Lok Sabha MP Suspension : లోక్‌సభ(Lok Sabha) లో తీవ్ర గందరగోళం సృష్టించిన ఐదుగురు ఎంపీలను సస్పెండ్ చేశారు. భద్రత ఉల్లంఘనపై చర్చ సందర్భంగా లోక్‌సభలో క్రమశిక్షణను పాటించలేదని ఐదుగురు ఎంపీలను సస్పెండ్ చేశారు. అటు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్‌ను రాజ్యసభ నుంచి మిగిలిన సెషన్లకు సభ చైర్మన్ సస్పెండ్ చేశారు.
Derek O'Brien's latest parliamentary stunt is so innovative, it might actually make it into the next Ripley's Believe It or Not! #CircusPolitics #SuspensionSpectacle #derekobrien #Loksabha
Habitual offenders, shame in name of member of parliament. #WestBengal #TMC… pic.twitter.com/qZ1nWYEwsf
— Pratik (@SymbolicPareek) December 14, 2023
మరోవైపు పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనకు సంబంధించి ఢిల్లీ పోలీసులు కఠినమైన చట్టవిరుద్ధ కార్యకలాపాల చట్టం కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. 2001 పార్లమెంట్ ఉగ్రదాడి వార్షికోత్సవం సందర్భంగా నిన్న(డిసెంబర్ 13) నాడు జరిగిన భారీ భద్రతా ఉల్లంఘనలో, ఇద్దరు వ్యక్తులు -- సాగర్ శర్మ, మనోరంజన్ జీరో అవర్‌లో పబ్లిక్ గ్యాలరీ నుంచి లోక్‌సభ ఛాంబర్‌లోకి దూకారు. డబ్బాల నుంచి పసుపు వాయువు విడుదల చేసి నినాదాలు చేశారు. కొంత మంది ఎంపీల వారిని పట్టుకున్నారు. అదే సమయంలో, మరో ఇద్దరు నిందితులు -- అమోల్ షిండే, నీలం దేవి -- పార్లమెంట్ ఆవరణ వెలుపల "తనాషాహీ నహీ చలేగీ" అని అరుస్తూ తెచ్చుకున్న డబ్బాల నుంచి రంగు వాయువును చల్లారు.
రాజకీయాలు చేయకూడదు:
ఇక సభ నుంచి సస్పెండ్ అయిన ఎంపీల్లో డీన్ కురియాకోస్, హిబీ ఈడెన్, జోతిమణి, రమ్య హరిదాస్, టీఎన్ ప్రతాపన్ ఉన్నారు. గందరగోళం మధ్య, భద్రతా ఉల్లంఘనపై ప్రతిపక్ష ఎంపీలు నిరసనను కొనసాగించారు. దీంతో లోక్‌సభ మధ్యాహ్నం మూడు గంటలకు వాయిదా పడింది. అంతకముందు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి కీలక వ్యాఖ్యలు చేశారు. భద్రతా ప్రోటోకాల్‌లను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. పార్లమెంట్‌లో భద్రతను మరింత పటిష్టం చేసేందుకు లోక్‌సభ స్పీకర్ ఫ్లోర్ లీడర్‌లందరితో సమావేశమయ్యారు. వారి చెప్పినదంతా విన్నారు. వారి సూచనలను ఇప్పటికే అమలు చేసినట్లుగా సమాచారం. ఈ అంశంపై ఎలాంటి రాజకీయాలు చేయకూడదని జోషి అన్నారు నొక్కి చెప్పారు.
Also Read: అలా ఎలా అంటారు మేడం.. పీరియడ్ లీవ్ పై సెన్సేషనల్ అవుతున్న స్మృతి వ్యాఖ్యలు
WATCH: