Iran: ఇకనుంచి ఇరాన్‌కు వీసా లేకుండానే వెళ్లొచ్చు.. కానీ

పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా తమ దేశంలోకి వీసా లేకుండానే భారతీయులు రావొచ్చని ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. అక్కడ 15 రోజుల పాటు గడపొచ్చని తెలిపింది. ఇండియాతో పాటు మరో 32 దేశాలకు ఈ ఆఫర్‌ను ప్రకటించింది. ఫిబ్రవరి 4 నుంచే ఈ ఫ్రీ-వీసా ప్రొగ్రామ్ మొదలైంది.

Iran: ఇకనుంచి ఇరాన్‌కు వీసా లేకుండానే వెళ్లొచ్చు.. కానీ
New Update

ఇరాన్‌ ప్రభుత్వం భారతీయులకు గుడ్‌ న్యూస్ తెలిపింది. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా తమ దేశానికి వాయు మార్గంలో వచ్చే భారతీయులు వీసా లేకుండానే అనుమతించనున్నట్లు ప్రకటించింది. 15 రోజుల వరకు ఇరాన్‌లో గడపవచ్చని పేర్కొంది. ఈ వీసా-ఫ్రీ అవకాశం ఫిబ్రవరి 4 నుంచే అందుబాటులోకి వచ్చింది. అయితే గత ఏడాది డిసెంబర్‌లోనే ఇరాన్.. భారత్‌తో పాటు మరో 32 దేశాలకు ఉచిత వీసా ప్రొగ్రామ్‌కు ఆమోదం తెలిపింది. ఇందులో యూఏఈ, సౌదీ అరేబియా, ఇండోనేషియా, జపాన్, సింగాపూర్‌, మలేషియా కూడా ఉన్నాయి.

Also Read: నల్గొండలో కేసీఆర్‌ సభకు నో పర్మిషన్‌.. ఎందుకంటే..

ఎక్కువరోజులు ఉండాలనుకుంటే ?

అయితే తమ దేశానికి వీసా లేకుండా రావడానికి అనుమతించేందుకు ఇరాన్‌ కొన్ని షరతులు కూడా విధించింది. సాధారణ పాస్‌పోర్టులతో ప్రతి ఆరు నెలలకొకసారి మాత్రమే వీసా లేకుండా వచ్చే ఇరాన్‌కు వచ్చే అవాశం ఉంటుంది. అలాగే కేవలం 15 రోజులు మాత్రమే ఇరాన్‌లో ఉండటానికి అనుమతి ఉంటుంది. అంతకన్నా ఎక్కువ రోజులు ఉండటం కుదరదు. ఒకవేళ ఎక్కవరోజులు ఉండాలనుకుంటే.. లేదా ఆరు నెలల్లో ఎక్కువసార్లు వీసా లేకుండా రావాలనుకున్నా.. అలాగే ఇతర వీసాలు కావాలనుకుంటే తప్పకుండా భారత్‌లో ఉన్న ఇరానియన్‌ ఎంబసీ నుంచి వీసా తీసుకోవాల్సి ఉంటుంది.

ప్లైట్‌లో వచ్చినవారికి మాత్రమే

ఇరాన్‌లో పర్యాటక ప్రాంతాలు చూడడానికి వచ్చినవారికి మాత్రమే ఈ ఉచిత వీసా అనేది వర్తిస్తుంది. అయితే సముద్ర మార్గం గుండా వచ్చినవారికి వీసా లేకుండా ఇరాన్‌లో ఉండేందుకు అవకాశం ఉండదు. కేవలం వాయు మార్గం ద్వారా వచ్చిన వారికి మాత్రమే ఈ అనుమతి ఉంటుంది ఇరాన్ ప్రభుత్వ అధికారులు తెలిపారు.

Also Read: హెలికాప్టర్‌ కూలి చిలీ మాజీ అధ్యక్షుడు మృతి.. వీడియో వైరల్

#telugu-news #iran #iran-tourism #free-visa
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe