SRH: బోర'బండ' బ్రూక్‌కు బై బై.. ఇంటికెళ్లి బొజ్జో బ్రో!

ఇంగ్లండ్‌ ప్లేయర్‌ హ్యారీ బ్రూక్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రిలీజ్ చేసింది. ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌కు ముందు బ్రూక్‌ను రూ.13.2 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే బ్రూక్‌ అట్టర్‌ఫ్లాప్‌ అయ్యాడు. బ్రూక్‌తో పాటు మరో ఐదుగురు ప్లేయర్లను SRH వదిలేసింది.

New Update
SRH: బోర'బండ' బ్రూక్‌కు బై బై.. ఇంటికెళ్లి బొజ్జో బ్రో!

ఈ ఏడాది ఐపీఎల్‌లో బోరబండ బ్రూక్‌(హ్యారీ బ్రూక్) సన్‌రైజర్స్‌కు గుదిబండలా మారాడు. రూ.13 కోట్లు పెట్టి కొంటే ఒక్కటంటే ఒక్క మ్యాచే సరిగ్గా ఆడాడు. ఈ సీజన్‌లో మొత్తం 11 మ్యాచ్‌లు ఆడిన బ్రూక్ 190 రన్స్ చేశాడు. అందులో ఒక సెంచరీ ఉంది. అంటే మిగిలిన పది మ్యాచ్‌ల్లో బ్రూక్‌ చేసిన పరుగులు 90. బ్రూక్‌ ఆటకంటే అతని అప్రోచ్‌ ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో ఊహించినట్లుగానే ఈ ఇంగ్లీష్‌ ఆటగాడిని కావ్యామారన్‌ టీమ్‌ వదులుకుంది. వేలానికి వదిలేసింది.


పర్సులో రూ.34 కోట్లు
హ్యారీ బ్రూక్‌తో పాటు సన్‌రైజర్స్‌ మరో ఐదుగురు ఆటగాళ్లను రిలీజ్ చేసింది. కార్తీక్ త్యాగి, ఆదిల్ రషీద్, అకేల్ హోసేన్, సమర్థ వ్యాస్, వివ్రాంత్ శర్మను వేలానికి రిలీజ్ చేసింది. ఈ ఆరుగురి ఆటగాళ్ల రిలీజ్‌తో సన్‌రైజర్స్‌ పర్సులో రూ.34కోట్లు మిగిలాయి. ఇక రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళురు నుంచి షాదబ్‌ని ట్రేడ్ చేసుకుంది కావ్యా టీమ్.


సన్‌రైజర్స్‌ రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల లిస్ట్:
ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ, మార్కో జాన్సెన్, అబ్దుల్ సమద్, గ్లెన్ ఫిలిప్స్, మయాంక్ అగర్వాల్, అన్మోల్‌ప్రీత్ సింగ్, నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్ (ఆర్‌సీబీ నుంచి ట్రేడ్), సన్వీర్ సింగ్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే. ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్, ఫజహక్ ఫరూకీ, ఉపేంద్ర యాదవ్.

Also Read: ధోనీ మాస్టర్‌ స్ట్రోక్‌.. పర్సులో ఏకంగా రూ.32 కోట్లు.. స్టార్లకు గుడ్‌బై!

Advertisment
Advertisment
తాజా కథనాలు