KKR: కమ్‌బ్యాక్ కెప్టెన్.. కమ్‌బ్యాక్ మెంటర్.. ఈసారి ప్రత్యర్థులకు దబిడి దిబిడే! ఐపీఎల్-2024 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్‌ను ఎంపిక చేసింది మ్యానేజ్‌మెంట్. వైస్‌కెప్టెన్‌గా నితీశ్‌రాణాను నియమించింది. ఇక కేకేఆర్ ఇప్పటికే గౌతమ్ గంభీర్‌ను మెంటార్‌గా అపాయింట్ చేసిన విషయం తెలిసిందే. 2012 , 2014లో కోల్‌కతాను గంభీర్ రెండు సార్లు విజేతగా నిలిపాడు. By Trinath 14 Dec 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి ఐపీఎల్(IPL)-2024 సీజన్‌కు ఇంకా మూడు నెలలుకుపైగా సమయం ఉంది. అయినా ఇప్పటినుంచే ఐపీఎల్ గురించి ఫ్యాన్స్‌లో తెగ చర్చ జరుగుతోంది. అందులోనూ డిసెంబర్ 19న ఐపీఎల్ ఆక్షన్ ఉండడంతో అభిమానులు ఇప్పటినుంచే లెక్కలు వేసుకుంటున్నారు. చెన్నై, ముంబై జట్ల అభిమానులకు కెప్టెన్ ఎవరన్నది అందరికి తెలిసిందే. కెప్టెన్సీ విషయంలో ఈ రెండు జట్ల గురించి పెద్దగా చర్చ జరగదు కానీ మిగిలిన జట్లకు కెప్టెన్‌గా ఎవరుంటారన్నదానిపై విపరీత చర్చ జరుగుతుంది. ముఖ్యంగా సన్‌రైజర్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్(Kolkata Knight Riders) కెప్టెన్లు ఎవరన్నదాన్నిపై ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే ఈ రెండు జట్లకు కెప్టెన్సీ మార్పు ఎంతైనా అవసరం. ఇదే సమయంలో కేకేఆర్ నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ ఎవరో తేలిసిపోయింది. కోల్‌కతా కెప్టెన్‌గా వరల్డ్‌కప్‌హీరో: కేకేఆర్ కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer) కొనసాగుతాడని కోల్‌కతా నైట్ రైడర్స్ CEO వెంకీ మైసూర్ ప్రకటించారు. శ్రేయాస్ అయ్యర్ గాయం కారణంగా ఈ సీజన్ ఐపీఎల్‌లో ఆడలేదు. ఈ సీజన్‌లో నైట్ రైడర్స్ ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానంలో నిలిచింది. మొత్తం 14 మ్యాచ్‌ల్లో కేవలం ఆరు మ్యాచ్‌లే గెలిచింది నైట్‌రైడర్స్. ఏ దశలోనూ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ ఏడాది కెప్టెన్‌గా నితీశ్‌రాణా వ్యవహరించాడు. ఇప్పుడు మళ్లీ శ్రేయాస్ అయ్యర్ గాయం నుంచి కోలుకోని వరల్డ్‌కప్‌లోనూ అదరగొట్టడంతో వచ్చే సీజన్‌లో అయ్యర్‌కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది మ్యానేజ్‌మెంట్. వైస్‌కెప్టెన్‌గా నితీశ్‌రాణా ఉండనున్నాడు. శ్రేయాస్ అయ్యర్ (FILE) కమ్‌బ్యాక్ కెప్టెన్.. కమ్‌బ్యాక్ మెంటర్: 'గాయం కారణంగా శ్రేయాస్ IPL 2023కి దూరమవడం నిజంగా దురదృష్టకరం. అతను తిరిగి వచ్చి కెప్టెన్‌గా నాయకత్వం వహించినందుకు మేము సంతోషిస్తున్నాము. గాయం నుంచి కోలుకోవడానికి అతను కష్టపడి పనిచేసిన విధానం, అతని ఫామ్ ప్రదర్శించడం అతని పాత్రకు నిదర్శనం.' అని వెంకీ మైసూర్ తెలిపారు. ఇక ఈ వరల్డ్‌కప్‌లో అయ్యర్ అదరగొట్టాడు. ఆస్ట్రేలియాపై ఆడిన తొలి మ్యాచ్‌లో విఫలమైనా.. తర్వాత లీగ్‌లో మిగిలిన మ్యాచ్‌ల్లో రాణించాడు. ముఖ్యంగా సెమీస్‌లో అయ్యర్ చేసిన మెరుపు శతకాన్ని అభిమానులు ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు. సెమీస్‌లో భారత్ గెలుపునకు అయ్యర్ ఇన్నింగ్సే కారణమని చెప్పవచ్చు. టోర్నీలో మొత్తం 500కు పైగా పరుగులు రాబట్టాడు అయ్యర్. ఇక ఇదే ఫామ్‌ను ఐపీఎల్‌లోనూ కొనసాగించాలని.. ఆ జట్టు మ్యానేజ్‌మెంట్ భావిస్తోంది. మరోవైపు గత నెలలో గౌతమ్ గంభీర్ మెంటార్‌గా ఫ్రాంచైజీకి తిరిగి వచ్చినట్లు నైట్ రైడర్స్ ధృవీకరించింది. గంభీర్ 2012 , 2014లో కోల్‌కతాను రెండు సార్లు విజేతగా నిలిపాడు. 2018 సీజన్‌కు ముందు జట్టు అతడిని విడుదల చేసింది. ఇక గంభీర్ రిటైర్మెంట్ తర్వాత అతను లక్నో సూపర్ జెయింట్స్‌కు రెండేళ్లపాటు (2022,2023లో) మెంటార్‌గా పనిచేశాడు. ఇక తిరిగి మళ్లీ కోల్‌కతా నైట్‌రైడర్స్ చెంతకు చేరాడు. Also Read: ఐదుగురు లోక్‌సభ ఎంపీలు సస్పెన్షన్..! WATCH: #shreyas-iyer #ipl-2024 #ipl-auction-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి