Jobs: IOCLలో జాబ్స్‌కి నోటిఫికేషన్‌.. అర్హత, శాలరీ, ఖాళీల వివరాలివే!

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL) అప్రెంటీస్ పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం అర్హులైన, ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. మొత్తం 490 ఖాళీలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. టెక్నీషియన్, ట్రేడ్ అప్రెంటీస్, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ (టెక్నికల్, నాన్-టెక్నికల్) లాంటి పోస్టులకు అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 10 లాస్ట్ డేట్.

Govt Jobs: నిరుద్యోగులకు శుభవార్త..ఈ ప్రభుత్వ సంస్థలో వెయ్యికి పైగా పోస్టులకు రిక్రూట్ మెంట్...పూర్తి వివరాలివే..!!
New Update

IOCL Recruitment 2023: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) దేశవ్యాప్తంగా 490 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపిక ప్రక్రియ, ఎలా దరఖాస్తు చేయాలి, అర్హత ఇతరాల వివరాలను ఇక్కడ చెక్ చేసుకోండి. దేశవ్యాప్తంగా టెక్నీషియన్, ట్రేడ్ అప్రెంటీస్/అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్/గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ (టెక్నికల్, నాన్-టెక్నికల్)తో సహా వివిధ ట్రేడ్‌ విభాగాల్లో ఈ ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా సెప్టెంబర్ 10లోపు లేదా అంతకు ముందు ఈ పోస్ట్‌ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎలా ఎంపిక చేస్తారు?
ఆన్‌లైన్ పరీక్షలో అభ్యర్థి పొందిన మార్కుల ఆధారంగా, సంస్థ నిర్ణయించిన నోటిఫైడ్ అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ పరీక్ష ఆబ్జెక్టివ్-టైప్ మల్టిపుల్-ఛాయిస్ ప్రశ్నలతో (MCQ) నిర్వహిస్తారు.

ముఖ్యమైన తేదీలు:
ఈ పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 10. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 25న ప్రారంభించారు.

IOCL Recruitment 2023 : విద్యా అర్హత

‣ ట్రేడ్ అప్రెంటిస్ (ఫిట్టర్) - NCVT/SCVT ద్వారా రెగ్యులర్ ఫుల్ టైమ్ 2-సంవత్సరాల ITI(ఫిట్టర్)తో మెట్రిక్.

‣ ట్రేడ్ అప్రెంటిస్ (ఎలక్ట్రీషియన్) - NCVT/SCVT ద్వారా రెగ్యులర్ ఫుల్ టైమ్ 2-సంవత్సరాల ITI (ఎలక్ట్రీషియన్)తో మెట్రిక్.

‣ ట్రేడ్ అప్రెంటిస్ (ఎలక్ట్రానిక్స్ మెకానిక్) – NCVT/SCVT ద్వారా రెగ్యులర్ ఫుల్ టైమ్ 2-సంవత్సరాల ITI (ఎలక్ట్రానిక్స్ మెకానిక్)తో మెట్రిక్.

‣ ట్రేడ్ అప్రెంటిస్ (ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ ) - NCVT/SCVT ద్వారా రెగ్యులర్ ఫుల్ టైమ్ 2 సంవత్సరాల ITI (ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్)తో మెట్రిక్.
‣ ట్రేడ్ అప్రెంటిస్ (మెషినిస్ట్) - NCVT/SCVT ద్వారా రెగ్యులర్ ఫుల్ టైమ్ 2 సంవత్సరాల ITI (మెషినిస్ట్)తో మెట్రిక్.

‣ టెక్నీషియన్ అప్రెంటిస్ (మెకానికల్) - మెకానికల్ ఇంజనీరింగ్‌లో 3-సంవత్సరాల రెగ్యులర్ ఫుల్ టైమ్ డిప్లొమా.

‣ టెక్నీషియన్ అప్రెంటీస్ (ఎలక్ట్రికల్) - 3-సంవత్సరాల రెగ్యులర్ ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ .

‣ అప్రెంటిస్ (ఇన్‌స్ట్రుమెంటేషన్) - 3-సంవత్సరాల రెగ్యులర్ ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్.

‣ టెక్నీషియన్ అప్రెంటిస్ (సివిల్) - సివిల్ ఇంజనీరింగ్‌లో 3-సంవత్సరాల రెగ్యులర్ ఫుల్ టైమ్ డిప్లొమా.

‣ టెక్నీషియన్ అప్రెంటిస్ (ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్) -3 సంవత్సరాల రెగ్యులర్ ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్.

‣ టెక్నీషియన్ అప్రెంటిస్ (ఎలక్ట్రానిక్స్) -3 సంవత్సరాల రెగ్యులర్ ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్.

‣ ట్రేడ్ అప్రెంటీస్ - అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్/గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (BBA/BA/B. Com/B.Sc.) - ఏదైనా విభాగంలో రెగ్యులర్ ఫుల్ టైమ్ గ్రాడ్యుయేట్.

ఎలా దరఖాస్తు చేయాలి:

🅐 ట్రేడ్ అప్రెంటీస్ పోస్ట్ కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ http://apprenticeshipindia.org/ విజిట్‌ చేయాలి

🅑 అడిగిన వివరాలతో నమోదు చేసుకోండి.

🅒 దరఖాస్తు ఫారమ్‌ను పూరించడానికి అభ్యర్థి రిజిస్ట్రేషన్‌పై క్లిక్ చేయండి.

🅓 అదేవిధంగా, ట్రేడ్ అప్రెంటీస్, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ కోసం, అభ్యర్థులు https://www.mhrdnats.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా తమను తాము నమోదు చేసుకోవాలి.. దరఖాస్తు ఫారమ్‌ను ఫిల్ చేయాలి.

CLICK HERE FOR NOTIFICATION DETAILS

ALSO READ: నిరుద్యోగులకు బంపర్‌ న్యూస్.. 12వ తరగతి అర్హతతో 41,822 ఉద్యోగాలు.. చెక్‌ డీటైల్స్!

#iocl-recruitment #jobs #iocl-recruitment-2023 #iocl-recruitment-2023-apply-online #apprentice-vacancies #indian-oil-corporation #iocl-notification-2023 #iocl-vacancy-2023 #apply-iocl-recruitment-2023
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe