IPS Viral Tweet : అదంతా అమ్మ అనుగ్రహం వల్లే జరిగింది...ఐపీఎస్ అధికారి ట్వీట్ వైరల్..!! నవరాత్రి సందర్భంగా ఓ ఐపీఎస్ అధికారి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. వాస్తవానికి, నవరాత్రి సందర్భంగా విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు తనకు ఫాస్టింగ్ ఫుడ్ ఎలా వచ్చిందో అధికారి చెప్పారు. అదంతా అమ్మ అనుగ్రహం వల్లే జరిగిందని ట్వీట్లో చెప్పుకొచ్చారు. తాను ఫాస్టింగ్ ఫుడ్ లేకుండా ఉపవాసం ఉండాల్సి వస్తుందనుకున్నాను. కానీ ఫ్లైట్ లో ఫాస్టింగ్ ఫుడ్ ఇవ్వడం చూసి తాను షాక్ అయ్యాను అని చెప్పారు. ఫుడ్ ప్లేట్ ఫొటోను షేర్ చేస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారింది. By Bhoomi 19 Oct 2023 in టాప్ స్టోరీస్ వైరల్ New Update షేర్ చేయండి నవరాత్రి సందర్భంగా చాలా మంది ఉపవాసాలు పాటిస్తారు. అయితే దీని వల్ల కొన్నిసార్లు ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఓ ఐఎస్ అధికారి ఉపవాసం చేస్తున్న విషయం తెలుసుకున్న విమాన సిబ్బంది ప్రత్యేక భోజన ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా తన కోసం ఫాస్టింగ్ ఫుడ్ ఏర్పాటు చేయడం అమ్మవారి దయవల్లే జరిగిందని ఆ ఐపీఎస్ అధికారి చెబుతున్నారు. అరుణ్ బోత్రా అనే ఐపీఎస్ అధికారి ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్నారు. ఇది కూడా చదవండి: భారీగా పెరగనున్న గ్రూప్-2 పోస్టులు..నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త! అయితే విమాన సిబ్బంది భోజనం ఇవ్వడంతో బోత్రా నిరాకరించారు. తాను ఉపవాసం ఉన్నాని చెప్పడంతో సిబ్బంది ప్రత్యేక ఫాస్టింగ్ ఫుడ్ ను ఇచ్చారు. ఇది చూసిన బోత్రా ఆశ్చర్యపోయానని చెప్పారు. ఇది సాక్షాత్తూ అమ్మవారి కృప అన్నారు. బోత్రా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ ఫాస్టింగ్ ఫుడ్ కు ఎలాంటి స్పెషల్ ఛార్జీలు తీసుకోలేదట. అంతేకాదు ఒక సుందరమైన నోట్ కూడా రాసిచ్చారట. ఈ క్రూ మెంబర్స్ తీరుపై జనాలు మెచ్చుకుంటున్నారు. Mother Divine takes care of you in different forms. Today she came as Purvi, an @IndiGo6E crew member. As I didn’t take snacks due to #Navratri fasting she returned with Sabudana Chips, Til Chikki & tea. When I asked how much to pay, she said- ‘No money sir. I am also fasting.’ pic.twitter.com/f4Av5oOZoF — Arun Bothra 🇮🇳 (@arunbothra) October 18, 2023 ఇది కూడా చదవండి: నడ్డి విరిచారు..! టీమిండియా టార్గెట్ ఎంతంటే? #trending-news #ips-officer #viral-tweet #navratri-2023 #ips-viral-tweet మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి