SRH: ఫైనల్‌కి వచ్చేశాం.. ఇక కాస్కోండి కోల్‌కతా తమ్ముళ్ళు.. దబిడి దిబిడే!

సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ సీజన్ 17 ఫైనల్లోకి అడుగుపెట్టింది. శుక్రవారం చిదంబరం స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. మే 26న కోల్‌కతాతో టైటిల్ పోరుకోసం తలపడనుంది.

SRH: ఫైనల్‌కి వచ్చేశాం.. ఇక కాస్కోండి కోల్‌కతా తమ్ముళ్ళు.. దబిడి దిబిడే!
New Update

IPL 2024: సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ సీజన్ 17 ఫైనల్లోకి అడుగుపెట్టింది. శుక్రవారం చిదంబరం స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 36 పరుగుల తేడాతో ఎస్ ఆర్ హెచ్ ఘన విజయం సాధించింది. మే 26న కోల్‌కతాతో టైటిల్ పోరుకోసం తలపడనుంది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్ రైజర్స్ 175/9 పరుగులు చేసింది. మొదట్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన రాజస్థాన్ బౌలర్లు.. హైదరాబాద్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టారు. అయితే ట్రావిస్ హెడ్ 34 పర్వాలేదనిపించగా.. రాహుల్ త్రిపాఠి 37 పరుగులకే ఔటయ్యాడు. దీంతో క్రీజులోకి వచ్చిన క్లాసెన్ 34 బంతుల్లో 50 రన్స్ తో జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ముగ్గురు తప్పా మిగతా బ్యాటర్లు ఎవరూ రెండు అంకెల స్కోర్ చేయలేకపోయారు. రాజస్థాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 3, ఆవేశ్ ఖాన్ 3, సందీప్ శర్మ 2 వికెట్లు దక్కించుకున్నారు.

175 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన రాజస్థాన్ బ్యాటర్లను హైదరాబాద్ బౌలర్లు క్రీజులో కుదురుకోనివ్వలేదు. వరుసగా వికెట్లు తీశారు. యశస్వీ జైస్వాల్ 42, ధ్రవ్ జూరెల్ 56 మినహా మిగతా బ్యాటర్లు ఎవరూ అంతగా రాణించలేదు. దీంతో రాజస్థాన్ 20 ఓవర్లలో 139/7 పరుగులు చేసి ఓటమి పాలైంది.

#ipl-final #kolkata #rajastan #srh
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి