Happy Birthday Trisha : స్టార్ హీరోయిన్ రేంజ్ నుంచి టాలీవుడ్ కి గుడ్ బై చెప్పే స్టేజ్ కి పడిపోయిన త్రిష.. కారణం?

20 ఏళ్ళ సినీ కెరీర్ లో ఎన్నో మరపురాని సినిమాలతో ఆడియన్స్ ని ఆకట్టుకున్న త్రిష నేడు (శనివారం) తన పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా త్రిష కి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు

Happy Birthday Trisha : స్టార్ హీరోయిన్ రేంజ్ నుంచి టాలీవుడ్ కి గుడ్ బై చెప్పే స్టేజ్ కి  పడిపోయిన త్రిష.. కారణం?
New Update

Interesting Facts About Trisha : ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) లో అగ్ర హీరోయిన్ గా చక్రం తిప్పింది చెన్నై బ్యూటీ త్రిష(Trisha). హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే తన అందం, అభినయంతో ప్రేకులను కట్టిపడేసింది. ఇప్పటికీ అదే అందం, అభినయంతో సౌత్ లో అగ్ర హీరోయిన్ గా కొనసాగుతుంది. 20 ఏళ్ళ సినీ కెరీర్ లో ఎన్నో మరపురాని సినిమాలతో ఆడియన్స్ ని ఆకట్టుకున్న త్రిష నేడు (శనివారం) తన పుట్టినరోజు(Birthday) జరుపుకుంటోంది. ఈ సందర్భంగా త్రిష కి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..

త్రిష కెరీర్ ని టర్న్ చేసిన 'వర్షం'

త్రిష తెలుగులో 'నీ మనసు నాకు తెలుసు' అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది. తరుణ్ హీరోగా నటించిన ఈ మూవీ ఆడియన్స్ ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత ప్రభాస్ తో కలిసి 'వర్షం' సినిమా చేసింది. ఈ సినిమా త్రిష కెరీర్ నే మార్చేసింది. సినిమాలో శైలజ పాత్రలో అద్భుతంగా నటించి.. ఉత్తమ నటిగా ఫిలిం ఫేర్ గెలుచుకుంది. ఆ తర్వాత నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి, స్టాలిన్, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే వంటి సినిమాలతో స్టార్ ఇమేజ్ ని కైవసం చేసుకుంది.

Also Read : ‘వేట్టయాన్’ సెట్స్ లో అడుగుపెట్టిన బిగ్ బీ.. రజినీకాంత్, అమితాబ్ ఆలింగనం, వైరల్ అవుతున్న ఫోటోలు!

వరుస ఫ్లాప్స్ తో టాలీవుడ్ కి గుడ్ బై

త్రిషకు తెలుగులో స్టార్ ఇమేజ్ వచ్చిన కొన్నాళ్ళకు వరుస ప్లాప్స్ ఎదురయ్యాయి. దాంతో టాలీవుడ్ కి గుడ్ బై చెప్పి కోలీవుడ్(Kollywood) కి చెక్కేసింది. అక్కడ మాత్రం వరుస హిట్స్ తో టాప్ హీరోయిన్ రేంజ్ కి వెళ్ళింది. త్రిష చివరగా తెలుగులో 'నాయకి' అనే లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటించింది. 2016 లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్లాప్ అయింది.

ఏడేళ్ల తర్వాత రీ ఎంట్రీ

త్రిష టాలీవుడ్ కి సుమారు ఏడేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తోంది. అదికూడా చిరంజీవి లాంటి స్టార్ హీరో సినిమాతో కావడం విశేషం. చిరంజీవి హీరోగా నటిస్తున్న 'విశ్వంభర' మూవీలో త్రిష కథానాయికగా నటిస్తోంది. మెగాస్టార్ తో చివరగా 'స్టాలిన్' మూవీలో జత కట్టిన త్రిష.. మళ్ళీ ఇన్నేళ్లకు 'విశ్వంభర' లో చిరుతో స్క్రీన్ షేర్ చేసుకోనుండటంతో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వరుస ఆఫర్స్ తో బిజీ బిజీ

త్రిష హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసి దాదాపు 20 ఏళ్లకు పైగా అవుతోంది. అయినా కూడా ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా వరుస ఆఫర్స్ తో దూసుకుపోతోంది. ప్తస్తుతం తమిళ్, తెలుగు, మలయాళ భాషల్లో వరుస సినిమాలు చేస్తోంది. ప్రెజెంట్ ఈ అమ్మడి చేతులు ఐదు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తెలుగులో చిరు సరసన విశ్వంభర, మోహన్ లాల్ రామ్ , కమల్ హాసన్ తో థగ్ లైఫ్, అజిత్ విధా ముయార్చి, టోవినో థామస్ తో ఐడెంటిటీ వంటి సినిమాల్లో నటిస్తోంది.

#kollywood #tollywood #actress-trisha #trisha-birth-day-special
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి