SRH vs MI: ఉప్పల్‌లో కొడితే బాల్‌ తుప్పల్లో పడిందంటే ఇదేనేమో.. ఇంత అరాచక మ్యాచ్‌ ఎప్పుడూ చూడలేదు భయ్యా!

ముంబై వర్సెస్‌ హైదరాబాద్‌ మ్యాచ్‌లో రికార్డులు ఏరులై పారాయి. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి 38 సిక్సులు కొట్టారు. ఇక రెండు టీమ్‌లు కలిపి 523 రన్స్‌ చేశాయి. ఇలా ఎన్నో లిస్టుల్లో ఈ మ్యాచ్‌ టాప్‌లో నిలిచింది. రికార్డులపై పూర్తి సమాచారం కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.

SRH vs MI: ఉప్పల్‌లో కొడితే బాల్‌ తుప్పల్లో పడిందంటే ఇదేనేమో.. ఇంత అరాచక మ్యాచ్‌ ఎప్పుడూ చూడలేదు భయ్యా!
New Update

Mumbai Indians vs Sun Risers Hyderabad: టీ20 అంటే వినోదం. ఫోర్లు, సిక్సులు, రికార్డులు, అరుపులు, కేకలు, ఈలలు, గోలలు..! హై స్కోరింగ్‌ మ్యాచ్‌ అంటే ఆ కిక్కు మరో లెవల్‌.. అది కూడా రెండు టీమ్‌లు నువ్వా నేనా అన్నట్టు తలపడితే ఫ్యాన్స్‌కు పండుగే. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ వర్సెస్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్‌ నెక్ట్స్‌ లెవల్‌లో సాగింది. ఉప్పల్‌ స్టేడియాన్ని హోరెత్తించింది. మొదటి ఓవర్‌ నుంచి చివరి ఓవర్‌కు అద్భుతంగా సాగిందీ మ్యాచ్‌. సన్‌రైజర్స్‌ ఓపెనర్‌ హెడ్‌తో మొదలైన బౌండరీల వర్షం ముంబై మిడిలార్డర్‌ బ్యాటర్‌ టిమ్‌ డేవిడ్‌ దంచుడు వరకు కొనసాగింది.



విధ్వంసం:

సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ల విధ్వంసానికి ముంబై ఇండియన్స్‌ బౌలర్లు బలయ్యారు. 20 ఓవర్లలో హైదరాబాద్‌ ఏకంగా 277/3 రన్స్ చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు. గతంలో పుణేపై రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 263 రన్స్ చేసింది. ఇప్పుడా రికార్డు బ్రేక్ అయ్యింది. SRH ఓపెనింగ్ బ్యాటర్, ట్రావిస్ హెడ్, కేవలం 24 బంతుల్లో 62 పరుగులు చేశాడు. ఆ తర్వాత అభిషేక్ శర్మ సంచలన బ్లాస్టింగ్‌ బ్యాటింగ్‌తో ముంబై బౌలర్ల దగ్గర సమాధానమే లేకుండా పోయింది. ఆ తర్వాత 34 బంతుల్లో 80 పరుగులతో హెన్రిచ్ క్లాసెన్ అజేయంగా నిలిచాడు. దీంతో సర్‌రైజర్స్‌ 11ఏళ్ల క్రితం బెంగళూరు క్రియేట్ చేసిన భారీ స్కోరు రికార్డును బ్రేక్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లో 246 రన్స్ చేసింది.



ఐపీఎల్‌లో టాప్‌ స్కోర్లు:

277/3 - SRH vs MI, హైదరాబాద్, 2024

263/5 - RCB vs PWI, బెంగళూరు, 2013

257/5 - LSG vs PBKS, మొహాలి, 2023

248/3 - RCB vs GL, బెంగళూరు, 2016

246/5 ​​- CSK vs RR, చెన్నై, 2010

--> ఇరు జట్లు కలిపి 523 పరుగులు చేశాయి. టీ20 చరిత్రలో ఒకే మ్యాచ్‌లో ఇవే అత్యధిక పరుగులు. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ మధ్య జరిగిన టీ20లో 517 పరుగులు గతంలో అత్యుత్తమం.

ఇక సిక్సర్ల విషయంలోనూ ఈ మ్యాచే టాప్‌:

38 - SRH vs MI, హైదరాబాద్, IPL 2024

37 - బాల్ఖ్ లెజెండ్స్ v కాబుల్ జ్వానన్, షార్జా, APL 2018

37 - SNKP vs JT, బస్సెటెర్రే, CPL 2019

36 - టైటాన్స్ vs నైట్స్, పోట్చెఫ్‌స్ట్రూమ్ CSA T20 ఛాలెంజ్ 2022

35 - JT vs TKR, కింగ్‌స్టన్, CPL 2019

Also Read: హార్దిక్‌కు మద్దతుగా కోహ్లీ, ధోనీ ఫ్యాన్స్‌.. ఈ ప్రేమ వెనుక కారణాలేంటి?

#sun-risers-hyderabad #cricket #mumbai-indians #ipl-2024
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe