Coffee: ఆ మేకపిల్ల లేకపోతే ఈరోజు కాఫీనే లేదంట తెలుసా! ఎంతో రుచిగాఉండే కాఫీ చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు. మేక నుంచి కాఫీ పుట్టుకొచ్చింది. ఈ కాఫీ హిస్టరీ తెలియలాంటే 8వ శతాబ్దంలోకి వెళ్లాలి. ఆఫ్రికాలో జరిగిన ఘటన గురించి తెలుసుకోవాలి. ఈ మేక-కాఫీ కథ గురించి పూర్తి సమాచారం కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి. By Bhavana 28 Mar 2024 in Latest News In Telugu వైరల్ New Update షేర్ చేయండి చాలా మందికి ఉదయాన్నే లేవడమే బెడ్ కాఫీ (Coffee) తాగే అలవాటు ఉంటుంది. చాలా మంది దీనిని ఎంతో ఇష్టంగా తాగుతూ ఉంటారు. కాఫీ స్ట్రేస్ రిలీజ్ డ్రింక్. తలనొప్పి, ఒత్తిడి తగ్గడమే కాకుండా ఒత్తిడి కూడా తగ్గుతుందని చాలా మంది విశ్వసిస్తారు. చాలా మందికి కాఫీ కడుపులో పడకపోతే రోజే గడవదు. అయితే చాలా మంది ఇష్టంగా తాగే కాఫీ అసలు ఎలా ఎక్కడ పుట్టిందో తెలిస్తే ఔరా అని నోరెళ్లబెడతారు. అసలు కాఫీ గింజలను కనుక్కొంది మనిషి కాదు అంటే నమ్ముతారా. అవును ఓ మేక పిల్ల కాఫీ గింజల్ని ప్రపంచానికి పరిచయం చేసింది. 8 వ శతాబ్దంలో ఆఫ్రికాలో ఓ మేకల కాపరి.. రోజూ తన మేకలను తీసుకుని అడవికి వెళ్లేవాడు. అక్కడ ఉన్న ఓ చోటు గింజలను అతని మేక పిల్ల తినడం వల్ల చాలా చురుకుగా ఉండేది. అది గమనించిన కాపరి.. అసలు మేక పిల్ల ఏం తింటుందో తెలుసుకోవాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా దానిఇని వెంబడించి చూశాడు. ఆ మేక పిల్ల ఓ మొక్క నుంచి వచ్చే గింజలను ఎంతో ఇష్టంగా తినడం చూసి ఊరి పెద్దలకు కూడా ఆ గింజలను చూపించి తన మేకపిల్ల అంత చురుకుగా ఉండాటానికి గల కారణాన్ని వివరించాడు. ఆ గింజలను పొడిగా చేసి ఊరి వాళ్లను కూడా తాగమంటే వాళ్లు దానిని తాగడానికి ముందుకు రాలేదు. దీంతో ఆ కాపరినే ఓ డ్రింక్ చేసి తాగాడు. ఆ పానీయం చాలా రుచిగా ఉండడమే కాకుండా .. చాలా చురుకుగా అనిపించడంతో ఆ రోజు నుంచి గ్రామస్థులందరూ కూడా ఆ గింజలతో పానీయం చేసుకుని తాగడం ప్రారంభించారు. అలా ప్రపంచానికి ఓ మేక పిల్ల ద్వారా కాఫీ పరిచయం అయ్యిందన మాట. అక్కడ నుంచి కాఫీ ప్రపంచ దేశాలకు పరిచయం అయ్యింది. Also read: యంగ్ హీరో నవీన్ పోలిశెట్టికి అమెరికాలో ప్రమాదం..తీవ్ర గాయాలు! #viral #coffee #facts #intresting మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి