/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-1-1.jpg)
Kesamudram : తెలంగాణ (Telangana) లో కురుస్తున్న భారీ వర్షాలకు (Heavy Rains) పలు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. వాగులు, వంకలు పొంగి రోడ్లు కొట్టుకుపోతున్నాయి. ఇందులో భాగంగానే కే సముద్రం మండలంలోని ఇంటికన్నె-కేసముద్రం మధ్య రైల్వే ట్రాక్ భారీ వరదకు కొట్టుకుపోయింది. దీంతో ఈ మార్గనుంచి వెళ్లే రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వెంటనే యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టిన రైల్వే అధికారులు.
#WATCH | Telangana: The railway track between Tadla Pusapalli and Mahabubabad washed away yesterday due to the incessant rainfall; restoration work is underway. pic.twitter.com/hN5QP96N5Y
— ANI (@ANI) September 2, 2024
ప్రత్యేక రైళ్లలో కాజీపేట నుంచి ఇసుక, సిమెంట్, కంకర తెప్పిస్తున్నారు. దాదాపు మంది కార్మికులు రెండు భారీ క్రేన్ల సాయంతో పనులు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం 50 శాతం మేరకు పనులు పూర్తి చేశారు. దాదాపు 300 మంది కార్మికులు పనిలో నిమగ్నమవగా.. సౌత్ సెంట్రల్ రైల్వే (South Central Railway) జీఎం అరుణ్‌కుమార్ జైన్ రైల్వే ట్రాక్ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్నారు. ఇక మంగళవారం మధ్యాహ్నం వరకూ రైళ్ల రాకపోకలను పునరుద్ధరించనున్నట్లు తెలుస్తోంది.
కేసముద్రంలో రైల్వే ట్రాక్ పునరద్ధరణ | TeluguTopic
రాష్ట్రంలో భారీ వర్షాలతో కేసముద్రం మండలంలోని ఇంటికన్నె-కేసముద్రం రైల్వేస్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్ కొట్టుకుపోయి పలు రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రైల్వే అధికారులు, సిబ్బంది యుద్ధప్రాతిపదికన ట్రాక్ మరమ్మతులు చేపట్టారు.… pic.twitter.com/mwQ8J1Cpna— Telugu Topic (@TeluguTopic) September 2, 2024
వరంగల్ - కేసముద్రం మధ్యలో ఇంటికన్నె వద్ద కొట్టుకు పోయిన రైల్వే ట్రాక్....@SouthCentralRa2#aksharanewsupdatespic.twitter.com/xNj52Vhgt9
— aksharadaily (@aksharadaily) September 1, 2024
మహబూబాబాద్ జిల్లా ఇంటికన్నె రైల్వే ట్రాక్ #RainAlert#railwaypic.twitter.com/vqF33AhO37
— Shareef (@shareef_journo) September 1, 2024
Also Read : దెబ్బతిన్న కనకదుర్గమ్మ ఆలయ ఘాట్ రోడ్డు… పరిశీలించిన మంత్రి!