CSK vs RCB: ఇలా సింగిల్‌గా కప్‌లు గెలవడం మన వల్ల కాదు భయ్యా.. పొత్తులు పెట్టుకుంటే బెటర్!

సింగిల్‌గా కప్‌లు గెలవలేమని.. ఎవరో ఒకరితో పొత్తు పెట్టుకుంటే మంచిదని ఓ యూజర్ చేసిన ట్వీట్‌ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఐపీఎల్‌-17 ఎడిషన్‌ తొలి మ్యాచ్‌లో చెన్నైపై ఆర్‌సీబీ ఓడిపోయింది. దీంతో ఆర్‌సీబీపై సోషల్‌మీడియాలో మీమ్స్‌ పేలుతున్నాయి. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
CSK vs RCB: ఇలా సింగిల్‌గా కప్‌లు గెలవడం మన వల్ల కాదు భయ్యా.. పొత్తులు పెట్టుకుంటే బెటర్!

IPL 2024 - Trolls On RCB: ఈ సాలా కప్‌ నమ్‌దీ అన్నారు అమ్మాయిలు.. ఇటు అబ్బాయిలు మాత్రం ఎప్పటిలాగే నెక్ట్స్‌ సాలా కప్‌ నమ్‌దే అనేలాగే ఉన్నారు. విమెనన్స్‌ ప్రిమియర్‌ లీగ్‌ రెండో ఎడిషన్‌లోనే బెంగళూరు రాయల్‌ ఛాలెంజర్స్‌ అమ్మాయిలు కప్‌ సాధించారు. ఇటు మెన్స్‌ టీమ్‌ 17వ సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఓటమితో ప్రారంభించింది. ఓడిపోవడం సంగతి పక్కన పెడితే అసలు గెలవాలన్న ఉద్దేశ్యమే లేనట్టు ఆడింది ఆర్‌సీబీ (RCB). బ్యాటింగ్‌లో కార్తిక్‌, రావత్‌ ఆడబట్టి సరిపోయింది కానీ లేకపోతే ఘోరమైన ఓటమి మూటగట్టుకోవాల్సి వచ్చేది. తొలి మ్యాచ్‌తోనే ఆర్‌సీబీని తక్కువ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు కానీ అటు సోషల్‌మీడియా ఊరుకుంటుందా? బెంగళూరు ఓడిపోయిన ప్రతీసారి మిమ్స్‌ పేలుతాయి. నిజానికి ఈ జోకులను ఆర్‌సీబీ ఫ్యాన్స్‌ కూడా ఎంజాయ్‌ చేస్తారు. అంతటి స్పోరిటివిటీ ఆ జట్టు అభిమానులది.


చంద్రబాబును అంటున్నారా?
ఐపీఎల్‌-17 ఎడిషన్‌ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆరు వికెట్ల తేడాతో బెంగళూరుపై విక్టరీ కొట్టింది. ఆర్‌సీబీ సెట్‌ చేసిన 174 పరుగుల టార్గెట్‌ను 4 వికెట్లు కోల్పోయి 18.4 ఓవర్లలో ఛేదించింది రుతురాజ్‌ టీమ్‌. దీంతో ఆర్‌సీబీ ఓటమిపై క్రికెట్‌ అభిమానులు ఎప్పటిలానే సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అందులో ఓ యూజర్‌ చేసిన ట్వీట్‌ తెగ వైరల్‌ అవుతోంది. ఇలా సింగిల్‌గా కప్‌లు గెలవలేమని ఎవరో ఒకరితో పొత్తు పెట్టుకుంటే మంచిదని ఓ యూజర్ చేసిన ట్వీట్‌ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇది పరోక్షంగా చంద్రబాబుకు చురకలంటించే విధంగా ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. ఈ మూడు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటికి దిగుతున్నాయి. అటు జగన్‌ పార్టీ సింగిల్‌గా పోటి చేస్తోంది. ఈ పరిణామాలను మ్యాచ్‌ చేసే ఆ యూజర్‌ ఇలా ట్వీట్ పెట్టినట్టుగా తెలుస్తోంది. నిజానికి చంద్రబాబు సింగిల్‌గా పోటి చేయరనే విమర్శ ఎప్పటినుంచో ఉంది.


కొంపముంచిన బ్యాటర్లు
ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే ముందుగా బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 రన్స్ చేసింది. ఓపెనర్‌ డుప్లెసిస్‌ (Du Plessis) ఆరంభంలో దూకుడుగా ఆడాడు. 23 బంతుల్లోనే 35 పరుగులు చేశాడు డుప్లెసిస్‌. అయితే అతను ఔటయ్యాక పరిస్థితి మారిపోయింది. రజాత్‌ పటిదార్‌, మ్యాక్స్‌వెల్‌ బాతు గుడ్లు పెట్టి వెళ్లిపోయారు. దీంతో కోహ్లీ (Virat Kohli), గ్రీన్‌ మరో వికెట్‌ పడకుండా టుక్‌ టుక్‌ బ్యాటింగ్‌ చేశారు. ఆ తర్వాత బ్యాట్‌కు పని చెబుతురానుకుంటే అలా జరగలేదు. ఇద్దరు స్వల్వ వ్యవధిలో పెవిలియన్‌కు చేరారు. అయితే అనుజ్‌ రావత్‌, దీనేశ్‌ కార్తిక్‌ పోరాటంలో ఆర్‌సీబీ 173 రన్స్‌ చేయగలిగింది. అటు టార్గెట్‌ ఛేజింగ్‌లో చెన్నై ఆడుతూ పాడుతూ గెలిచేసింది.

Also Read: ఏళ్ళు గడుస్తున్నా చెన్నై గడ్డపై కోహ్లీకి లేని విక్టరీ.. ధోనీ చేతిలో మరోసారి ఓటమి!

Advertisment
Advertisment
తాజా కథనాలు