Gaza:ప్రజలు ఆకలితో చచ్చిపోతుంటే..సిన్వర్‌ భార్య చేతిలో 27లక్షల బ్యాగ్‌

ఇజ్రాయెల్ దాడితో గాజా అతలాకుతలమై తిండి, నీళ్లు దొరక్క ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల ఇజ్రాయెల్‌ దాడుల్లో చనిపోయిన యహ్యా సిన్వార్‌ భార్య చేతిలో 27 లక్షల హ్యాండ్‌ బ్యాగ్‌ ఇప్పుడు చర్చనీయాంశమైంది.

New Update
hand bag

Gaza: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పారిస్‌ కు చెందిన సూపర్‌ లగ్జరీ హ్యాండ్‌ బ్యాగ్‌ తయారీ సంస్థల్లో హెర్మెస్‌ ఒకటి. తాజాగా ఈ కంపెనీ పేరు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎందుకంటే.. ఇటీవల ఇజ్రాయెల్ చేతిలో హతమైన హమాస్ చీఫ్ యహ్యా సిన్వర్ భార్య ఆ హ్యాండ్‌బ్యాగ్‌తో కనిపించడమే. 

Also Read:  ప్రభాస్ - సమంత కాంబోలో మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా?

తిండి, నీళ్లు దొరక్క..

ఇజ్రాయెల్ దాడితో గాజా అతలాకుతలమై తిండి, నీళ్లు దొరక్క ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న వేళ 32 వేల డాలర్లు (అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 27 లక్షలు) బ్యాగుతో కనిపించి అందర్ని షాక్ కి గురి చేశారు. సాధారణంగా హెర్మెస్ కంపెనీ హ్యాండ్‌బ్యాగ్‌లను  హాలీవుడ్ హీరోయిన్లు ఉపయోగిస్తుంటారు. కిమ్ కర్దాషియన్ మొదలు ఎంతోమంది ఈ బ్యాగులపై మనసు పారేసుకున్నారు. అలాంటి బ్యాగు ఇప్పుడు సిన్వర్ భార్య అబు జామెర్ చేతిలో కనిపించింది. 

Also Read:  సీఎం రేవంత్‌పై తిరగబడ్డ జీవన్ రెడ్డి!

ఇజ్రాయెల్ నుంచి తమకు ప్రమాదం పొంచి ఉందని భావించిన సిన్వర్ కుటుంబంతో కలిసి బంకర్‌లోకి వెళ్తున్న సమయంలో జామెర్ చేతిలో ఈ బ్యాగ్ కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఇజ్రాయెల్ సైన్యం తాజాగా విడుదల చేసింది. అప్పటి నుంచి ఈ బ్యాగుపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. గాజా ప్రజలు చేతిలో చిల్లిగవ్వ లేక, తినడానికి తిండి లేక ఈ పూట గడిస్తే చాలన్న భావనలో క్షణమొక యుగంగా బతుకుతున్నారు. 

Also Read:  అన్నారం బ్యారేజ్ లో నిర్మాణంలో నాణ్యతే లేదు.. కాళేశ్వరంపై మరో షాకింగ్ రిపోర్ట్!

అలాంటి సమయంలో అబు జామెర్ చేతిలో కనిపించిన ఈ ఖరీదైన బిర్కిన్ బ్యాగ్ తీవ్ర చర్చకు తెరలేపింది. ఈ వీడియో వెలుగులోకి వచ్చిన తర్వాత సిన్వర్ భార్య లగ్జరీ లైఫ్‌పై చర్చ మొదలైంది.ఓ పక్క గాజా ప్రజలు డబ్బు, తిండి లేకుండా బాధపడుతుంటే సిన్వర్, ఆయన భార్యకు డబ్బంటే ఎంత ప్రేమో ఈ బ్యాగ్ రుజువు చేస్తోందని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. డబ్బులు పుష్కలంగా ఉన్నప్పటికీ చాలామంది ఈ బ్యాగు కొనేందుకు వెనకాడతారని మరొకరు రాసుకొచ్చారు.

Also Read:  ఈడీ విచారణకు ఐఏఎస్ అధికారి.. మాజీ మంత్రికి షాక్!

Advertisment
Advertisment
తాజా కథనాలు