ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్.. ఎక్కడుందో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్ చైనాలో కియాన్‌జియాంగ్‌లోని సెంచురీ నగరంలో ఉంది. రీజెంట్ ఇంటర్నేషనల్‌గా పిలిచే ఈ అపార్ట్‌మెంట్‌లో దాదాపుగా 30 వేల మంది వరకు నివసించవచ్చు. 2013లో నిర్మించిన ఈ అపార్ట్‌మెంట్‌లో అన్ని సదుపాయాలు ఉన్నాయి.

big apartment
New Update

ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్ చైనాలోని కియాన్‌జియాంగ్‌లో ఉంది. 675 అడుగుల ఎత్తులో ఉన్న ఈ అపార్ట్‌మెంట్ సెంచురీ నగరంలో ఉంది. మొత్తం 39 అంతస్తులో ఎస్ ఆకారంలో ఉన్న ఈ బిల్డింగ్‌ను 14 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. ఇంతటి అద్భుత కట్టడంలో దాదాపుగా 30 వేల మంది వరకు నివసించవచ్చు. భారీ అపార్ట్‌మెంట్ అయినప్పటికీ ఇందులో సౌకర్యాలకు కూడా లోటు ఉండదు. ఆ అపార్ట్‌మెంట్ లోపలే అన్ని వస్తువులు దొరుకుతాయి.

ఇది కూడా చూడండి: Chennai: మెరీనా బీచ్‌లో తొక్కిసలాట.. ఐదుకు చేరిన మృతుల సంఖ్య!

సదుపాయాలకు లోటు లేదు

ఏ వస్తువు కొనడానికైనా బయటకు వెళ్లవలసిన అవసరం లేదు. రెస్టారెంట్లు, షాప్‌లు, స్కూళ్లు, షాపింగ్ మాల్స్, ఆసుపత్రులు అన్ని వసతులను అపార్ట్‌మెంట్‌లో కల్పించారు. ఇందులో ఇప్పటికి 20 వేల మంది నివాసం ఉంటున్నారు. ఇంకా 10 వేల మందికి సరిపడా ఫ్లాట్‌లు ఉన్నాయి. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్ కదా.. రెంట్ ఎక్కువగా ఉంటుందని అనుకోవద్దు. మీకు కావాల్సిన విస్తీర్ణం బట్టి రేటు ఉంటుంది. దాదాపుగా రూ.18 వేల నుంచి రూ.50 వేల వరకు అపార్ట్‌మెంట్‌లో అద్దె ఉంటుందట. 

ఇది కూడా చూడండి: IMD: తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు..!

ఈ అపార్ట్‌మెంట్‌ను రీజెంట్ ఇంటర్నేషనల్ అంటారు. 2013లో ప్రారంభమైన ఈ భవనంలో పిల్లలు ఆడుకోవడానికి పార్క్‌లు, స్విమ్మింగ్ పూల్స్, ఫుడ్ కోర్టులు, సెలూన్లు, నిత్యవసర దుకాణాలు ఇలా ఒకటేంటి.. ఎన్న రకాలు ఉన్నాయి. అసలు ఎలాంటి అవసరం వచ్చిన కూడా బయటకు వెళ్లక్కర్లేదు. అన్ని సదుపాయాలు ఈ అపార్ట్‌మెంట్‌లోనే ఉన్నాయి. వేల మంది మనుషులు ఒకేచోట ఉండటానికి నిర్మించిన అత్యాధునిక భవనం ఇది. ఆర్కిటెక్టులు ప్రతిభకు మెచ్చుకోవాల్సిందే. కాకపోతే భూకంపాలు వంటివి వచ్చినప్పుడు కాస్త రీస్క్ ఉండవచ్చు. 

ఇది కూడా చూడండి:  అవమానంతో యువకుడు.. ఏం చేశాడంటే?

 

#apartment
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe