international artists day:నేడు అంతర్జాతీయ కళాకారుల దినోత్సవం

కళ....ప్రతీ మనిషి జీవితంలో ఒక పార్ట్. ప్రతీ ఒక్కరి లైఫ్ లో ఏదో ఒక రూపంలో కళ ఉంటూనే ఉంటుంది. కొందరు అందులో నిష్ణాతులు అయితే...మరి కొందరు హాబీ వరకే దాన్ని పరిమితం చేస్తారు. మనిషికి ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని ఇచ్చేది కళ. అది ఏ రూపంలో ఉన్నా కూడా. ఈరోజు అంటే అక్టోబర్ 25 అంతర్జాతీయ కళాకారుల దినోత్సవం. కళలే జీవితంగా బతుకుతున్న వారి రోజు ఈ రోజు.

international artists day:నేడు అంతర్జాతీయ కళాకారుల దినోత్సవం
New Update

కళ...మనలోని భావాలను వ్యక్త పరిచడానికి ఒక సాధనం. మనం చేసే ప్రతీ పనిలో మన కళ దాగి ఉంటుంది. దేనినైనా సృజనాత్మకంగా చేస్తే అది కళే అవుతుంది. అలా కాకుండా కొన్ని కళలు ఉంటాయి. వాటిల్లో ప్రేకంగా నైపుణ్యం సంపాదించవలసి ఉంటుంది. మనకు మొత్తం 64 కళలు ఉన్నాయి. అందులో చోర కళ తప్పించి మిగతావన్నీ ప్రత్యేకమైనవి.

మనకు ప్రాచీన కాలం నుంచీ కళలు ఉన్నాయి. చరిత్రలో వీటిని ప్రత్యేకంగా చెప్పకపోయినప్పటికీ ఆదిమ మానవులు వేసిన చిత్రాల ద్వారా అవి మనకు తెలుస్తాయి. అసలు ఆ చిత్రాలు వేయడమే ఓ పెద్ద కళ. తర్వాత తర్వాత పాటలు, డాన్సులు లాంటివి అన్నీ కళలుగా ప్రసిద్ధిగాంచాయి. వీటిల్లో అనేకమంది కళాకారులు నిష్ణాతులు అయ్యారు.

క్రియేటివ్ పనులు చేసే వారి కోసమే ఈరోజు. కళల్లో నిష్ణాతులు అయిన వారి గౌరవార్ధం అంతర్జాతీయ కళాకారుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వాళ్ళల్లో ఉన్న క్రియేటివ్ ను మరింత ప్రోత్సాహించడానికే ఈరోజును పెట్టారు. కళాకారులు చేసే సృజన అందరికీ సాధ్యం కాదు. వారిలో ఎంతో టాలెంట్ ఉంటే కానీ అదభుతమైన కళారూపాలు బయటికి రావు. వాళ్ళు దాని కోసం రాత్రంబవళ్ళు కష్టపడతారు. దానికి గుర్తింపుగానే ఈ కళాకారుల దినోత్సవం.

రొమాంటిక్ రియలిజమ్ లో స్పెషలిస్ట్ అయిన క్రిస్ మెక్ క్లయిర్ అనే కెనడియన్ అనే ఆర్టిస్ట్ ఈ కళాకారుల దినోత్సవాన్ని మొదలుపెట్టారు అని చెబుతారు. ఈయన ఒక పెయింటర్. ఈయన వేసిన పెయింటింగ్ లలో జీవితాన్ని చూపించే ఒక రొమాంటిక్ రియలిజం ఉంటుంది. కెనడాలో మెక్ క్లయిర్ కు పెద్ద పేరు ఉంది. ఆర్టిస్టులు తమలోని ఆర్టిస్టిక్ వ్యూని మరింత మెరుగుపర్చుకోవడానికే ఈరోజు ఉద్దేశమని మెక్ క్లయిర్ అంటారు.

అంతర్జాతీయ కళాకారుల దినోత్సవం రోజు ఏం చేయాలంటే....మన చుట్టుపక్కల ఉన్న కళాకారులను గుర్తించి...వారిని సాధ్యమైన రీతిలో సత్కరించాలి. వారు వారి రంగాల్లో మరింత ముందు వెళ్ళేలా ప్రోత్సాహించాలి. ఏ కళకు అయినా కళాకారునికి అయినా ఉత్సాహానిచ్చేది తగినంత ప్రోత్సాహమే. ఒక చిన్న మెచ్చుకోలు కూడా వాళ్ళల్లో క్రియేటివ్ నెస్ ను మరింత పెంచుతుంది అంటారు. కాబట్టి మీరు కూడా మీ చుట్టుపక్కల కళాకారులను ప్రోత్సహించండి. కళలను అభివృద్ధికి దోహదపడండి.

#international #october #artists #day
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe