/rtv/media/media_files/2025/07/18/image-1-2025-07-18-10-31-50.png)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్థాన్‌లో పర్యటించనున్నట్లు పాకిస్థాన్ మీడియా గురువారం వార్తలు రాసుకొచ్చింది. దక్షిణాసియా పర్యటనలో భాగంగా ట్రంప్ సెప్టెంబర్ 18న ఇస్లామాబాద్‌లో పర్యటిస్తారని.. అనంతరం భారత్‌లో పర్యటిస్తారని కొన్ని పాక్ మీడియా ఛానళ్లు వార్తలు ప్రచారం చేశాయి. అంతేకాకుండా ఇంటర్‌నేషన్ మీడియా సంస్థలు కూడా ఊహాగానాలు వ్యక్తం చేసింది.
White House shuns Pak media reports on potential Trump visit
— ANI Digital (@ani_digital) July 17, 2025
Read @ANI Story | https://t.co/Dw5hbcnmyT#DonaldTrump#US#Pakistanpic.twitter.com/dmp1cu3s1K
ఆ వార్తలపై అమెరికా అధ్యక్షుడి భవనం వైట్‌హౌస్ స్పందించింది. పాకిస్థాన్‌లో ట్రంప్ పర్యటిస్తున్నట్లు వస్తున్న వార్తలను వైట్‌హౌస్ ఖండించింది. పాకిస్థాన్‌లో ట్రంప్ పర్యటన షెడ్యూల్ లేదని.. ఆ మీడియాలో ప్రసారం అవుతున్న వార్తలు అవాస్తవం అని కొట్టిపారేసింది. ప్రస్తుతానికైతే అలాంటి పర్యటన షెడ్యూల్ ఏదీ లేదని వైట్‌హౌస్ పేర్కొంది. ఇదిలా ఉంటే ట్రంప్ పర్యటన గురించి తమకు ఎటువంటి సమాచారం లేదని విదేశాంగ కార్యాలయ ప్రతినిధి షఫ్కత్ అలీ ఖాన్ కూడా తెలిపారు.
యుఎస్ వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మాట్లాడుతూ.. ట్రంప్ జూలై 25 నుంచి జూలై 29 వరకు స్కాట్లాండ్‌లో పర్యటించనున్నట్లు మీడియాకు వివరించారు. ఈ పర్యటనలో యూకే ప్రధాని కీర్ స్టార్మర్‌తో ట్రంప్ వాణిజ్య చర్చలు జరుపుతారని లీవట్ పేర్కొ్న్నారు. టర్న్‌బెర్రీ, అబెర్డైన్‌ను ట్రంప్ సందర్శిస్తారని తెలిపింది. అమెరికా, -యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య మెరుగైన వాణిజ్య ఒప్పందం కోసమే ట్రంప్ పర్యటన కొనసాగుతుందని స్పష్టం చేసింది.