MI vs GT : మరోసారి ఫస్ట్‌ మ్యాచ్‌ దేవుడుకి.. ఇలా ఓడిపోకపోతే అంబానీ మావా ఫుడ్‌ పెట్టడు కావొచ్చు!

ఐపీఎల్‌ 17వ సీజన్‌లోనూ ముంబై ఇండియన్స్‌ సెంటిమెంట్‌ కొనసాగింది. సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఓటమితో మొదలుపెట్టింది. గుజరాత్‌పై ముంబై 6 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. సీజన్‌లో ఫస్ట్‌ మ్యాచ్‌ను ఓటమితో ప్రారంభించడం ముంబైకి ఇది వరుసగా 12వ సారి.

MI vs GT : మరోసారి ఫస్ట్‌ మ్యాచ్‌ దేవుడుకి.. ఇలా ఓడిపోకపోతే అంబానీ మావా ఫుడ్‌ పెట్టడు కావొచ్చు!
New Update

IPL 2024 Mumbai Indians : కెప్టెన్‌ మారాడు కానీ ఫస్ట్‌ మ్యాచ్‌ ఫేటే మారలేదు. ముంబై ఇండియన్స్‌(Mumbai Indians) మరోసారి మొదటి మ్యాచ్‌ దేవుడుకు ఇచ్చేసింది. గుజరాత్‌(Gujarat) చేతిలో ఓడిపోయింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ(Narendra Modi) స్టేడియంలో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) చేతిలో ముంబై ఇండియన్స్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆరు పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ గెలిచింది. ముంబై ఇండియన్స్ జట్టు వరుసగా లీగ్‌లో తొలి మ్యాచ్‌ ఓడిపోవడం ఇది 12వ సారి. 2013 నుంచి 2024 వరకు ముంబై ఇండియన్స్ ఐపీఎల్‌ సీజన్‌(IPL Season) ను మొదటి మ్యాచ్‌లోనే ఓటమితో ప్రారంభించాల్సి వచ్చింది. ముంబై ఇండియన్స్ చివరిసారిగా 2012లో తొలి మ్యాచ్‌ విజయంతో సీజన్‌ను స్టార్ట్ చేసింది. ఆ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌(Chennai Super Kings) తో జరిగిన తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది. ఆ తర్వాత 2013 నుంచి ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ జట్టు తన ఫేట్‌ను మార్చుకోలేకపోయింది.



ముంబై ఇండియన్స్‌ మొదటి మ్యాచ్‌:

2013 తొలి మ్యాచ్‌ - ఓటమి

2014 తొలి మ్యాచ్‌ - ఓటమి

2015 తొలి మ్యాచ్‌ - ఓటమి

2016 తొలి మ్యాచ్‌ - ఓటమి

2017 తొలి మ్యాచ్‌ - ఓటమి

2018 తొలి మ్యాచ్‌ - ఓటమి

2019 తొలి మ్యాచ్‌ - ఓటమి

2020 తొలి మ్యాచ్‌ - ఓటమి

2021 తొలి మ్యాచ్‌ - ఓటమి

2022 తొలి మ్యాచ్‌ - ఓటమి

2023 తొలి మ్యాచ్‌ - ఓటమి

2024 తొలి మ్యాచ్‌ - ఓటమి



రోహిత్ వికెట్ తర్వాత ఢమాల్:

169 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ముంబై విఫలమైంది. ఆఖరి 5 ఓవర్లలో హార్దిక్ పాండ్యా(Hardik Pandya) సేన 40 పరుగులు చేస్తే సరిపోయే పరిస్థితి నుంచి ఆరు పరుగుల తేడాతో ఓడిపోయే స్థితికి చేరుకుంది. చివరి 5 ఓవర్లకు ముందు ముంబై చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. అయితే రోహిత్‌ ఔటైన తర్వాత మిగిలిన బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌తో రోహిత్‌ ఎంత విలువైన ఆటగాడో ముంబై ఫ్రాంచైజీకి తెలిసి వచ్చినట్టుయింది. 13వ ఓవర్ మొదటి బంతికి సాయి కిషోర్‌ వేసిన బంతిని స్వీప్ చేయడానికి ప్రయత్నించిన రోహిత్‌ LBWగా వెనుదిరిగాడు. అక్కడి నుంచి ముంబైకి పరిస్థితులు దిగజారాయి. మరోవైపు ఈ మ్యాచ్‌లో ముంబై స్పీడ్‌ స్టార్‌ బుమ్రా బంతితో సత్తా చాటాడు. నాలుగు ఓవర్లలో కేవలం 14 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. రోహిత్‌, బుమ్రా ఆటకు మిగిలిన వారి సహకారం అంది ఉంటే ముంబై గెలిచి ఉండేదని ఫ్యాన్స్‌ ఫీల్ అవుతున్నారు.

Also Read : 8 గంటల జిమ్ వర్క్ అవుట్, 300 పుష్ అప్‌లు! వెస్టిండీస్ దిగ్గజం సూపర్ సిక్స్ వెనుక రహస్యం ఇదేనా?

#gujarat-titans #cricket #mumbai-indians #ipl-2024
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe