Pandya Vs Rohit: 'రోహిత్ శర్మ నా కింద...' పాండ్యా షాకింగ్‌ కామెంట్స్‌!

హిట్‌మ్యాన్‌ ఫ్యాన్స్‌ను కాస్త కూల్‌ చేశాడు ముంబై ఇండియన్స్‌ కొత్త కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా. రోహిత్‌కి కాకుండా పాండ్యాకు ముంబై కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. రోహిత్‌కు తన కెప్టెన్సీలో ఆడడానికి ఎలాంటి ఇబ్బంది ఉండడని.. అతను ఎప్పుడూ తన భూజంపై చేయి వేసే ఉంచుతాడని పాండ్యా చెప్పుకొచ్చాడు.

New Update
Pandya Vs Rohit: 'రోహిత్ శర్మ నా కింద...' పాండ్యా షాకింగ్‌ కామెంట్స్‌!

2024 ఐపీఎల్‌(IPL) సీజన్‌కు జరిగిన మినీ వేలానికి ముందు ముంబై ఇండియన్స్‌ తీసుకున్న ఓ నిర్ణయం రోహిత్‌ శర్మ(Rohit Sharma) అభిమానుల ఆగ్రహానికి కారణం అయ్యింది. మరో నాలుగు రోజుల్లో(మార్చి22) ప్రారంభంకానున్న ఐపీఎల్‌ 17వ సీజన్‌కు ముంబై కెప్టెన్‌గా రోహిత్‌ని కాకుండా గుజరాత్‌ నుంచి ట్రేడ్ చేసుకున్న హార్దిక్‌ పాండ్యా(Hardik Pandya)ను అంబానీ ఫ్రాంచైజీ నియమించిన విషయం తెలిసిందే. ఈ డిసిషన్‌ గత డిసెంబర్‌లోనే తీసుకున్నా హిట్‌మ్యాన్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహం మాత్రం ఇంకా చల్లరలేదు. సోషల్‌మీడియాలో ఇప్పటికీ ముంబై ఫ్రాంచైజీ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేశారు. కొంతమంది ఏకంగా ముంబై జెర్సీలను తగలబెట్టారు. అయితే ఫ్రాంచైజీ మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకుంటూనే ఉంది. ఈ క్రమంలోనే ముంబై కొత్త కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారి తీసింది.

ఇబ్బందేమీ లేదు:
రోహిత్ శర్మకు తన కెప్టెన్సీలో ఆడడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నాడు హార్దిక్ పాండ్యా. ముంబై కెప్టెన్సీలో రోహిత్‌ ఏం సాధించాడో.. దాన్ని తాను ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నానని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు. ఇందులో ఎలాంటి ఇబ్బంది లేదని.. ఇది తనకు ఒక మంచి అనుభవమన్నాడు పాండ్యా. రోహిత్‌ కెప్టెన్సీలో తన కెరీర్‌ మొత్తం ఆడానని గుర్తు చేసుకున్నాడు పాండ్యా. రోహిత్‌ ఎల్లప్పుడూ తన భుజంపై చేయి వేసే ఉంచుతాడని తనకు తెలుసన్నాడు పాండ్యా. నిజానికి హార్దిక్‌ పాండ్యాకు యాటిట్యూడ్‌ ఎక్కువ అని అంతా భావిస్తుంటారు. అయితే రోహిత్‌ విషయంలో ఓవైపు అభిమానులు అతడిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా.. పాండ్యా మాత్రం హూందాగా మాట్లాడడం చాలా మందిని షాక్‌కు గురి చేసింది. అదే సమయంలో హిట్‌ మ్యాన్‌ ఫ్యాన్స్‌ కోపం కాస్త తగ్గినట్టే కనిపించింది

వారికి ఆ రైట్ ఉంది:
చాలా నిజాయితీగా చెప్పాలంటే తామంతా అభిమానులను గౌరవిస్తామని చెప్పాడు హార్దిక్‌. అదే సమయంలో ఆటపై ఎక్కువగా దృష్టి పెడతామన్నాడు. ఇక తాను నియంత్రించలేని వాటిపై దృష్టి పెట్టనని... అదే సమయంలో తాను చాలా కృతజ్ఞుడనని తెలిపాడు. అభిమానులకు ఏదైనా చెప్పే హక్కు ఉంటుందని.. అదే సమయంలో మేం బాగా ఆడడంపై దృష్టి పెడతామని హార్దిక్ పాండ్యా తెలిపాడు. హార్దిక్ పాండ్యా వారం రోజులుగా ముంబై ఇండియన్స్ ప్రీ-సీజన్ క్యాంప్‌లో పూర్తి స్థాయిలో శిక్షణ తీసుకుంటున్నాడు. ఇక మార్చి 24, ఆదివారం నరేంద్ర మోదీ స్టేడియంలో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్‌ గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది.

Also Read: మరో మల్టీప్లెక్స్ ఓపెనింగ్ ప్లాన్ చేసిన అల్లు అర్జున్.. ఎక్కడో తెలిస్తే షాకవుతారు..!

Advertisment
Advertisment
తాజా కథనాలు