Bhairanpally Massacre : ఏరులై పారిన రక్తం.. నిజాం మూకలను తరిమికొట్టిన గ్రామం.. భైరాన్‌పల్లి.. ఈ ఊరు పేరు వింటేనే రజాకార్లు హడలిపోయేవారు. అనేకసార్లు నిజాం మూకలను తరిమికొట్టిన గ్రామం ఇది. ఎన్నికల వేళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా భైరాన్‌పల్లిని తన ప్రసంగంలో గుర్తు చేశారు. దీంతో 1948లో జరిగిన ఆ నాటి నరమేధం గురించి ప్రజలు చర్చించుకుంటున్నారు? By Archana 06 May 2024 in Latest News In Telugu రాజకీయాలు New Update షేర్ చేయండి Razakars : భైరాన్‌పల్లి.. ఈ ఊరు పేరు వింటేనే రజాకార్లు హడలిపోయేవారు.. అనేకసార్లు నిజాం మూకలను తరిమికొట్టిన గ్రామం ఇది.. ఈ గ్రామంలో అడుగుపెట్టేందుకు నిజాం సైన్యాలు వణికిపోయేవి.. నిజాం నిరంకుశ పాలనను నిరసిస్తూ రజాకార్లపై ఎదురొడ్డి పోరాడిన భైరాన్‌పల్లి గ్రామస్తుల గురించి మరోసారి చర్చ మొదలైంది. ఎన్నికల వేళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) భైరాన్‌పల్లిని తన ప్రసంగంలో గుర్తు చేశారు. దీంతో 1948లో జరిగిన ఆ నాటి నరమేధం గురించి ప్రజలు చర్చించుకుంటున్నారు? ఇంతకీ బైరాన్‌పల్లి హత్యాకాండ(Bhairanpally Massacre) ఎందుకు జరిగింది? భైరాన్‌పల్లి గ్రామస్తులను కక్షగట్టి మరీ రజాకార్లు ఎందుకు హత్య చేశారు? చరిత్ర పుటల్లో దాగిన ఈ రక్తాక్షరం గురించి ఇవాళ తెలుసుకుందాం! హైదరాబాద్(Hyderabad) ను మరో కశ్మీర్‌గా మార్చనివ్వను... 2024 మార్చి 15న రజాకార్ సినిమాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్రలో నటించిన తేజ్ సప్రు డైలాగ్ ఇది. ఇటు ఎన్నికల ర్యాలీలో అమిత్ షా రజాకార్ల గురించి ప్రస్తావించడంతో ఇప్పుడీ ఈ డైలాగ్ చర్చనీయాంశమైంది. 40 ఏళ్లుగా రజాకార్ల ప్రతినిధులు పార్లమెంట్‌లో కూర్చున్నారని అసదుద్దీన్ ఒవైసీ టార్గెట్‌గా అమిత్ కామెంట్స్ చేశారు. ఈ సీటును రజాకార్ల నుంచి విముక్తి చేయాలని ఆయన ప్రజలను కోరారు. అమిత్‌షా కామెంట్‌తో రాజకీయ దుమారం రేగింది. ఇక్కడ రజాకార్లు లేరని, రజాకార్లుగా ఉన్న వారు పాకిస్థాన్‌కు పారిపోయారని ఒవైసీ అమిత్‌షాకు కౌంటర్ ఇచ్చారు. 1984 నుండి నిరంతరం అసదుద్దీన్ ఒవైసీ పార్టీ AIMIM ఆధిపత్యం చెలాయిస్తోంది. ఆయన తండ్రి సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ 1999 ఎన్నికల వరకు ఇక్కడి నుంచి ఎంపీగా ఉన్నారు. అప్పటి నుంచి అసదుద్దీన్ ఒవైసీ గెలుస్తూ వస్తున్నారు. హైదరాబాద్‌లో ఎన్నికల ఫలితాలను నిర్ణయించడంలో ముస్లింలది నిర్ణయాత్మక పాత్ర. 2011 జనాభా లెక్కల ప్రకారం హైదరాబాద్‌లో హిందువులు మెజారిటీగా ఉన్నప్పటికీ, ముస్లింలు దాదాపు 45 శాతం ఉన్నారు. ఓ సారి చరిత్రను గుర్తు చేసుకుందాం.. అది 1947.. ఓ వైపు యావత్ దేశం స్వాతంత్య్ర సంబురాల్లో మునిగితేలుతోంది. మరో వైపు నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ రీజియన్‌లోని పల్లెలన్నీ రజాకారు మూకల ఆగడాలతో వణికిపోతున్నాయి. రజాకార్ల దురాగతాలను భరించలేక వారిపై తొలిసారిగా తిరుగుబాటు ప్రకటించిన గ్రామమే భైరాన్‌పల్లి. అందుకే రజాకార్లు భైరాన్‌పల్లిపై కక్షగట్టారు. 1948 ఆగస్టు 27న భైరాన్‌పల్లిపై దాడి చేశారు. ఒకరోజు 500 మంది రజాకార్లు, పోలీసులు గ్రామాన్ని ముట్టడించారు. కనిపించినవారిని కాల్పిచంపారు. ఇలా ఒకే రోజులో 96మందిని చంపేశారు. వీరిలో కొందరిని సజీవ దహనం చేశారు. ఆడవాళ్లపై దారుణాలకు ఒడిగట్టారు. అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఓ టీమ్‌ని హైదరాబాద్‌కు పంపారు . ఎలాంటి పక్షపాతం లేకుండా ఉండేందుకు ప్రతి మతానికి చెందిన వారిని ఈ బృందంలో చేర్చుకున్నారు. ఈ బృందానికి కాంగ్రెస్ పార్టీ నాయకుడు పండిట్ సుందర్‌లాల్ నాయకత్వం వహించారు. బీబీసీలో ప్రచురితమైన వార్తల ప్రకారం, సుందర్‌లాల్ నివేదికలో భయానక అంశాలు ఉన్నాయి. అయితే సుందర్‌లాల్ కమిటీ నివేదికను ప్రచురించడానికి ప్రభుత్వం అనుమతించలేదు. ఎందుకంటే ఈ నివేదిక బయటకు వస్తే హిందూ-ముస్లింల మధ్య మరిన్ని దాడుల ఘటనలు జరిగే అవకాశం ఉందని నాటి నివేదికను నెహ్రూ సర్కార్ దాచిపెట్టిందని చెబుతుంటారు. Also Read: Chilled Beer: చల్లటి బీర్ ఎందుకు టేస్టీగా ఉంటుంది..? పరిశోధనలో తేలిన నిజాలు..! #hyderabad #amit-shah #aimim #bhairanpally-massacre మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి