/rtv/media/media_files/2026/01/06/alwin-2026-01-06-17-03-16.jpg)
ప్రస్తుతం ప్రపంచం అంతా ఒకే ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నారు. అతనే వెనెజువెలా మాజీ అధ్యక్షుడు మదురో. ఇతనిని అమెరికా అరెస్ట్ చేసింది. దాని తరువాత పరిణామాలు కూడా చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. దీంతో మదురోకు సంబంధించిన ప్రతీ వార్తా సెన్సేషనల్ అవుతోంది. అలాగే మదురో అరెస్ట్, విచారణ లాంటి వాటి గురించి అందరూ ఆసక్తిగా తెలుసుకుంటున్నారు కూడా. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి మరొ ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది.
వెనెజువెలా మాజీ అధ్యక్షుడు నికొలస్ మదురో, ఆయన భార్యను నిర్భంధించి తీసుకొచ్చిన అమెరికా వారిని అక్కడి మాన్ హట్టన్ ఫెడరల్ కోర్టులో హాజరుపర్చింది. ఈ కోర్టు న్యూయార్క్ లో ఉంది. ఈ వెనెజువెలా దంపతుల కేసును 92 ఏళ్ళ వయసున్న అల్విన్ హెల్లర్ స్టీన్ విచారించారు. దీంతో ఇప్పుడు ఈయన చాలా ఫేమస్ అయిపోయారు. ముందే చెప్పినట్టు మదురోకు సంబంధించిన ప్రతీ విషయం వైరల్ అవుతోంది. అలాగే అల్విన్ పేరు కూడా ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అయిపోయింది. దీంతో ఎవరీ జడ్జి అంటూ అందరూ తెగ వెతికేస్తున్నారు.
ముక్కుసూటి మనిషి..కొంచెం తిక్క
అల్విన్ హెల్లర్‌స్టీన్ 1933లో న్యూయార్క్‌లో జన్మించారు. కొలంబియా యూనివర్సిటీ లా స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన ఆయన.. తొలినాళ్లలో అమెరికా ఆర్మీలో లాయర్‌గా పనిచేశారు. ఆ తర్వాత ప్రైవేటుగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 1998లో నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్.. అల్విన్‌ను న్యూయార్క్ సదరన్ డిస్ట్రిక్ట్‌కు డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జిగా నామినేట్ చేశారు. అల్విన్ తన కెరీర్ లో చాలా ముఖ్యమైన కేసులకు తీర్పులను ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే ఈ విచారించిన, తీర్పు చెప్పిన కేసులన్నీ చాలా సెన్సేషన్ సృష్టించినవే. అలాగే అల్విన్ చాలా మొండి అని కూడా చెబుతారు. ఈయన కోర్టు పద్ధతులను, సాంప్రదాయ నిబంధనలను పెద్దగా పట్టించుకోరని కూడా అంటారు. తనకు నచ్చినట్టే ఉంటారని చెబుతారు.
9/11 నుంచి ట్రంప్ హష్ మనీ కేసు వరకు..
అల్విన్ విచారించిన కేసుల్లో అతి ముఖ్యమైనవి 9/11 ఉగ్ర కేసు కూడా ఉంది. 2001 సెప్టెంబర్ లో న్యూయార్క్, వాషింగ్టన్‌లో జరిగిన అల్‌ఖైదా ఉగ్రదాడుల కేసును ఈయనే విచారించారు. అలాగే అధ్యక్షుడు ట్రంప్ కు సంబంధించి హష్ మనీ కేసును కూడా అల్వినే విచారణ చేశారు. ఈ కేసును ఫెడరల్ కోర్టుకు మార్చాలంటూ ట్రంప్ చేసిన అభ్యర్థనను తోసిపుచ్చారు. గత 15 ఏళ్ళుగా ఈ 92 ఏళ్ళ జడ్జి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన కేసును విచారిస్తున్నారు. ఇందులో భాగంగా గతేడాది వెనెజువెలా డ్రగ్స్ ముఠా సభ్యులను కోర్టు విచారించకుండా డిపోర్ట్ చేసేందుకు ట్రంప్ యంత్రాంగం చేసిన ప్రయత్నాలను అల్విన్ అడ్డుకున్నారు. ఇదే కేసులో 2020లోనే మదురోపై అమెరికా అభియోగాలు మోపగా.. ఆ దేశ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ హ్యుగో ఆర్మాండో ఇప్పటికే దోషిగా తేలారు. అన్నింటి కంటే ముఖ్యమైన విషయం ఏంటంటే అధ్యక్షుడు ట్రంప్ పరిపాలనకు వ్యతిరేకంగా హెల్లర్ స్టెయిన్ చాలాసార్లు తీర్పు ఇచ్చారని చెబుతున్నారు. ఈయన కోర్టు విధానాలను సరిగ్గా పాటించకపోవడం తప్పితే మిగతా అన్ని విషయాల్లో చాలా నిజాయితీగా ఉంటారని చెబుతున్నారు.
Follow Us