Israel-Iran War: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర వార్.. భారత్ లో టెన్షన్.. కారణమిదే?

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మొదలైన భీకర యుద్ధం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. అమెరికా సాయంతో ఇజ్రాయెల్.. ఇరాన్‌పై పెద్ద ఎత్తున దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా ఇరాన్ కూడా క్షిపణులను ప్రయోగించింది.

New Update
crudel

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మొదలైన భీకర యుద్ధం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. అమెరికా సాయంతో ఇజ్రాయెల్.. ఇరాన్‌పై పెద్ద ఎత్తున దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా ఇరాన్ కూడా క్షిపణులను ప్రయోగించింది.ఈ గొడవ ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో జరుగుతున్నా, దాని ప్రభావం మన ఇండియా మీద కూడా గట్టిగా పడేలా కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం మనం వాడే పెట్రోల్, డీజిల్.

ప్రపంచవ్యాప్తంగా ఒక దేశం నుంచి మరో దేశానికి చమురు వెళ్లేందుకు సముద్రంలో కొన్ని ముఖ్యమైన దారులు ఉంటాయి. అందులో 'హోర్ముజ్ జలసంధి అనేది చాలా ముఖ్యం. ఇది ఇరాన్ దేశానికి దగ్గరగా ఉంటుంది. ప్రపంచంలోని 40% ముడి చమురు ఈ చిన్న దారి గుండానే ఇతర దేశాలకు వెళ్లాలి. ఇప్పుడు గొడవ జరుగుతున్నది ఇక్కడే కాబట్టి, ఇరాన్ గనుక కోపంతో ఈ సముద్ర దారిని మూసివేస్తే, చమురు రవాణా ఆగిపోతుంది.

భారత్‌కు వచ్చే ముప్పు ఏమిటి?

మన దేశం వాడే పెట్రోల్, డీజిల్‌లో దాదాపు 85% ఇతర దేశాల నుంచే వస్తుంది. అందులో సగం కంటే ఎక్కువ చమురు ఈ హోర్ముజ్ దారి గుండానే మనకు చేరుతుంది. ఒకవేళ సరఫరా ఆగిపోతే, చమురు దొరకక రేట్లు విపరీతంగా పెరిగిపోతాయి.పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగితే లారీలు, వాహనాల రవాణా ఖర్చు పెరుగుతుంది. దీనివల్ల మనం రోజూ కొనే పాలు, కూరగాయలు, కిరాణా సామాన్లు.. ఇలా అన్నింటి ధరలు ఆకాశాన్ని తాకుతాయి. చమురు కోసం మనం విదేశాలకు ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. దీనివల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది. మన దేశం ఇప్పటికే రష్యా, అమెరికా వంటి ఇతర దేశాల నుంచి కూడా చమురు కొంటోంది. అయినప్పటికీ, గల్ఫ్ దేశాల నుంచి వచ్చే చమురు ఆగిపోతే మాత్రం భారత్‌కు పెద్ద చిక్కులు తప్పవు. అందుకే ఈ యుద్ధం ఎంత తొందరగా ఆగితే మనందరికీ అంత మంచిది.

భారతీయులకు హెచ్చరిక

మరోవైపు యుద్ధం తీవ్రమవ్వడంతో ఇరాన్, ఇజ్రాయెల్‌లో ఉన్న భారతీయులను మన రాయబార కార్యాలయాలు అప్రమత్తం చేశాయి. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని సూచించాయి. ఎయిర్ ఇండియా వంటి విమాన సంస్థలు తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నాయి లేదా దారి మళ్లించాయి. ఈ యుద్ధం వల్ల ముడి చమురు సరఫరా ఆగిపోతుందన్న భయంతో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరుగుతున్నాయి. ఇరాన్ గనుక సముద్ర మార్గాలను మూసివేస్తే చమురు ధర బారెల్‌కు 130 డాలర్ల వరకు చేరవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు