UPSC: సివిల్స్ అభ్యర్థుల ఇంటర్వ్యూల షెడ్యూల్ రిలీజ్..జనవరి 2 నుంచి..!!

ఎంతో ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీసెస్ 2023 ఇంటర్వ్యూల షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. జనవరి 2వ తేదీ నుంచి ఫిబ్రవరి 16వ తేదీ వరకు వ్యక్తిగత ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. ఈ మేరకు UPSC ఒక ప్రకటన విడుదల చేసింది.

New Update
UPSC : ఈజీగా ప్రిలిమ్స్ పేపర్.. పెరగనున్న కటాఫ్.. అభ్యర్థుల్లో ఆందోళన

UPSC Civil Services Interview Schedule 2023: ప్రతిష్టాత్మకమైన సివిల్ సిర్వీసెస్ 2023 ఇంటర్వ్యూల షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. జనవరి 2వ తేదీ నుంచి ఫిబ్రవరి 16వ తేదీ వరకు వ్యక్తిగత ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు యూపీఎస్సీ (UPSC) ఒక ప్రకటనను విడుదల చేసింది. ఈమధ్యే మెయిన్ పరీక్షల ఫలితాలను రిలీజ్ చేసిన యూపీఎస్సీ...తాజాగా ఇంటర్వ్యూల షెడ్యూల్ ను ప్రకటించింది. అభ్యర్థుల రోల్ నెంబర్, ఇంటర్వ్యూ తేదీ, సమయంతో కూడిన ప్రత్యేక షెడ్యూల్ ను రూపొందించింది.

కాగా సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలకు మొత్తం 2,844మంది అర్హత సాధించారు. అందులో తొలుత 1026మంది అభ్యర్థులకు సంబంధించిన ఇంటర్య్వూ షెడ్యూల్ ను యూపీఎస్సీ రిలీజ్ చేసింది. మిగతా అభ్యర్థుల షెడ్యూల్ ను తర్వాత విడుదల చేయనున్నట్లు యూపీఎస్సీ వెల్లడించింది. ఇంటర్వ్యూలకు సంబంధించి 1026 మంది అభ్యర్థులు తొందరలోనే ఈ కాల్ లెటర్స్ వెబ్ సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు సంస్థ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం నిర్ణయించిన తేదీలు, సమయంలో మార్పులు చేయాలన్న అభ్యర్థులు ఎట్టిపరిస్థితిలోనూ స్వీకరించబోమని యూపీఎస్సీ స్పష్టం చేసింది. ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థుల రవాణా సంబంధిత ఖర్చులకు రీయింబర్స్ చేస్తామని పేర్కొంది. అయితే రైళ్లలో సెకండ్, స్లీపర్ తరగతుల ప్రయాణానికి మాత్రమే డబ్బులు చెల్లించనున్నట్లు యూపీఎస్సీ తెలిపింది.

గత మే నెలలో సివిల్స్ ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు సుమారు 5లక్షల మంది హాజరయ్యారు. అందులో 14,624మంది ప్రధాన పరీక్షకు అర్హత సాధించారు. సెప్టెంబర్ 15 నుంచి 24వ తేదీ వరకు మెయిన్ పరీక్షలను నిర్వహించారు. ఆ ఫలితాలు డిసెంబర్ 8న రిలీజ్ చేసిన యూపీఎస్సీ తాజాగా ఇంటర్వ్యూలకు షెడ్యూల్ ను ఖరారు చేసింది. ఏపీ, తెలంగాణ నుంచి సుమారు 90 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు అర్హత సాధించినట్లుగా సమాచారం.

అటు యూపీఎస్సీ ఇంటర్వ్యూకి అర్హత సాధించిన అభ్యర్థులు...ఇంటర్వ్యూ తేదీలను యూపీఎస్సీ అధికారిక upsc.gov.in లో చెక్ చేసుకోవచ్చు.

- upsc.gov.in. వెబ్ సైట్ హోం పేజీలో కనిపించే UPSC Civil Services 2023 interview schedule లింక్ పై క్లిక్ చేయండి.
-ఇప్పడు కొత్త పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది.
-దానిలో మీ పేరు, రోల్ నంబర్ సహాయంతో మీ ఇంటర్వ్యూ తేదీని, సెషన్ టైమ్ ను చూడండి.
-భవిష్యత్ అవసరాల కోసం ఆ వివరాలున్న పేజీని డౌన్ లోడ్ చేసుకుని భద్రపరుచుకోండి.
-దానితోపాటు ఒక హార్డ్ కాపీని తీసుకుని భద్రపర్చుకోండి.

ఇది కూడా చదవండి: రైల్వే నుంచి భారీ నోటిఫికేషన్.. ఈ రెండు అర్హతలుంటే చాలు

Advertisment
తాజా కథనాలు