. ఈ ఆపరేషన్‌లో ఇజ్రాయెల్‌కు అమెరికా సాయం చేసిందని తెలిపింది. సరైన సమయంలో ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తప్పదంటూ హెచ్చరించింది.

Israel-Iran: ఇస్మాయిల్‌ హనియాను అలానే హత్య చేశారు.. ప్రతీకారం తప్పదు : ఇరాన్
New Update

హమాస్ పొలిటికల్ చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియా మృతి సంచలనం రేపుతోంది. అతడి హత్యకు ఇజ్రాయెల్‌ స్వల్పశ్రేణి రాకెట్‌ను వినియోగించిందని ఇరాన్‌ ఆరోపణలు చేసింది. ఆ రాకెట్‌కు ఏడు కిలోల వార్‌హెడ్‌ను కనెక్ట్ చేసి.. హనియ బస చేస్తున్న భవనంపై దాడి జరిపిందని పేర్కొంది. అంతేకాదు ఈ ఆపరేషన్‌లో ఇజ్రాయెల్‌కు అమెరికా సాయం చేసిందని తెలిపింది. అయితే దాడి జరిగిన ప్రదేశం ఎక్కడనేది మాత్రం వివరించలేదు. హనియా గదిలో బాంబులు అమర్చి పేల్చారని పలు అంతర్జాతీయ మీడియాలో కథనలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇరాన్ రెవల్యూషనరీ గార్ట్‌ ఈ హత్యకు సంబంధించి ఓ వీడియో ప్రకటన రిలీజ్ చేసింది.

Also Read: సెప్టెంబర్ 4న ట్రంప్,కమలా హారిస్ మధ్య లైవ్ డిబేట్!

ఇదిలాఉండగా.. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారంలో పాల్పొన్న హనియా.. ఆ నగరంలోనే హత్యకు గురయ్యాడు. ప్లాన్ ప్రకారమే ఇజ్రాయెల్ ఈ దాడికి పాల్పడిందని ఇరాన్ ఆరోపణలు చేసింది. సరైన సమయంలో ప్రతీకారం తప్పదంటూ హెచ్చరించింది. మరోవైపు ఇజ్రాయెల్‌పై ప్రత్యక్ష దాడికి ఇరాన్‌ అగ్రనేత అయతాల్లా అలీ ఖమేని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్‌ని టెల్‌ అవీవ్‌ నగరానికి అండగా ఉండేందుకు అమెరికా సిద్ధమైంది. పశ్చిమాసియాకు ఫైటర్ జెట్లు, యుద్ధ నౌకలు పంపిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ క్షిపణి, డ్రోన్ దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఇజ్రాయెల్‌కు అమెరికా అండగా ఉంది.

Also Read: అమెరికా తో పోటీ పడాలంటే భారత్ కు 75 ఏళ్లు పడుతుంది..వరల్డ్ బ్యాంక్!

#telugu-news #national-news #israel
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe