Jobs: నిరుద్యోగులకు బంపర్‌ న్యూస్.. 12వ తరగతి అర్హతతో 41,822 ఉద్యోగాలు.. చెక్‌ డీటైల్స్!

మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్ (MES) ద్వారా 41,822 పోస్టులు భర్తీ కానున్నాయి. ఆర్కిటెక్ట్ కేడర్, బ్యారక్ అండ్ స్టోర్ ఆఫీసర్, సూపర్‌వైజర్ , డ్రాఫ్ట్స్‌మ్యాన్, స్టోర్ కీపర్, మల్టీ-టాస్కింగ్ స్టాఫ్, Mate(మేట్) పోస్టులను ఫిల్ చేయనున్నారు. వీటిలో కొన్ని పోస్టులకు టెన్త్‌ పాస్‌ అయితే చాలు.. మరికొన్ని వాటికి 12వ తరగతి అర్హత ఉండాలి. దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ మరికొన్ని రోజుల్లో రిలీజ్ కానుంది.

New Update
Jobs: నిరుద్యోగులకు బంపర్‌ న్యూస్.. 12వ తరగతి అర్హతతో 41,822 ఉద్యోగాలు.. చెక్‌ డీటైల్స్!

Indian Army MES Recruitment: మీరు 12వ తరగతి పూర్తి చేశారా? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నారా? అయితే ఈ సూపర్‌ డూపర్‌ న్యూస్‌ మీ కోసమే. 12వ తరతతి అర్హతతో ఏకంగా 41,822 ఉద్యోగాలను భర్తీ చేయనుంది ఆర్మీ. మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్ (MES) ద్వారా 41,822 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి రక్షణ మంత్రిత్వ శాఖ అవకాశం కల్పిస్తోంది. ఈ ఖాళీల కోసం రిక్రూట్‌మెంట్ ప్రక్రియ త్వరలో అధికారిక వెబ్‌సైట్ ద్వారా ప్రారంభమవుతుంది. విద్యార్హతలు, అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, లాంటి మరిన్ని వివరాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. MES అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఇన్ఫో ఉంటుంది.ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం, లాస్ట్ డేట్‌ సబ్మిట్‌ , ఎంపిక ప్రక్రియ లాంటి ముఖ్యమైన తేదీలు త్వరలోనే అభ్యర్థులకు నోటిఫికేషన్‌ ద్వారా తెలుస్తాయి.

ప్రస్తుతం రిలీజైన నోటీస్‌ ప్రకారం.. రిక్రూట్‌మెంట్ డ్రైవ్ సూపర్‌వైజర్, డ్రాఫ్ట్స్‌మన్, స్టోర్ కీపర్ సహా స్థానాలను భర్తీ చేయనుంది.

➼ ఆర్కిటెక్ట్ కేడర్ (గ్రూప్ A): 44 స్థానాలు

➼ బ్యారక్ అండ్ స్టోర్ ఆఫీసర్: 120 స్థానాలు

➼ సూపర్‌వైజర్ (బ్యారాక్ అండ్ స్టోర్): 534 స్థానాలు

➼ డ్రాఫ్ట్స్‌మ్యాన్: 944 స్థానాలు

➼ స్టోర్ కీపర్: 1,026 స్థానాలు

➼ మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS): 11,316 స్థానాలు

➼ Mate(మేట్): 27,920 స్థానాలు

పైన చెప్పిన పోస్టులకు టెన్త్‌, ఇంటర్‌ అర్హత ఉంటుందని తెలుస్తోంది. కొన్ని పోస్టులకు టెన్త్‌ అర్హత సరిపోతుంది. అప్లై చేసుకున్న వాళ్లు డాక్యుమెంట్ వెరిఫికేషన్ (స్క్రీనింగ్), రాత పరీక్ష, వైద్య పరీక్ష, ఇంటర్వ్యూ లేదా ఇతర దశలతో ఎంపిక ప్రక్రియకు సిద్ధంగా ఉండాలి. మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ అనేది ఇండియన్ ఆర్మీ ఇంజనీర్స్ కార్ప్స్‌లో ముఖ్యమైన భాగం. ఇది దేశంలోని అతిపెద్ద నిర్మాణ, నిర్వహణ సంస్థలలో ఒకటి. కీలకమైన వ్యూహాత్మక, కార్యాచరణ మౌలిక సదుపాయాలను నిర్మించడానికి బాధ్యత వహిస్తుంది. దేశంలోని పురాతన రక్షణ మౌలిక సదుపాయాల అభివృద్ధి ఏజెన్సీలలో ఒకటిగా ఉంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు