Kalki : 'కల్కి' గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు ఇవే..!

ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం 'కల్కి 2898AD'. మహాభారంతం లోని కొన్ని పాత్రలను తీసుకొని, దానికి ఫిక్షన్‌ జోడీంచి నాగ్‌ అశ్విన్‌ ఈ సినిమాను తెరకెక్కించాడు. సినిమా అంతా 'కల్కి' పాత్ర చుట్టే తిరుగుతుంది. కల్కి గురించి ఎవ్వరికి తెలియని విషయాలు ఈ ఆర్దికల్ లో తెలుసుకుందాం.

Kalki : 'కల్కి' గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు ఇవే..!
New Update

Interesting Facts About Kalki : ప్రభాస్ (Prabhas), దీపికా పదుకొనె (Deepika Padukone), అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), కమల్ హాసన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'కల్కి 2898AD' చిత్రం ఇవ్వాళ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న థియేటర్స్ లో రిలీజ్ అయింది. మహాభారంతం లోని కొన్ని పాత్రలను తీసుకొని, దానికి ఫిక్షన్‌ జోడీంచి నాగ్‌ అశ్విన్‌ ఈ సినిమాను తెరకెక్కించాడు.

సినిమా అంతా 'కల్కి' పాత్ర చుట్టే తిరుగుతుంది. మన పురణాల ప్రకారం మహావిష్ణువు పదో అవతారమే ‘కల్కి’. ఈ సినిమాలో ప్రభాస్ భైరవ క్యారెక్టర్ చేస్తున్నాడు. ట్రైలర్, టీజర్‌ చూస్తే ‘కల్కి 2898 AD’ (Kalki 2898AD) లో ప్రభాస్‌ను కల్కిగా చూపించారు. అయితే కల్కి గురించి ఎవ్వరికి తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

1.కల్కి ట్రైలర్‌లో ‘కాశి’ పట్టణం గురించి ప్రస్తావించారు. భూమి మీద తొలి, చివరి నగరంగా దీనిని అభివర్ణించారు. కాశి(వారణాసి) ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉంది. మొరాదాబాద్ పరిధిలోని సంభాల్ గ్రామంలోని విష్ణుయాష అనే బ్రాహ్మణుడికి 'కల్కి' జన్మిస్తాడు.

2. పురాణాల ప్రకారం.. శ్రావణ మాసంలో శుక్లపక్ష షష్ఠి నాడు కల్కి అవతరిస్తాడు. ఇంగ్లిష్ క్యాలెండర్ ప్రకారం జులై, ఆగస్టు నెలల మధ్య కల్కి జన్మిస్తాడు. అయితే, శ్రీకృష్ణుడు జన్మించిన 21 పక్షాలకు కల్కి భూమిపైకి వస్తాడని కొన్ని హిందు శాస్త్రాలు చెబుతున్నాయి. మరికొన్నింటి ప్రకారం మార్గశిర మాసంలో కృష్ణాష్టమి రోజున కల్కి జన్మిస్తాడు.

3. భూమ్మీద ప్రజలను పీడిస్తున్న శత్రువులను కల్కి సంహరిస్తాడు. సృష్టి రక్షణలో భాగంగా రాక్షసులైన కోక, వికోకలను అంతమొందిస్తాడు. కలియుగ ప్రజలకు వీరి నుంచి విముక్తి కల్పిస్తాడు.

4. కల్కి 64 కళల్లో ఆరితేరిన వాడు. వేదాలను వల్లించినవాడు. దేనినైనా ఎదుర్కోగల సమర్థుడు. అందుకు తగ్గట్టుగానే కల్కి వేషధారణ ఉంటుంది. కల్కి పోరాటంలో పదునైన ఖడ్గాన్ని వాడతాడు. దేవదత్త అనే అశ్వంపై స్వారీ చేస్తూ యుద్ధం చేస్తాడు. వీటి సాయంతో దుష్ఠ శక్తులను చంపేసి సత్య యుగానికి ఆరంభం పలుకుతాడు.

5. కల్కి భగవానుడికి ముగ్గురు సోదరులు కవి, ప్రజ్ఞ, సుమంత్ర ఉంటారు. పురాణాల ప్రకారం కల్కి పద్మావతి, రమా అనే ఇద్దరు యువరాణులను పెళ్లి చేసుకుంటాడు. వీరికి జయ, విజయ, మేఘమాల, బలాహక సంతానం.

6. కలి రాక్షసుడిని అంతం చేశాక కల్కి ఓ 20 ఏళ్ల పాటు భూమ్మీదే ఉంటాడు. శంభాలా రాజ్యాన్ని పాలిస్తాడు. తన జన్మ కర్తవ్యం పూర్తయ్యాక పద్మావతి, రమను వెంటబెట్టుకుని వైకుంఠానికి వెళతాడు.

Also Read : ప్రభాస్ ఫ్యాన్స్ పై పోలీసుల లాఠీఛార్జ్..!

#unknown-facts-about-kalki #kalki-2898-ad-movie #prabhas
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి