Hyderabad: ఇరాన్‌ ఎన్నికలు.. హైదరాబాద్‌లో బ్యాలెట్‌ బాక్స్‌లు

ఇరాన్‌లో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు.. జూన్ 28న ఎన్నికలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో భారత్‌లో ఉంటున్న ఇరానీయన్లు కూడా ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. న్యూ ఢిల్లీ, పూణె, ముంబయి, హైదరాబాద్‌లో బ్యాలెట్‌ బాక్స్‌లు ఏర్పాటు చేశారు.

New Update
Hyderabad: ఇరాన్‌ ఎన్నికలు.. హైదరాబాద్‌లో బ్యాలెట్‌ బాక్స్‌లు

Iran Presidential Election: ఇటీవల ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (Ebrahim Raisi) హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు.. జూన్ 28న ఇరాన్‌లో అధ్యక్ష ఎన్నికలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో భారత్‌లో ఉంటున్న ఇరానీయన్లు కూడా ఓటు వేసేందుకు బ్యాలెట్‌ బాక్స్‌లు (Ballot Box) ఏర్పాటు చేశారు. న్యూ ఢిల్లీ, పూణె, ముంబయి, హైదరాబాద్‌లో  Hyderabad) బ్యాలెట్‌ బాక్స్‌లు ఏర్పాటు చేశామని హైదరాబాద్‌లో ఉంటున్న ఇరాన్ కాన్సులేట్ జనరల్ మహ్దీ షారోఖీ వెల్లడించారు.

Also read: తెలంగాణలో ఒక్క హాస్టల్‌కి కూడా రిజిస్ట్రేషన్ లేదు..

శుక్రవారం ఉదయం 8 గంటలకు ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభించామని.. సాయంత్రం 6 గంటల వరకు ఇది కొనసాగుతుందని పేర్కొన్నారు. ఇరాన్ దేశస్థులు ఈ ఎన్నికల్లో పాల్గొంటారని భావిస్తున్నామని తెలిపారు. ఇరాన్‌ పౌరసత్వం ఉన్నవారు, ఇరాన్ పాస్‌పోర్టు ఉన్నవారు ఓటు వేయొచ్చని క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్‌లో ఉన్న ఇరాన్‌ కమ్యూనిటీలో దాదాపు 1000 మంది ఉన్నారని.. కాన్సులేట్‌ తెలిపారు. అయితే ఇరాన్‌లో పుట్టినప్పటికీ.. భారత పౌరసత్వం ఉన్న ఇరానీయన్లకు మాత్రం ఓటు వేసే హక్కు లేదని పేర్కొన్నారు.

Also Read: కొండగట్టుకు పవన్ కళ్యాణ్.. తెలంగాణలో కూటమి జట్టుకు మొదటి మెట్టయిందా?

Advertisment
తాజా కథనాలు