IPL Auction: అర్జున్ టెండూల్కర్‌కు ముంబై టాటా...? మరో నలుగురు ఆటగాళ్లకు రాంరాం..!

ఐపీఎల్‌ జట్లలో ఆటగాళ్ల రిటెన్షన్‌కు రేపే ఆఖరి రోజు. ఈ క్రమంలోనే ఐదుగురు ఆటగాళ్లను ముంబై వేలానికి వదిలే ఛాన్స్ కనిపిస్తోంది. అందులో అర్జున్‌ టెండూల్కర్‌ కూడా ఉండే అవకాశం ఉంది. అటు అర్చర్, డెవాల్డ్ బ్రీవిస్‌, క్రిస్‌ జోర్డాన్‌, సందీప్‌ వారియర్‌ని లీవ్ చేసే ఛాన్స్ ఉంది.

New Update
IPL Auction: అర్జున్ టెండూల్కర్‌కు ముంబై టాటా...? మరో నలుగురు ఆటగాళ్లకు రాంరాం..!

ఐపీఎల్‌(IPL)లో ప్లేయర్ల రిటెన్షన్‌కు తుది గడువు ముంచుకొస్తొంది. నవంబర్‌ 26తో రిటెన్షన్‌ డెడ్‌లైన్‌ ముగియనుంది. పలువురు ఆటగాళ్లను వేలానికి వదిలేందుకు ఫ్రాంచైజీలు నిర్ణయించుకున్నాయి. ప్రతీసారి వేలానికి ముందు ప్రాంతంతో సంబంధం లేకుండా కొన్ని జట్లపై క్రికెట్ ఫ్యాన్స్‌ చూపు ఉంటుంది. ఆ లిస్ట్‌లో ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఉంటాయి. ఈ జట్లకు ఫ్యాన్‌ బేస్‌ ఎక్కువ. దీంతో సాధారణంగానే వీటిపై ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. మూడు సీజన్లగా ముంబై ఇండియన్స్‌కు కప్‌ లేదు. ఆశించిన స్థాయిలో ఆడడం లేదు. దీంతో పలువురు ఆటగాళ్లను వదిలేసేందుకు ఫ్రాంచైజీ నిర్ణయించుకునట్లు సమాచారం.

అర్జున్‌కు బై బై:
సచిన్‌ కుమారుడు అర్జున్‌ టెండూల్కర్‌(Arjun Tendulkar) గత సీజన్‌లో ముంబై ఇండియన్స్‌(Mumbai Indians) తరుఫున అరెంగ్రేటం చేశాడు. వైవిద్యంగా బౌలింగ్‌ చేస్తున్నప్పటికీ కొన్ని ఓవర్లలో భారీగా సమర్పించుకున్నాడు. అటు డొమిస్టిక్‌ క్రికెట్‌లో రాణిస్తున్నప్పటికీ అర్జున్‌ ఇంకా మెరుగవాల్సిన అవసరం ఉంది. ఇటు స్టార్లతో కూడిన ముంబై జట్టులో అర్జున్‌కు చోటు దక్కడం కష్టమనే చెప్పాలి. దీంతో అర్జున్‌ మరింత బెటర్ అవ్వాలంటే ముంబై కాకుండా ఇతర జట్లకు ఆడితేనే మంచిదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ ఉద్ధేశంతోనే అర్జున్‌కు వేలంలోకి రిలీజ్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది.

మరో నలురురు ఆటగాళ్లకు కూడా టాటా:
అటు జోఫ్రా ఆర్చర్‌ను కూడా ముంబై రిలీజ్ చేయనుందని సమాచారం. 2022 ఐపీఎల్‌ వేలంలో ముంబై అర్చర్‌ను రూ. 8 కోట్ల కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో కేవలం ఐదు మ్యాచ్‌లే ఆడాడు. గాయాలతో తుది జట్టులో ఆడలేదు. దక్షిణాఫ్రికా బ్యాటర్ డెవాల్డ్ బ్రీవిస్‌ని కూడా ముంబై లీవ్ చేయనుందని తెలుస్తోంది. 'బేబీ ABగా' పేరు తెచ్చుకున్న బ్రీవిస్‌కు ముంబై రూ. 3 కోట్ల చెల్లిస్తోంది. టాలెంట్‌ ఉన్నా.. ఈ ఏడాది సీజన్‌లో అతడికి మ్యాచ్‌ ఆడే ఛాన్స్ రాలేదు. ఇక ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆర్చర్ గాయపడడంతో అతని స్థానంలో వచ్చిన క్రిస్ జోర్డాన్ ఘోరంగా విఫలమయ్యాడు. ఆరు మ్యాచ్‌లలో మూడు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌లో జస్ప్రీత్ బుమ్రా స్థానంలో కేరళ పేసర్ సందీప్ వారియర్ ఏ మ్యాచ్‌లోనూ కనిపించలేదు. అతడిని కూడా వేలానికి విడిచిపెట్టే ఛాన్స్ కనిపిస్తోంది.

Also Read: RCBకి రోహిత్ శర్మ..? పూనకాలు లోడింగ్‌…!

WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు